Cantonment Bypoll: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్య నందిత ఇటీవలే రోడ్డు ప్రమాదంలో స్పాట్‌లో మరణించిన విషయం తెలిసిందే. ఆ సీటుకు ఉప ఎన్నిక అనివార్యమైంది. లోక్ సభ ఎన్నికలతోపాటే కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక కూడా జరగనుంది. ఈ ఉపఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని ప్రకటించింది.
కంటోన్మెంట్ ఎస్సీ రిజర్వ్‌డ్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. నారాయణన్ శ్రీగణేశ్‌ను కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా వెల్లడించారు. బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన శ్రీగణేశ్‌ను తాజాగా అభ్యర్థిగా కేసీ వేణుగోపాల్ ఖరారు చేశారు. ఆయన గత రెండు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. కానీ, అక్కడ బీఆర్ఎస్ దివంగత సాయన్న, ఆ తర్వాత ఆయన కుమార్తె లాస్య నందిత గెలిచిన సంగతి తెలిసిందే. సాయన్న మరణించిన తర్వాత ఆయన కుమార్తె లాస్య నందితను బీఆర్ఎస్ బరిలోకి దింపి విజయం సాధించింది.
Also Read: కాంగ్రెస్‌లో మంచి మార్పే జరుగుతున్నట్టుంది.. : కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
కాగా, బీఆర్ఎస్ నుంచి ఇక్కడ మన్నె క్రిషాంక్ బరిలో నిలిచే అవకాశాలు ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే ఆయన కంటోన్మెంట్ టికెట్ ఆశించారు. కానీ, సాయన్న కూతురికే బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది.
ఇదిలా ఉండగా.. ఈ ఎంపికపై ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. శ్రీగణేశ్ అరవ మాల సామాజిక వర్గానికి చెందిన వాడని, కాంగ్రెస్ మరోసారి మాదిగలకు అన్యాయం చేస్తున్నదని విరుచుకుపడ్డారు.