Tuesday, December 3, 2024

Exclusive

HYDERABAD : దగా పడ్డ దేశం.. మోడీ సర్కార్‌పై కాంగ్రెస్ ఛార్జ్‌షీట్

– రిజర్వేషన్ల రద్దుకు మోదీ కుట్ర
– కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే అంతా సవ్యం
– అప్పుల ఊబిలో నయా భారతాన్ని తాకట్టుపెట్టారు
– దేశం మీద రూ.168 లక్షల కోట్ల భారం మోపారు
– జీఎస్టీ పేరుతో పెన్సిళ్లు, అగరవత్తులపైనా దోపిడీ
– డబుల్ ఇంజిన్ అంటే కేవలం అదానీ, అంబానీ
– రైతులను ఆదుకుంటామని నల్ల చట్టాలతో దగా
– బీజేపీ వైఫల్యాలను ఎండగట్టిన సీఎం రేవంత్ రెడ్డి
– గాంధీ భవన్‌లో మోదీ పాలనపై ఛార్జ్‌షీట్‌ విడుదల

REVENTH REDDY : తెలంగాణలో అత్యధిక ఎంపీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా అధికార కాంగ్రెస్‌ పార్టీ పావులు కదుపుతోంది. మిషన్‌-15 పేరుతో ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మంత్రులు రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అభ్యర్థుల తరఫున ప్రచారం చేసి ప్రభుత్వ పథకాల అమలును వివరిస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్, బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రానికి చేసేంది ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోదీ, పదేళ్లలో ఎన్ని ఇచ్చారని నిలదీస్తున్నారు. దేశంలో 62 శాతం యువత నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారని సర్వేలు చెబుతున్నాయని అంటున్నారు. ఈ క్రమంలోనే గురువారం హైదరాబాద్‌ గాంధీభవన్‌లో బీజేపీపై కాంగ్రెస్‌ ఛార్జ్‌షీట్‌ విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్డ్ దీపాదాస్ మున్షీ పాల్గొన్నారు.

రిజర్వేషన్ హక్కులు కాలరాస్తున్న బీజేపీ

సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రిజర్వేషన్ల రద్దుకు ప్రధాని మోదీ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రిజర్వేషన్లు ఉండాలా? వద్దా అనే దానికి ఈ లోక్ సభ ఎన్నికలు రెఫరెండం అని అన్నారు. బీజేపీ ఒక్క సీటు గెలిచినా రిజర్వేషన్ల హక్కులను కాలరాస్తుందని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను కొనసాగిస్తామన్నారు. రిజర్వేషన్లు ఉండాలనేవాళ్ళు కాంగ్రెస్ కి, వద్దు అనేవాళ్ళు బీజేపీకి ఓటేయాలని సూచించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేసిందని ఆరోపించారు సీఎం రేవంత్. సీఏఏ, ఆర్టికల్ 370 రద్దు, రైతుల చట్టాలు, ఇలా ప్రతిపక్షాలు వద్దని వారించినా కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. ఎస్సీ, ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేసేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. రిజర్వేషన్లు రద్దు చేయాలనే భావజాలంతో ఆర్ఎస్ఎస్ ఉందన్నారు. అప్పుల ఊబిలో నయా భారతాన్ని మోదీ తాకట్టు పెట్టారని ఆరోపించారు రేవంత్ . 2014 నుంచి ఆయన ఒక్కరే 113 లక్షల కోట్ల అప్పులు చేశారని చెప్పారు. దేశం మీద రూ.168 లక్షల కోట్ల భారం మోపారని తెలిపారు. జీఎస్టీ పేరుతో పన్నులు విధించి కేంద్రం ప్రభుత్వం దోచుకుంటోందని, పిల్లలు వాడే పెన్సిల్‌పై కూడా మోదీ జీఎస్టీ వేశారని, భక్తులమని చెప్పుకునే బీజేపీ చివరకు అగరవత్తులపై కూడా జీఎస్టీ వేసిందని విమర్శించారు.

డబుల్ ఇంజన్ అంటే అదానీ, అంబానీ

అదానీ, అంబానీ ఒత్తిళ్లకు మోదీ సర్కార్ తలొగ్గిందని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. మోదీ 10 సంవత్సరాలలో ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు అమ్మేశారని ఆరోపించారు. రూ.60 ఉన్న పెట్రోల్ రేటును ఇవాళ రూ.110కి పెంచారని, సామాన్యులు బతకలేని విధంగా నిత్యవసర ధరలు పెంచారని ధ్వజమెత్తారు. మళ్లీ మోదీ వస్తే దేశం సర్వనాశనమేనని అన్నారు సీఎం. దేశ సంపదను బీజేపీ ధనవంతులకు దోచిపెట్టిందని మండిపడ్డారు. దేశాన్ని, సంపదను కాపాడేందుకు కాంగ్రెస్ పోరాడుతోందన్నారు. మోదీ ప్రభుత్వం పదేండ్లలో 20 కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పి కేవలం 7 లక్షల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిందని చెప్పారు రేవంత్. ఢిల్లీ సరిహద్దులో లక్షల మంది రైతులు 16 నెలలు ధర్నా చేశారని గుర్తు చేశారు. రైతులను ఆదుకుంటామని చెప్పి 3 నల్ల చట్టాలు తెచ్చారని ఆరోపించారు. పదేండ్ల మోదీ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని విమర్శించారు. నల్లధనం తెస్తానన్న మోదీ పది పైసలు కూడా తేలేదని, జీఎస్టీ పేరుతో మోదీ దోపిడీ చేశారన్నారు.

మోదీ ఒక్కరే డబుల్ అప్పులు

14 మంది ప్రధాన మంత్రులు చేసిన అప్పుల కంటే మోదీ ఒక్కరే డబుల్ అప్పులు చేశారన్నారు రేవంత్ రెడ్డి. పోర్టులు, ఎయిర్ పోర్టులు, రహదారులు అన్నింటినీ కార్పొరేట్ కంపెనీలకు అమ్మేశారని దేశాన్ని తప్పకుండా ఎక్స్ రే తీస్తాం అన్నారు. కాంగ్రెస్ సర్కార్ వస్తే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ వస్తే ఓబీసీ రిజర్వేషన్లు 27 శాతాన్ని 50 శాతానికి పెంచుతుందని బీజేపీకి భయం పట్టుకుందని చెప్పారు. మండల్ ఉద్యమానికి వ్యతిరేకంగా బీజేపీ కమండల్ ఉద్యమాన్ని తెచ్చిందన్నారు. బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్లు తీసేయడానికి ఉపయోగపడుతుందని, కొందరు స్థానిక రాజకీయాల కోసం రిజర్వేషన్లు తీసేయడానికి సిద్ధమైన బీజేపీకి మద్దతు ఇస్తున్నారన్నారు. రిజర్వేషన్లు కావాలా? వద్దా అనే దానికి ఈ ఎన్నికలు రెఫరెండమని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి.

మోసాల కమలం

బీజేపీ పాలనపై ప్రజా ఛార్జ్‌షీట్ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. కొద్దిమంది స్నేహితులకు దేశ సంపదను కట్టబెట్టేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని అన్నారు. జనాభాను కులాలు, మతాలుగా విభజించి కల్లోలాలకు కారణమౌతోందని ఆరోపించారు. ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో ఒక రాష్ట్రంపై మరొక రాష్ట్రం దాడి చేసి సంపదను దోచుకునేవి, ప్రస్తుతం మోదీ హయాంలో అదే ధోరణి కొనసాగుతోందని చెప్పారు. ‘‘గత పది ఏళ్లుగా ఈ దేశ ప్రజలను మోదీ ప్రభుత్వం ఏ విధంగా మోసం చేస్తుందో చూశాం. రాబోయే ఎన్నికల్లో గెలుపొందేందుకు మోసపూరిత హామీలు ఇస్తోంది. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మోడీ గతంలో హామీ ఇచ్చారు. కానీ గత పది ఏళ్లలో ఈ హామీని అమలు చేయలేదు. ప్రపంచవ్యాప్తంగా పేరుకుపోయిన భారతీయుల నల్లధనాన్ని వెలికి తీసి దేశంలోని పేదవాళ్ల అకౌంట్లో 15 లక్షల చొప్పున జమ చేస్తానని హామీ ఇచ్చారు. ఈ దేశంలో ఏ ఒక్క పేదవాడి అకౌంట్లో 15 లక్షలు జమ కాలేదు. పెద్ద నోట్ల రద్దుతో నకిలీ కరెన్సీని అరికడతామని చెప్పారు. పదేళ్లయినా ఈ హామీకి సంబంధించిన సమాచారం కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు’’ అంటూ విరుచుకుపడ్డారు. మోదీ తన కొద్దిమంది క్రోనీ క్యాపిటల్స్ స్నేహితుల కోసం విదేశీ సంపదను ఎలా దోచిపెడుతున్నారో రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర నిర్వహించి ఈ దేశ ప్రజలకు వివరించారు. ఈ ఎన్నికల్లో సంపదను కొద్దిమందికి కట్టబెట్టాలని చూసే మోదీ ప్రభుత్వం ఓవైపు, కులగణన చేసి అధిక శాతం ఉన్న జనాభాకు ఈ దేశ సంపదను అందించాలనే రాహుల్ గాంధీ మరోవైపు పోరాటం చేస్తున్నారని అన్నారు. రాజ్యాంగం, లౌకికవాదం, దేశ సంపదను కాపాడేందుకు రాహుల్ గాంధీ నిత్యం ప్రజల్లో తిరుగుతున్నారని తెలిపారు. లౌకికవాదం ప్రజాస్వామ్యం, ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు మీడియా ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. చార్జ్‌షీట్‌లో పేర్కొన్న ప్రతి విషయాన్ని ప్రతి ఇంటికి చేరే విధంగా కాంగ్రెస్ సైన్యం కృషి చేయాలని పిలుపునిచ్చారు భట్టి విక్రమార్క.

Publisher : Swetcha Daily

Latest

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Don't miss

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర పోషించిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌‌ ఇటు పాలిటిక్స్‌లో అటూ మూవీస్‌లో రాణిస్తున్నారు. రాజకీయాల్లో, సినిమాల్లో రెండింటిలో పవన్ కళ్యాణ్‌కు...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్, భట్టి - సింగరేణికి అండగా నిలవండి - పెండింగ్ ప్రాజెక్టులపై తేల్చేయండి - పెండింగ్ విభజన హామీలను నెరవేర్చండి - కొత్త విద్యాసంస్థలు ఏర్పాటు అవసరం -...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా ఈటలకు ప్రేమ తగ్గినట్టు లేదు - పార్లమెంట్‌లో బీఆర్ఎస్‌ను జీరో చేశామన్న రేవంత్ రెడ్డి Eatala Rajender: ఫిరాయింపులపై బీజేపీ ఎంపీ ఈటల...