Saturday, May 18, 2024

Exclusive

Telangana : గల్ఫ్ గోసకు చెక్.. అసలు సమస్యలేంటి..? పరిష్కారం ఎలా..?

– గల్ఫ్‌ కార్మికులకు అండగా రేవంత్ సర్కార్
– సెప్టెంబర్ 17 లోగా కార్మికుల సమస్యలకు పరిష్కారం
– గతంలో తెలంగాణ నుంచి గల్ఫ్ వెళ్లిన కార్మికుల పరిస్థితి దయనీయం
– బీఆర్ఎస్ ప్రభుత్వంలో పట్టించుకోని వైనం
– 90 శాతం మంది ఇంకా అక్కడ కూలీలుగానే
– గడిచిన 9 ఏళ్లలో 1,612 మంది తెలంగాణ గల్ఫ్ కార్మికుల మృతి
– ఎక్కువగా చనిపోయే వారంతా 50 సంవత్సరాల లోపువారే
– సీఎం రేవంత్ భరోసాతో గల్ఫ్ కార్మికుల హర్షాతిరేకం

cm revanth reddy with gulf workers : గల్ఫ్‌, ఇతర దేశాలకు వెళ్లే కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయనున్నామని, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. గల్ఫ్‌ దేశాల్లో పనిచేసే కార్మికుల హక్కులు, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. ఈ నేపథ్యంలో దీని కోసం ప్రజా భవన్‌లో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులతో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని రేవంత్ స్పష్టం చేశారు. అంతేకాదు, ఇంకా పలు హామీలను ఇచ్చారు. గతంలో తెలంగాణ నుంచి గల్ఫ్ వెళ్లిన కార్మికుల పరిస్థితి దయనీయంగా ఉండేది. ఎడారి దేశాలకు వలస వెళ్లే కార్మికులకు భరోసా ఉండేది కాదు. గల్ఫ్‌ దేశాలకు వెళ్లి జేబు నిండా డబ్బులతో తిరిగి వద్దామనుకున్న వారిని అనుకోని అవాంతరాలు చుట్టుముట్టేవి. తెలంగాణ నుంచి ఇప్పటికే దాదాపు 15 లక్షల మంది గల్ఫ్‌ దేశాల (సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఖతార్, బహ్రేయిన్, ఒమన్‌)కు వెళ్లగా, తాజాగా కొత్తతరం కూడా ఎడారి దేశాల బాటపడుతోంది. ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేని వారే ఆయా దేశాలకు వెళుతుండటంతో వారంతా భవన నిర్మాణం, వ్యవసాయం వంటి కఠినమైన పనుల్లో కుదురుతున్నారు. అక్కడి వాతావరణం, ఆహారం, తదితర పరిస్థితుల కారణంగా మానసిక ఒత్తిడితో అనారోగ్యం, ఆపై మృత్యువాత పడుతున్నవారు కొందరైతే, క్షణికావేశాలతో చేసే నేరాలతో జైలు పాలవుతున్న వారు మరికొందరు. దీంతో వారి కుటుంబాలకు తీరని శోకం మిగులుతోంది. ఇలా గడిచిన ఎనిమిదిన్నరేళ్లలో 1,612 మంది గల్ఫ్‌ దేశాల్లో మృతి చెందారు.

90 శాతం మంది ఇంకా కూలీలే

తెలంగాణ ఏర్పాటు అనంతరం కూడా గల్ఫ్‌కు వెళ్లే వారి కోసం ప్రత్యేక సాంకేతిక శిక్షణ 90 శాతం మంది కూలీలుగానే పనిచేస్తున్నారు. నిరక్షరాస్యత, ఎడారి దేశాల్లో వ్యవహరించే తీరుపై ముందస్తు అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే, పని ప్రదేశంలో ప్రమాదాలు, వివాదాలు, రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దుబాయ్‌ బాధలుండవని అప్పటి నాయకులు హామీ ఇచ్చారు. అయినా పేద కార్మికులకు భరోసా విషయంలో కార్యాచరణ ఇంకా కార్యరూపం దాల్చలేదు. 2016లో ఎన్నారై పాలసీపై ప్రత్యేక సమావేశం నిర్వహించి, 2018-19 బడ్జెట్‌లో ఎన్నారైల కోసం రూ.100 కోట్లను కేటాయించినా పూర్తిస్థాయి విధి విధానాలు ప్రకటించకపోవడంతో వాటి వల్ల ఎవరికీ లబ్ధి చేకూరలేదు.

చనిపోయే వారంతా 50 సంవత్సరాల లోపే

గల్ఫ్‌ దేశాల నుంచి తరచూ మృతదేహం తెలంగాణకు చేరుతోంది. 2014 నుంచి ఇప్పటి వరకు 1,612 మృతదేహాలు వచ్చాయి. ఇందులో 25 నుంచి 50 ఏళ్ల లోపు వారే అత్యధికం. అక్కడి వాతావరణం, ఆహారం కారణంగా మానసిక ఒత్తిడితో గుండె, మెదడు సంబంధిత వ్యాధుల భారిన పడి మరణిస్తున్నట్లు భారత దౌత్య కార్యాలయం ఇటీవల వెల్లడించింది.

కేరళ రాష్ట్రంలో భేష్‌

గల్ఫ్‌ దేశాల్లో అత్యధిక ప్రవాసీలున్న రాష్ట్రం కేరళ. ఆ రాష్ట్రం వలస కార్మికుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. గల్ఫ్‌కు వెళ్లే వారికి ముందస్తుగా నైపుణ్య శిక్షణ ఇస్తుండటంతో వాళ్లు వైట్‌ కాలర్‌ ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు. అలాగే, స్వదేశానికి తిరిగి వచ్చిన వారికోసం విస్తృత స్థాయిలో పునరావాస కార్యక్రమాలు చేపడుతున్నారు. రిక్రూటింగ్‌ ఏజెన్సీల నియంత్రణ, కేసుల్లో ఉన్న వారికి న్యాయ సహాయం, వైద్య సహాయం అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏపీ ఎన్నార్‌టీఎస్‌ ఆధ్వర్యంలో ఎన్నారైల కోసం 24 గంటల హెల్ప్‌లైన్‌తోపాటు ప్రవాసాంధ్ర భరోసా పేరుతో రూ.10 లక్షల బీమా (18–60 ఏళ్లు)తో పాటు రూ.50 వేల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తున్నారు.

కార్మికుల డిమాండ్లు ఇవే

గల్ఫ్‌ వర్కర్స్‌ వెల్ఫేర్‌ బోర్డు ఏర్పాటు, వార్షిక బడ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయించాలి. గల్ఫ్‌ మృతులకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, జీవిత, ప్రమాదబీమా, పెన్షన్‌లతో కూడిన సమగ్రమైన సాంఘిక భద్రత పథకం అమలు చేయాలి. గల్ఫ్‌ జైళ్లలో చిక్కుకున్న వారికి మెరుగైన న్యాయ సహాయం అందించాలి. శిక్ష పడ్డ ఖైదీలకు ఇప్పటికే ఒప్పందం చేసుకున్న దేశాల నుంచి ఖైదీల మార్పిడి వెంటనే చేయాలి. కేంద్రం తరఫున వెంటనే హైదరాబాద్‌లో సౌదీ, యూఏఈ, కువైట్‌ కాన్సులేట్లను ఏర్పాటు చేయాలి. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన తరహాలో గల్ఫ్‌లో మృతి చెందిన వారి కుటుంబానికి తక్షణ సహాయంగా రూ.లక్ష ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి. ప్రవాసీ భారతీయ బీమా యోజన కింద రూ.10 లక్షల విలువైన ప్రమాద బీమా పథకంలో సహజ మరణాన్ని కూడా చేర్చాలి. రూ.325 చెల్లిస్తే రెండేళ్ల కాలపరిమితితో ఇన్సూరెన్స్‌ అమలు చేయాలి అనేవి కార్మికుల డిమాండ్లు.

కాన్సులేట్లు ఏర్పాటు చేయాలి

దేశంలో కేరళ తర్వాత తెలంగాణ నుంచే అత్యధిక కార్మికులు గల్ఫ్‌లో పనిచేస్తున్నారు. ఇక్కడి నుంచి వెళ్లినవారు మరణాలు, జైలు పాలవుతున్న తీరు ఆందోళనకరంగా ఉంటోంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే చొరవ చూపి, హైదరాబాద్‌లో సౌదీ, ఇతర ముఖ్య దేశాల కాన్సులేట్లను ఏర్పాటు చేస్తే పలు సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.

రేవంత్ రెడ్డి హామీ

హోటల్‌ తాజ్‌ డెక్కన్‌లో గల్ఫ్‌ కార్మిక సంఘాల నేతలతో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కార్మికులకు పలు హామీలిచ్చారు. గల్ఫ్‌ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక విధానం రూపొందిస్తున్నామని, త్వరలోనే కార్మిక సంఘాల ప్రతినిధులను ఆహ్వానించి, వారి సలహాలతో తుదిరూపు ఇస్తామని పేర్కొన్నారు. గల్ఫ్‌, ఇతర దేశాలకు వెళ్లే కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయనున్నామని, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. గల్ఫ్‌ దేశాల్లో పనిచేసే కార్మికుల హక్కులు, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, దీని కోసం జ్యోతిరావ్‌ పూలే ప్రజా భవన్‌లో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులతో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. ఇక్కడ పాస్‌ పోర్ట్‌ కౌంటరును, కార్మికుల తరఫున ఏ దేశంతోనైనా సంప్రదించే పకడ్బందీ వ్యవస్థను నెలకొల్పుతామన్నారు. ఈ సందర్భంగా రూ.5 లక్షల బీమా ప్రకటించినందుకు ధన్యవాదాలు చెబుతూ కార్మిక సంఘాల ప్రతినిధులు సీఎంను సన్మానించారు. కేసీఆర్ పాలనలో ఇబ్బందులను ఎదుర్కొన్న గల్ఫ్ కార్మికులు, ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో తమకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు.

Publisher : Swetcha Daily

Latest

BJP: సీఎం రేవంత్‌ను కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు.. ఎందుకు కలిశారు?

CM Revanth: రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీల మధ్య రాజకీయ వైరం...

LS Polls: ఆరో విడతలో 889 మంది అభ్యర్థులు.. 25న పోలింగ్

Lok Sabha Elections: సార్వత్రిక ఎన్నికల్లో ఆరో విడతకు సంబంధించి నామినేషన్ల...

Bharati Builders: భారతి.. భూముల హారతి!

- అప్పుడు పుప్పాలగూడ.. ఇప్పుడు కొంపల్లి..! - హైదరాబాద్‌లో మరో ప్రీ లాంచ్...

Cabinet Meeting: కేబినెట్‌ భేటీకి ఈసీ ‘నో’.. ‘అవసరమైతే ఢిల్లీకి వెళ్తాం’

- కేబినెట్ సమావేశానికి బ్రేక్ - పర్మిషన్ ఇవ్వని ఈసీ -...

RGV: సీఎం రేవంత్ రెడ్డిపై ఆర్జీవీ ట్వీట్

CM Revanth Reddy: ప్రముఖ సినీ దర్శకుడు ఆర్జీవీ గత కొంతకాలంగా...

Don't miss

BJP: సీఎం రేవంత్‌ను కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు.. ఎందుకు కలిశారు?

CM Revanth: రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీల మధ్య రాజకీయ వైరం...

LS Polls: ఆరో విడతలో 889 మంది అభ్యర్థులు.. 25న పోలింగ్

Lok Sabha Elections: సార్వత్రిక ఎన్నికల్లో ఆరో విడతకు సంబంధించి నామినేషన్ల...

Bharati Builders: భారతి.. భూముల హారతి!

- అప్పుడు పుప్పాలగూడ.. ఇప్పుడు కొంపల్లి..! - హైదరాబాద్‌లో మరో ప్రీ లాంచ్...

Cabinet Meeting: కేబినెట్‌ భేటీకి ఈసీ ‘నో’.. ‘అవసరమైతే ఢిల్లీకి వెళ్తాం’

- కేబినెట్ సమావేశానికి బ్రేక్ - పర్మిషన్ ఇవ్వని ఈసీ -...

RGV: సీఎం రేవంత్ రెడ్డిపై ఆర్జీవీ ట్వీట్

CM Revanth Reddy: ప్రముఖ సినీ దర్శకుడు ఆర్జీవీ గత కొంతకాలంగా...

Congress: స్తంభాద్రిలో గెలుపు ఏకపక్షమే..

- లక్షకు పైగా మెజారిటీ లెక్కల్లో కాంగ్రెస్ - ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయిన విపక్షాలు - అసెంబ్లీ ఎన్నికల ఊపును కొనసాగించిన హస్తం Khammam: తెలంగాణలోని లోక్‌సభ స్థానాల్లో ఖమ్మం సీటుకు ఎంతో చరిత్ర ఉంది....

Hyderabad Metro: భాగ్యనగరవాసులకు మెట్రో గుడ్ న్యూస్

Hyderabad metro rail timings changed night service extended 45 minitues: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు మెట్రో నిర్వాహకులు శుభవార్త అందించారు. మెట్రో రైలు సమయాలను పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒక...

Hyderabad:ఆ.. త (అ)ప్పు చేయొద్దు

రుణాల రీస్ట్రక్చరింగ్ దిశగా రేవంత్ సర్కార్ అడుగులు మార్కెట్లో తక్కువ వడ్డీకి రుణాలిచ్చే సంస్థలపై ఫోకస్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన కొత్తల్లో రాష్ట్ర అప్పుల భారం రూ.72,658 కోట్లు పదేళ్ల కేసీఆర్...