Saturday, September 7, 2024

Exclusive

Revanth Reddy: ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలు వేరు, ఈ ఎన్నికలు వేరు..! ఏమరపాటు వద్దు

Lok Sabha Elections: లోక్ సభ ఎన్నికలు సమీపించిన వేళ సీఎం రేవంత్ రెడ్డి ఓటర్లకు సందేశం ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ఏమరపాటు వద్దని సూచించారు. ఇది వరకు దేశంలో 17 సార్లు జరిగిన ఎన్నికలు వేరు.. 18వ లోక్ సభ ఎన్నికలు వేరని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవడానికి ఈ ఎన్నికలు చాలా కీలకం అని వివరించారు. అలసత్వం వహిస్తే నియంతల పాలన తప్పదని హెచ్చరించారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగాన్ని, ఆలోచన విధానాన్ని, రిజర్వేషన్లను ముందుకు తీసుకెళ్లడానికి అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

దేశంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలు, అట్టడుగు వర్గాలతోపాటు ప్రజలందరి కోసం ఆనాడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గొప్ప రాజ్యాంగాన్ని అందించారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఆయన అందించిన రాజ్యాంగానికి లోబడి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల నుంచి ఐఏఎస్, ఐపీఎస్, ఇంజినీర్లు, డాక్టర్లుగా ఎందరో ఎదిగారని, దేశ ప్రగతిలో పాలుపంచుకున్నారని వివరించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించి, దాన్ని మరింత బలోపేతం చేసి, ప్రపంచ దేశాలతో పోటీ పడాల్సిన భారత్ నేడు బీజేపీ కుట్రలకు బలి అవుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ మరో దుస్సాహసానికి ఒడిగట్టే ముప్పు ఉన్నదని ఆందోళనపడ్డారు. ఈ ఎన్నికల్లో 400 సీట్లు గెలిచి రాజ్యాంగాన్ని మార్చాలని కుట్రపన్నుతున్నదని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల రిజర్వేషన్లు రద్దు చేయాలని, రిజర్వేషన్ల రహిత సమాజంగా మార్చాలని బీజేపీ ప్రయత్నం చేస్తున్నదని వివరించారు. కాబట్టి, ఈ దుస్సహ బీజేపీని అడ్డుకోవడానికి ప్రజలు ఉన్ముఖులు కావాలని పిలుపు ఇచ్చారు. ఈ తీర్పులో ఏమాత్రం ఏమారుపాటుగా ఉన్నా దేశం తీరని నష్టాన్ని ఎదుర్కొంటుందని, మళ్లీ నియంతల పాలన వస్తుందని హెచ్చరించారు.

సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ నేతృత్వంలో ఎన్నికల బరిలో దిగిన ఇండియా కూటమికి తెలంగాణ సమాజం అంతా అండగా నిలిచి గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఇండియా కూటమిని గెలిపించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రిజర్వేషన్లు కాపాడుకోవాలని, రాజ్యాంగాన్ని, అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపు ఇచ్చారు. అందుకే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఓ వీడియో సందేశాన్ని ఇచ్చారు.

Also Read: సొంతూళ్లకు పోటెత్తిన ఓటర్లు

అదే విధంగా సీఎం రేవంత్ రెడ్డి మెదక్ అభ్యర్థి నీలం మధు కోసం ప్రచారం చేస్తూ సంగారెడ్డిలో మాట్లాడుతూ బీజేపీ, బీఆర్ఎస్‌లపై మండిపడ్డారు. బీజేపీ వాళ్లకు ఒకటే పిచ్చి పట్టుకుందని, మనకు పిచ్చి లేపి కత్తులతో పొడుచుకునేట్టు చేస్తున్నారని ఆరోపించారు. మనమధ్య చిచ్చు పెట్టి లాభపడాలని చూస్తున్నదని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం ఉంటేనే పెట్టుబడులు వస్తాయని తెలిపారు. తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిన బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టాలని సూచించారు. బీజేపీ మాయలో పడొద్దని, వాళ్లు అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని హెచ్చరించారు. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గురించి ప్రస్తావించారు. సీఎం కార్యాలయంలో జగ్గారెడ్డిదే మొత్తం పెత్తనం అని, తాను రబ్బర్ స్టాంపులా పని చేస్తున్నానని నవ్వుతూ చెప్పారు. జగ్గారెడ్డి ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడుతున్నట్టు కామెంట్ చేశారు.

బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపైనా సీఎం రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ భూ నిర్వాసితులను వెంకట్రామిరెడ్డి పోలీసులతో తొక్కించారని మండిపడ్డారు. తెల్లాపూర్‌లో అక్రమ ఆస్తులు సంపాదించిన వెంకట్రామిరెడ్డి వేల కోట్లు ఇచ్చి టికెట్ సంపాదించుకున్నారని ఆరోపించారు. ఇది వరకు ఎమ్మెల్సీ పదవి ఉన్నదని, అయినా కేసీఆర్, హరీశ్ రావులకు వేల కోట్లు ఇచ్చి ఎంపీ టికెట్ తెచ్చుకున్నారని అన్నారు. మందిని ముంచిన సొమ్ము అది.. ఇచ్చింది తీసుకుని తూర్పుకు తిరిగి దండం పెట్టుకోండని పేర్కొన్నారు.

పటాన్‌చెరు మినీ ఇండియా అని, దేశంలో ఎన్ని భాషలు, కులాల ఉన్నాయో ఇక్కడ కూడా అలాగే ఉంటాయని, అందరూ కలిసి మెలిసి నివసిస్తారని సీఎం రేవంత్ వివరించారు. ఢిల్లీలో మన గళం వినిపించాలంటే నీలం మధును గెలిపించాలని, 50 వేల మెజార్టీ ఇవ్వాలని అన్నారు. నీలం మధు, కాట శ్రీనివాస్ జోడెద్దుల్లా, రామలక్ష్మణుల్లా పని చేస్తారని భరోసా ఇచ్చారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ఎలా అభివృద్ధి చేసిందో.. 2024 నుంచి 2034 వరకు అలాగే అభివృద్ధి చేస్తుందని వివరించారు.

Publisher : Swetcha Daily

Latest

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Don't miss

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర పోషించిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌‌ ఇటు పాలిటిక్స్‌లో అటూ మూవీస్‌లో రాణిస్తున్నారు. రాజకీయాల్లో, సినిమాల్లో రెండింటిలో పవన్ కళ్యాణ్‌కు...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్, భట్టి - సింగరేణికి అండగా నిలవండి - పెండింగ్ ప్రాజెక్టులపై తేల్చేయండి - పెండింగ్ విభజన హామీలను నెరవేర్చండి - కొత్త విద్యాసంస్థలు ఏర్పాటు అవసరం -...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా ఈటలకు ప్రేమ తగ్గినట్టు లేదు - పార్లమెంట్‌లో బీఆర్ఎస్‌ను జీరో చేశామన్న రేవంత్ రెడ్డి Eatala Rajender: ఫిరాయింపులపై బీజేపీ ఎంపీ ఈటల...