- అధిష్టానం ఆదేశాలతో చేరికల కార్యక్రమం
- పార్టీని వీడి తిరిగి పార్టీలో చేరాలనుకునేవారికి అవకాశం
- ఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షి అనుమతితోనే చేరికలు
- ఘర్ వాపసీ కార్యక్రమంలో భాగంగా భారీగా చేరికలు
- టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ జగ్గారెడ్డి
Jagga Reddy: కొత్తగా కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకునేవారు ముందుగా ఏఐసీసీ ఇంచార్జి దీపాదాస్ మున్షీ అనుమతి తీసుకోవాలని..ఆమె అనుమతితోనే పార్టీలో చేరికలు ఉంటాయని టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. అధిష్టానం ఆదేశాలతో రెండు రోజులుగా చేరికల కార్యక్రమం చేపట్టామని అన్నారు. దానికి రెస్పాన్స్ బాగా వచ్చిందని అన్నారు. పార్టీలో చేరికలు పెద్ద ఎత్తున జరిగాయని అన్నారు. ఇప్పిటికే కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక మంది ఘర్ వాపసి అయ్యారని తెలిపారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని కూడా చాలా మందిని పార్టీలోకి ఆహ్వానించామన్నారు. ఇక నుంచి చేరికలు నేరుగా జరగవన్నారు. పార్టీలో చేరాలనుకునే వారు ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షి అనుమతితోనే చేరికలు ఉంటాయని స్పష్టం చేశారు. పార్టీలో చేరాలనుకునే వారు దీపాదాస్ మున్షి ని సంప్రదించాలని క్లారిటీ ఇచ్చారు.
పెద్ద మనసుతో ఆహ్వానిస్తున్నాం
కాంగ్రెస్ పార్టీలో చేరే వాళ్లు ఏప్రిల్ 25,26 వ తేదీన గాంధీ భవన్ కు రావాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, పార్టీ చేరికల కమిటీ సూచించిన విషయం తెలిసిందే.. కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక కారణాల వల్ల పార్టీ వీడి పోయిన నాయకులను తిరిగి పార్టీలోకి ఆహ్వానించాలని ఏఐసీసీ ఆదేశాలు జారీ చేశారు. ఏ కారణం చేత అయిన పార్టీ నుంచి వెళ్లిపోయిన నాయకులు తిరిగి పార్టీలో చేరి పార్లమెంట్ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని ఏఐసీసీ ఆదేశించారు. పార్టీలో చేరే వారు బేషరతుగా పార్టీ లోకి ఆహ్వానించాలని, పార్టీ జిల్లా నాయకులు, నియోజక వర్గ నాయకులు పెద్ద మనసు చేసుకొని వారిని ఆహ్వానించాలని ఏఐసీసీ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజక వర్గాలలో పార్టీ నుంచి వెళ్లిపోయిన నాయకులను తిరిగి పార్టీలోకి తీసుకోవాలని ఏఐసీసీ సూచనలు చేసింది