Tuesday, December 3, 2024

Exclusive

Revanth Reddy: కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్

– కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కాపలాగా హైటెన్షన్ వైర్ వంటి రేవంత్ రెడ్డి
– కేసీఆర్.. దమ్ముంటే టచ్ చేసి చూడు
– కాకి వాలితే మాడినట్టే.. మాడిపోతావ్
– కరీంనగర్ ప్రజలు తిరస్కరిస్తే పాలమూరుకు కేసీఆర్ వలస
– ఇక్కడ గెలిచి ఇచ్చిందేమిటీ? తెచ్చిందేమిటీ?
– బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కై కాంగ్రెస్‌పై కుట్ర
– వంశీచంద్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో సీఎం రేవంత్ నిప్పులు
– వంశీచంద్‌ను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి

KCR: కాంగ్రెస్ నుంచి 20 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని, వారు తనతో టచ్‌లో ఉన్నారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై సీఎం, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు హైటెన్సన్ వైర్‌లా తాను కాపలాగా ఉన్నానని చెప్పారు. కేసీఆర్‌కు దమ్ముంటే తమ ఎమ్మెల్యేలను టచ్ చేసి చూడాలని మాస్ వార్నింగ్ ఇచ్చారు. హైటెన్షన్ వైర్ పై వాలితే కాకి మాడిపోయినట్టే.. మాడిపోతావ్ అంటూ హెచ్చరించారు.

మహబూబ్ నగర్‌ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి నామినేషన్ వేయడానికి భారీ ర్యాలీతో వెళ్లారు. ఈ బహిరంగ ర్యాలీకి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ‘నా అడ్డా.. నా గడ్డ పాలమూరు. నేను పాలమూరు బిడ్డను. 2009లో కేసీఆర్‌ను కరీంనగర్ ప్రజలు తిరస్కరించారు. అందుకే ఆయన పాలమూరుకు అప్పుడు వలస వచ్చారు. ఇక్కడి నుంచి గెలిచి ఆయన పాలమూరు ప్రజలకు ఇచ్చిందేమిటీ? తెచ్చిందేమిటీ? కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన పాలమూరు యూనివర్సిటీలో అధ్యాపక ఖాళీలను కూడా భర్తీ చేయలేదు. జూరాల, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సహా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయలేదు. బీఆర్ఎస్ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి ఎప్పుడైనా పార్లమెంటులో పాలమూరు గురించి మాట్లాడారా? ఆయనకు మళ్లీ ఓటు వేస్తే ప్రయోజనమేంటీ? ఇప్పుడు పాలమూరు ప్రజలను ఏ మొహం పెట్టుకుని కేసీఆర్ ఓట్లు అడుగుతారు?’ అని కేసీఆర్ పై రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు.’ అంటూ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై విమర్శలు సంధించారు.

Also Read: ట్యాంపరింగ్‌,ఈవీఎంల పనితీరుపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నలు.!

అదే ర్యాలీలో కేసీఆర్‌ కామెంట్స్‌కు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ‘కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని కేసీఆర్ అంటున్నారు. చిటికె వేస్తే వస్తారని చెబుతున్నారు. చిటికె కాదు కదా.. మిద్దె ఎక్కి డప్పు కొట్టుకో.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వచ్చుడు కాదు కదా.. నీ ఎమ్మెల్యేలు కూడా ఒక్కరు ఉండరు. గతంలోలాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తోడేళ్లుగా పడి ఒక్కొక్కరిని ఎత్తుకుపోవాలని అనుకుంటున్నారేమో.. ఇప్పుడు ఆ ఆటలు సాగవు. ఇప్పుడు ఇక్కడ కాపలా ఉన్నది రేవంత్ రెడ్డి. కంచె వేసి కాపాడుకుంటా. హైటెన్షన్ వైర్ పై వాలితే కాకి ఎలా మాడి మసైపోతుందో తెలుసు కదా. దమ్ముంటే కేసీఆర్ ఒకసారి ప్రయత్నించి చూడు. ఇక్కడ హైటెన్షన్ వైర్ లెక్క రేవంత్ రెడ్డి ఉన్నాడు. కేసీఆర్ నీకు దమ్ముంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టచ్ చేసి చూడు’ అని వార్నింగ్ ఇచ్చారు. ‘మనల్ని దెబ్బతీయడానికి బీజేపీ, బీఆర్ఎస్ ఏకం అవుతున్నాయి. అందుకే మనం అలర్ట్‌గా ఉండాలి. కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డిని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించుకోవాలి’ అని పాలమూరు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

‘కారుకు రిపేర్ వచ్చిందని, గ్యారేజీలో ఉన్నదని కేటీఆర్ అంటున్నారు. అది రిపేర్‌కు కాదు దాని ఇంజిన్ చెడిపోయింది. అనుం చెడ్డది. అనుం చెడ్డ బండిని తూకాన్ని అమ్మాల్సిందే. కారును తూకానికి పెట్టి అమ్మాల్సిందే. కారుదే కాదు.. కేసీఆర్‌కు కూడా అనుం చెడ్డది. ప్రమాణ స్వీకారం రోజే కేసీఆర్ బోర్ల బొక్కల పడి బొక్కలు ఇరగ్గొట్టుకున్నారు. ఇప్పటికి కూడా సరిగా నడవలేకపోతున్నారు. తెలంగాణ ప్రజలు కారును బండకేసి కొట్టిర్రు. వంద మీటర్ల గొయ్యి తీసి పాతిపెట్టిర్రు. ఇంతా జరిగినా కేసీఆర్ ఇంక బింకాలకు పోతున్నారు’ అని రేవంత్ రెడ్డి అన్నారు.

Also Read: కేసీఆర్ కుటుంబం జైలుకే, రాజగోపాల్ రెడ్డి షాకింగ్ కామెంట్స్

తెలంగాణ భవన్‌లో గురువారం బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని వివరించారు. 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకుని రమ్మంటారా? అని అడిగితే తానే వారించినట్టు వివరించారు. కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వాస్తవానికి బీఆర్ఎస్ నుంచే కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యేల వలసలు జరుగుతున్నాయి. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులు హస్తం గూటికి చేరుకున్నారు. ఇక కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశానికీ ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. వీరు కూడా పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతున్నది.

Publisher : Swetcha Daily

Latest

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Don't miss

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర పోషించిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌‌ ఇటు పాలిటిక్స్‌లో అటూ మూవీస్‌లో రాణిస్తున్నారు. రాజకీయాల్లో, సినిమాల్లో రెండింటిలో పవన్ కళ్యాణ్‌కు...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్, భట్టి - సింగరేణికి అండగా నిలవండి - పెండింగ్ ప్రాజెక్టులపై తేల్చేయండి - పెండింగ్ విభజన హామీలను నెరవేర్చండి - కొత్త విద్యాసంస్థలు ఏర్పాటు అవసరం -...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా ఈటలకు ప్రేమ తగ్గినట్టు లేదు - పార్లమెంట్‌లో బీఆర్ఎస్‌ను జీరో చేశామన్న రేవంత్ రెడ్డి Eatala Rajender: ఫిరాయింపులపై బీజేపీ ఎంపీ ఈటల...