Tuesday, May 28, 2024

Exclusive

CM Revanth: బీజేపీ, బీఆర్ఎస్ కుట్రల్ని తిప్పికొడుదామన్న సీఎం..!

CM Revanth Reddy Fires Bjp, Brs Parties: పార్లమెంట్ ఎన్నికల యుద్ధంలో అనుకున్న లక్ష్యం నెరవేరేలా ముందుకెళ్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. వరుసగా నియోజకవర్గాలను చుట్టేస్తూ, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరాన్ని వివరిస్తున్నారు. ప్రత్యర్థులకు మాటకు మాట బదులిస్తున్నారు. పదేళ్ల మోడీ పాలనలో జరిగిన అన్యాయాన్ని, కేసీఆర్ హయాంలో జరిగిన ఘోరాలను ఎండగడుతున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటేనే పేదలకు న్యాయం జరుగుతుందని, దేశం అభివృద్ధి వైపు పయనిస్తుందని ప్రజలను చైతన్యపరుస్తున్నారు. హస్తం గుర్తుకు ఓటేసి తమ అభ్యర్థులను ఢిల్లీకి పంపాలని ప్రజలను కోరుతున్నారు. ఈ క్రమంలోనే సోమవారం మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటించారు. ముందుగా ఆదిలాబాద్ వెళ్లిన సీఎం, అభ్యర్థి ఆత్రం సుగుణను గెలిపించాలని కోరారు. తర్వాత నిజామాబాద్ వెళ్లి జీవన్ రెడ్డి గెలుపు కోసం ప్రచారం చేశారు. అనంతరం సిట్టింగ్ స్థానం మల్కాజ్‌గిరికి వెళ్లారు. అక్కడ తనను ఆదరించినట్టే సునీతా మహేందర్ రెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు. తాను సీఎం అయ్యానంటే మల్కాజ్‌గిరి ప్రజల కృషి ఎంతో ఉందని చెప్పారు రేవంత్ రెడ్డి.

ఆదిలాబాద్‌లో…

కాంగ్రెస్‌ పార్టీని ఓడించేందుకు కేంద్రంలోని మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ ఒక్కటై కుట్రలు పన్నుతున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలొచ్చిన డిసెంబరు 3న ఈ తోడుదొంగల్లో ఒకరైన కేసీఆర్‌ను ప్రజలు తరిమికొట్టారని, మే 13న జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మోడీని కూడా గద్దె దించాలని ఆయన పిలుపునిచ్చారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ సోమవారం ఆదిలాబాద్‌లో నిర్వహించిన జనజాతర సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు.తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిన వెంటనే తుక్కుగూడ వేదికగా ఇచ్చిన 6 హామీల్లో ఐదింటిని అమలు చేశామని, ఆగస్టు 15 నాటికి ఆరవహామీ అయిన రూ.2 లక్షల రైతు రుణమాఫీని కూడా అమలు చేయబోతున్నామని సీఎం ప్రకటించారు. రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం, పేదలకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నామన్నారు. పేదల ఇళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వెలుగులు నింపుతోందని.. ఈ వెలుగులు ఆపాలనే కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. వంద రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేదని మాట్లాతుడున్న బీఆర్ఎస్, బీజేపీ నేతలను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.

‘జల్‌, జంగిల్‌, జమీన్‌ హమారా’ నినాదంతో నాడు ఆదివాసీ యోధులైన రాంజీ గోండు, కొమురం భీం పోరాటాలు చేశారని, ఆ వీరుల స్ఫూర్తిని గౌరవిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆదివాసీల సంస్కృతిని గౌరవిస్తోందన్నారు. ఇంద్రవెల్లి అమరవీరులకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామని, అమరవీరుల స్థూపాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఆదివాసీల ఆరాధ్యదైవమైన నాగోబా జాతరకు రూ.4 కోట్లు కేటాయించి, ఇక్కడి ప్రజల విశ్వాసాలను కాంగ్రెస్ పార్టీ గౌరవించిందని గుర్తుచేశారు. ఈ ప్రాంతంలోని కుఫ్టి ప్రాజెక్టును పూర్తి చేసి ఆదిలాబాద్ జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. తుమ్మిడిహట్టిలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కడతాం, దానికి బీఆర్‌ అంబేద్కర్‌ పేరు పెడతామని తెలిపారు. ఆదిలాబాద్‌లో కొత్త యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని, మోడీ, కేసీఆర్‌ ఇద్దరూ తోడుదొంగలంటూ విమర్శించారు.

తెలంగాణ ప్రభుత్వం వచ్చాక అన్నదాత పండించిన ప్రతి గింజ కొంటున్నామని, ఎన్నికల హామీలో భాగంగా మహిళలకు కల్పించిన ఉచిత బస్సు ప్రయాణం కారణంగా ఇప్పటివరకు 35 కోట్ల మంది మహిళలు ప్రయాణించారన్నారు. పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగ యువతను నానా బాధలు పెట్టిందని, కాంగ్రెస్‌ మాత్రం కేవలం 3 నెలల్లోనే 30 వేల ఉద్యోగాలు ఇచ్చిందని గుర్తు చేశారు. బీసీ జనగణన చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. గతంలో ఈ ప్రాంతంలో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తరపున నిర్మించిన ఫ్యాక్టరీని మోడీ, కేసీఆర్‌ కలిసి మూసేశారని, త్వరలోనే దానిని తెరిపిస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ పాలనలో పండించిన ధాన్యం కొనకపోవడంతో రైతులు కల్లాల్లోనే చనిపోయారని, తాము ఆ పరిస్థితి రానివ్వబోమని స్పష్టం చేశారు.తెలంగాణలో ప్రజాపాలన మొదలయ్యిందని, ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్ధి ఆత్రం సుగుణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు రేవంత్ రెడ్డి. ఆదిలాబాద్ ఎంపీ సీటులో నేటి వరకు ప్రధాన పార్టీలేవీ మహిళా అభ్యర్థికి అవకాశం ఇవ్వలేదని, తొలిసారి కాంగ్రెస్ పార్టీ టీచర్‌గా ఉన్న ఆత్రం సుగుణకు టికెట్ ఇచ్చిందని, ఆమెను గెలిపించి, ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని, దీనికోసం కార్యకర్తలు, నేతలంతా ఒక్కటై పనిచేయాలని సూచించారు.

Also Read:మోదీకి ఎలక్షన్ కోడ్ వర్తించదా?

నిజామాబాద్‌లో…

రాముడు ఏ ఒక్క పార్టీ వారికో దేవుడు కాదనీ, ఆయన అందిరి వాడని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీజేపీ మతం పేరుతో రాజకీయాలు చేస్తోందని, ప్రజలను మతం పేరిట విడదీయటం మంచిది కాదని ఆయన హితవు పలికారు. నిజామాబాద్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన జీవన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను కోరారు.నిజామాబాద్ అంటే తనకు ప్రత్యేకమైన అభిమానమని చెప్పుకొచ్చారు. బోధన్‌లో మూతపడిన చక్కెర కర్మాగారం తెరిచేందుకు తమ ప్రభుత్వం ఇప్పటికే మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించిందని గుర్తుంచేశారు. సెప్టెంబర్ 17లోగా చక్కెర కర్మాగారం తెరిపించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. తనను గెలిపిస్తే వంద రోజుల్లో చక్కెర కర్మాగారం తెరుస్తామని కేసీఆర్ గతంలో మోసం చేశాడని మండి పడ్డారు.‘వరి వేస్తే ఉరే’ అన్న కేసీఆర్‌కు నిజామాబాద్ రైతులు శాశ్వతంగా రాజకీయ సమాధి కట్టారన్నారు. హర్యానా రైతుల తరువాత అంతటి పౌరుషం, ఆత్మగౌరవం నిజామాబాద్ జిల్లా రైతులకే ఉందన్నారు. మొండివైఖరి ప్రదర్శించే ప్రభుత్వాల మెడలు వంచి తమ సమస్యలను పరిష్కరించుకునే సత్తా వీరి సొంతమని కొనియాడారు.

ఈ ఎన్నికల్లో ప్రజలు బండిని, గుండును నమ్మరని జోస్యం చెప్పారు. గత పార్లమెంటు ఎన్నికల్లో తనను గెలిపిస్తే 5 రోజుల్లో పసుపుబోర్డు తెస్తానని బాండ్ పేపర్ రాసిచ్చిన సిట్టింగ్ బీజేపీ ఎంపీ అరవింద్, నాలుగున్నరేళ్లకు స్పైసెస్ బోర్డు తెచ్చి అదే పసుపు బోర్డు అని ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. నిజామాబాద్ రైతులకు స్పైసెస్ బోర్డుకు, పసుపు బోర్డుకు తేడా తెలియదా అని ప్రశ్నించారు. ఈ ప్రాంత రైతుల కోసం తన జీవితం అంకితం చేయాలనుకుంటున్నానని సోదర సమానుడైన జీవన్ రెడ్డి తనతో చెప్పారని, కనుక ఆయనను గెలిపించాలని కోరారు. ఈ ఎన్నికల తర్వాత కేంద్రంలో ఖచ్చితంగా ఇండియా కూటమే అధికారంలోకి రాబోతోందనీ, తాను స్వయంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఒప్పించి జీవన్ రెడ్డికి కేంద్రమంత్రి వచ్చేందుకు కృషి చేస్తాననీ, అప్పుడు ఖచ్చితంగా పసుపు బోర్డు వచ్చితీరుతుందన్నారు.కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హిందువుల ఆస్తులను ముస్లింలకు అప్పగిస్తుందని ప్రధాని చేసిన వ్యాఖ్యలపై రేవంత్ మండిపడ్డారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన మోదీ, మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని, ఓటమి భయంతోనే ఆయన విభజన రాజకీయం చేస్తున్నారన్నారు. దేవుడు గుడిలో, భక్తి గుండెలో ఉండాలనీ, కేవలం ఎన్నికల్లో గెలుపు కోసం ఇలాంటి రాజకీయం తగదని హితవు పలికారు. రాముడు అందరి వాడనీ, ఒక హిందువుగా తాను రాముడిని పూజించినా, ఇతర మతాలను గౌరవిస్తానన్నారు. బాసర సరస్వతీ దేవి సాక్షిగా చెబుతున్నా… పంద్రాగస్టులోగా రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేసే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని, పావన గోదావరీ తీరాన ఉన్న బాసర సరస్వతీ దేవి సాక్షిగా ఇది తాను చేస్తున్న ప్రమాణమని ప్రకటించారు. ప్రశ్నించే గొంతును పార్లమెంటుకు పంపి ఇందూరు గౌరవాన్ని నిలబెట్టాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

Also Read:R రైజింగ్ R రేవంత్ R రెడ్డి

మల్కాజ్‌గిరిలో…

ఎవరెన్ని కుట్రలు చేసినా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఆయన, మల్కాజ్‌గిరిలో జరిగిన జన జాతర సభలో పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డిని ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. గత ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేసిందని, ఎవరైనా నిలదీస్తే కుట్రపూరితంగా వ్యవహరించేవారని విమర్శించారు. పడిపోతున్న తనను మల్కాజ్‌గిరి ప్రజలు నిలబెట్టారని, ప్రశ్నించే గొంతుకైన తనను ఎంపీగా గెలిపించి డిల్లీకి పంపించారని చెప్పారు. ఇప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యానంటే అందుకు మల్కాజ్‌గిరి ప్రజల కృషి కూడా ఉందన్నారు. వారికి రుణపడి ఉంటానని, ఇప్పుడు ఇదే స్థానం నుంచి సునీతమ్మను నిలబెట్టామని చెప్పారు. ముందు ఆమెను చేవెళ్లలో నిలబెట్టాలని అనుకున్నామని, ప్రజా పరిపాలనపై, ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న ఆమె, తాను ప్రాతినిథ్యం వహించిన స్థానంలో నిలబెడితే మంచిదని భావించినట్టు చెప్పారు. కేసీఆర్ పనితనం పదేళ్లు చూశారని, మోడీతో కలిసి కుట్రపూరితంగా వ్యహరిస్తున్నారని, దీనిని ప్రతీ ఒక్కరూ ఎండగట్టాలని పిలుపునిచ్చారు సీఎం. బీఆర్ఎస్, బీజేపీ, తోడు దొంగల పార్టీలని ఆరోపించారు. ఈ సందర్భంగా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ను ప్రశ్నించారు రేవంత్. హుజూరాబాద్‌కు మోడీ నుంచి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలన్నారు. అక్కడ అభివృద్ధి చేసి ఉంటే ప్రజలు ఎందుకు ఓడించేవారని సెటైర్లు వేశారు. మోడీ, అమిత్ షా ఎప్పుడూ తన జేబులోనే ఉంటారని చెప్పుకుంటున్న ఈటల, కేసీఆర్ అవినీతిపై ఎందుకు చర్యలు తీసుకోమని అడగరని మండిపడ్డారు. ‘‘కేసీఆర్, కేటీఆర్ గురించి ఈటల ఎందుకు మాట్లాడరు. మోడీ ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధమైతే చెప్పండి. మా మైనంపల్లి సిద్ధంగా ఉన్నారు.

రెండు లక్షల ఉద్యోగాలు లేవు. ప్రతి ఒక్కరి అకౌంట్లో పది లక్షలు లేవు. నల్ల డబ్బు తెస్తానని, నల్ల చట్టాలను తెచ్చి రైతుల ఉసురు తీసుకున్నారు. స్వామినాథన్ ఇచ్చిన సిఫార్సులను అమలు చేయడానికి మోడీకి చేతులెందుకు రావడం లేదు. జన్ ధన్ అకౌంట్లలో పది లక్షలు వేస్తామని ప్రజలను నిలువునా మోసం చేసి పదేళ్లు అవుతోంది. ప్రధాని హోదాలో ఉండి మోడీ నోటికొచ్చింది మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ వస్తే హిందూవుల ఆస్తులను ముస్లింలకు పంచి పెడుతోందని నీచంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి నీచమైన ప్రచారాలు చేస్తున్న మోడీ తరుపున ఈటల రాజేందర్ ఎలా పోటీ చేస్తున్నారో అడగండి. రాముడిని బజారులో నిలబెట్టి, గోడల మీద రాతలు రాసి రాజకీయం చేయడం సరైనదేనా? దేవుడు గుడిలో ఉండాలి. భక్తి గుండెల్లో ఉండాలి. కమ్యూనిస్ట్‌నని చెప్పుకుంటున్న ఈటల రాజేందర్ దేవుళ్ళ పేరుతో చిచ్చు పెట్టే వారితో చేతులెందుకు కలిపారో నిలదీయండి. మోడీతో కేసీఆర్ చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారు. అందుకు మల్కాజ్‌గిరిలో కేసీఆర్ నిలబెట్టిన అభ్యర్థే నిదర్శనం. నాకు అండగా నిలబడినట్టే సునీతమ్మను గెలిపించండి. ఈ ప్రాంతానికి పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తా. అర్హులైన ప్రతి ఒక్కరికీ తెల్ల రేషన్ కార్డు అందిస్తాం. ఆరు గ్యారెంటీల అమలుకు బీఆర్ఎస్, బీజేపీ కలిసి కుట్రలు చేస్తున్నాయి’’ అంటూ విమర్శలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి.

Publisher : Swetcha Daily

Latest

Hyderabad:బిల్డర్ మధు హత్యకు కారణం అదేనా?

Jeedimetla Bulder Madhu murder case back daughter love marriage...

Cyclone: వణికిస్తున్న తుపాను, భయపడుతున్న జనాలు

Remal Cyclone Effect On West Bengal And Bangladesh: బంగాళాఖాతంలో...

NTR:జనం మెచ్చిన ‘ప్రభంజనం’

Nandamuri Taraka Ramarao political fame with tollywood strong crazy...

Aiswarya Menon:అయినా తగ్గని ‘వాయువేగం’

Tollywood actress Aiswarya Menon upcoming movie Bhaje vayu vegam...

Hyderabad:ఆపరేషన్ నయీం డైరీ

మళ్లీ తెరపై నయీం డైరీ ..కేసు రీ ఓపెన్ కు...

Don't miss

Hyderabad:బిల్డర్ మధు హత్యకు కారణం అదేనా?

Jeedimetla Bulder Madhu murder case back daughter love marriage...

Cyclone: వణికిస్తున్న తుపాను, భయపడుతున్న జనాలు

Remal Cyclone Effect On West Bengal And Bangladesh: బంగాళాఖాతంలో...

NTR:జనం మెచ్చిన ‘ప్రభంజనం’

Nandamuri Taraka Ramarao political fame with tollywood strong crazy...

Aiswarya Menon:అయినా తగ్గని ‘వాయువేగం’

Tollywood actress Aiswarya Menon upcoming movie Bhaje vayu vegam...

Hyderabad:ఆపరేషన్ నయీం డైరీ

మళ్లీ తెరపై నయీం డైరీ ..కేసు రీ ఓపెన్ కు...

RS Praveen Kumar: మర్డర్ చేసినా.. మాట్లాడరేం?

- శ్రీధర్ రెడ్డి హత్య కేసులో చర్యలేవీ? - మంత్రి నిందితుడైతే చర్యలుండవా? - వారంలో చర్యలు తీసుకోకుంటే.. రోడ్డెక్కుతా? - ఫోన్ ట్యాపింగ్‌పై రాజకీయం తగదు - నిందితులకు శిక్ష పడక తప్పదు - బీఆర్ఎస్ నేత...

CM Revanth Reddy: మీ గ్యారెంటీకి వారంటీ అయిపోయింది

- ప్రగతిశీల శక్తులకు చిరునామా.. కేరళ - మాటల మోదీ ఇక ఇంటికి పోవాల్సిందే -కేరళ పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్‌ -అనంతరం హస్తిన వెళ్లిన సీఎం - సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గేలకు ఆహ్వానాలు PM Modi: ఈ సార్వత్రిక...

Jeevan Reddy: నెహ్రూ హయాంలో వ్యవసాయం, పరిశ్రమల అభివృద్ధి

Jawahar Lal Nehru: దేశం ఈ స్థాయికి చేరుకున్నదంటే అందుకు ప్రధాన కారణం జవహర్ లాల్ నెహ్రూ అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఆయన ఆధ్వర్యంలోనే సాగు పరంగా, పారిశ్రామికంగానూ దేశం...