Saturday, May 18, 2024

Exclusive

SIT Team: పసలేని ఫిర్యాదులతో సిట్ బృందానికి కొత్త తలనొప్పులు

– బాధితులమంటూ వస్తున్న చీటర్లు
– సిట్‌‌లో ఫిర్యాదు పేరుతో క్లీన్ ఇమేజ్‌కు యత్నాలు
– ఫిర్యాదులతో వచ్చిన చికోటి ప్రవీణ్, సంధ్యా శ్రీధర్ రావు
– మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిందితుడు
– సానుభూతి పొంది సర్కారుకు దగ్గరయ్యేందుకు యత్నాలు
– ప్రతి ఎమ్మెల్యే ఫోన్ ట్యాప్ చేయించిన సుప్రీమో
– వారి డాటాతో బ్లేమ్ గేమ్ ఆడిన ప్రభాకర్ రావు
– ఫిర్యాదు అంటూ క్యూ కడుతున్న పోకిరీలు
– పసలేని ఫిర్యాదులతో తలపట్టుకుంటున్న సిట్ బృందం

Chikoti Praveen,Sandhya Sridhar Rao Who Came As Victims Of Cheaters Complaints: తెలంగాణలో సంచలనం సృష్టిస్తోన్న ఫోన్ ట్యాపింగ్ కేసును విచారణ చేస్తున్న పోలీసుల బృందానికి కొత్త తలనొప్పులు ఎదురవుతున్నాయి. దశాబ్దాలుగా జనాన్ని లూటీచేసి, వందల కోట్లు అక్రమార్జనకు పాల్పడిన మోసగాళ్లంతా ఫోన్ ట్యాపింగ్ కేసును అడ్డంపెట్టుకుని సానుభూతి నాటకాలకు దిగుతున్నారు. ‘మేమూ బాధితులమే’ అంటూ పోలీసుల మందుకు వచ్చి ఫిర్యాదులు సమర్పించి, మీడియాలో ‘ఇన్నాళ్లుగా మీరు చూసిందంతా నిజంకాదు’ అనే భ్రమను కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు. పేదల భూములను దర్జాగా కబ్జా చేసిన కేటుగాళ్లు, గాంబ్లింగ్ పేరుతో వేల కుటుంబాలను రోడ్డు మీదకి తెచ్చిన మోసగాళ్లు, ఏకంగా ఎమ్మెల్యేలనే కొనేందుకు స్కెచ్ వేసిన మాయగాళ్లు ఫిర్యాదుల నాటకంతో సమాజం నుంచి క్లీన్ చిట్ పొందేందుకు రంగంలోకి దిగారు. వీరికి తోడు వందల సంఖ్యలో పోకిరీలు ‘సార్.. మా ఫోనూ ట్యాప్ అయింది’ అంటూ పసలేని ఫిర్యాదులతో సిట్ బృందానికి అందజేస్తున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని, ఈ కేసులో సాంకేతిక సాక్ష్యాల ఆధారంగా అసలు నిందితులను చట్టం ముందు నిలబెట్టేందుకు తాము చేస్తున్న ప్రయత్నాలకు ఈ ఫేక్ ఫిర్యాదులు అవరోధంగా మారుతున్నాయని, వీటివల్ల అసలు బోలెడంత సమయం వృధా అవుతోందని, దీనివల్ల విచారణ ఆలస్యమై కీలక నిందితులు తప్పించుకునే ప్రమాదం ఉందని దర్యాప్తు బృంద అధికారులు తలపట్టుకుంటున్నారు.

చీకోటి చీప్ ట్రిక్స్

బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రుల అండతో తెలంగాణలో గాంబ్లింగ్ హౌస్‌లు నడిపి కోట్లు కూడబెట్టిన చికోటి ప్రవీణ్ ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారంలో తానూ బాధితుడినని తమ ముందుకు రావటంతో దర్యాప్తు అధికారులు ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతున్నారు. గత ప్రభుత్వంలోని కొందరు మంత్రులతో అంటకాగతున్న ప్రవీణ్ గాంబ్లింగ్ ముచ్చటను మంత్రుల ఫోన్లను ట్యాప్ చేసే క్రమంలో నాటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పసిగట్టి, అప్పటి ప్రభుత్వ పెద్దకు తెలియజేశారు. అదే సమయంలో ఈడీ ప్రవీణ్‌ను నేపాల్‌లో అరెస్టు చేసి విచారించటం, ఆనక అతడు బీజేపీలో చేరి కేసులన్నీ మాఫీ అయ్యాయంటూ ప్రచారం చేసుకోవటం తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికలతో బాటు ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగేందుకు ప్రయత్నాలూ చేసిన సంగతి తెలిసిందే. నిజంగా ఇతని ఫోన్ ట్యాప్ చేసి ఉంటే ఇన్నాళ్ల పాటు ఎందుకు మౌనంగా ఉన్నాడనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గత ప్రభుత్వాన్ని దోషిగా చూపి, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి దగ్గరై తిరిగి తెలంగాణలో గాంబ్లింగ్ దందా షురూ చేయాలనే మాస్టర్ ప్లాన్ కూడా ఉండొచ్చనే వాదనా వినిపిస్తోంది.

Read Also:తుక్కుగూడ జనజాతరపై సీఎం సమీక్ష

అదే బాటలో చీటింగ్ శ్రీధర్ రావు

హైదరాబాద్ నగర పరిధిలోని పోలీసు స్టేషన్లలో 40కి పైగా కేసులు ఎదుర్కొంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి సంధ్యా శ్రీధర్ రావు కూడా ‘నేనూ బాధితుడినే’ అంటూ రావటం చూసి జనం నోరెళ్ల బెడుతున్నారు. 90కి పైగా ఆదాయపు పన్ను శాఖ నోటీసులు అందుకున్న ఈ ఘనుడు గత ప్రభుత్వానికి ఏకంగా రూ. 13 కోట్లను ఎన్నికల బాండ్ల రూపంలో సమర్పించి నాటి ప్రభుత్వ పెద్దల పట్ల తనకున్న భక్తిని చాటుకున్నాడు. ‘నగర శివారు ప్రాంతాల భూములన్నీ నావే’ అని చెప్పుకుంటూ పలువురిని మోసగించిన శ్రీధర్ రావు గత ప్రభుత్వం మద్దతుతో 5 వేల కోట్ల మేర పనులు చేయించుకున్నారని వినికిడి. అయితే, ట్యాపింగ్ వ్యవహారంపై దర్యాప్తు మొదలుపెట్టగానే, ‘నా ఫోన్ ట్యాప్ చేసి, నా ఇంటికొచ్చి బెదిరించి, అన్యాయంగా కోట్ల రూపాయలు లాక్కుపోయారు’ అంటూ నాటి అధికారుల మీద ఫిర్యాదు చేయగా, ఇతని బాగోతం తెలిసిన డీసీపీ.. ఇన్నాళ్లూ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించినట్లు సమాచారం. అనేకమందిని చీట్ చేసి, బెదిరించి దర్జాగా కోట్లు సంపాదించిన ఇతగాడి దందాలకు నాటి ఫోన్ ట్యాపింగ్ బృందం అండ ఉందేమోననే అనుమానాలను ఇతని బాధితులు ఇప్పుడు వ్యక్తం చేస్తున్నారు.

‘నస’ తప్ప పసలేని నందకుమార్ వాదన

ఫామ్‌హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అరెస్టైన నందకుమార్ కూడా సిట్ బృందం ముందుకు తన ఫోన్ ట్యాప్ అయిందంటూ వచ్చిన సంగతి తెలిసిందే. భూములను లీజ్‌కి తీసుకుని, వాటిని కబ్బాచేయటమే ప్రధాన వ్యాపకంగా కలిగిన ఇతడు నాడు నాటి ప్రభుత్వం చేయించిన ఫోన్ ట్యాపింగ్‌ కారణంగా రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయి అరెస్టయ్యాడు. హోటల్ వ్యాపారంలో ఉన్న స్వామీజీలతో పరిచయాలు పెంచుకుని బీజేపీ నేతగానూ ఎదిగేందుకు ప్రయత్నించాడు గానీ ఇతడు బీజేపీ ఫుల్‌టైం కార్యకర్త కూడా కాదు. నాటి సీనియర్ నేతలు, అధికారుల మద్దతుతో అనేక భూకబ్జాలకు పాల్పడిన నందకుమార్.. ఫోన్ ట్యాపింగ్‌ను అడ్డుపెట్టుకునే నన్ను ఫామ్‌హౌస్‌లో నాడు అరెస్టు చేశారని ఫిర్యాదు చేయటం సిట్ అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నాటి ఫామ్‌హౌస్ కేసులో కేంద్ర ప్రభుత్వానికి సన్నిహితుడైన బీఎల్ సంతోష్ పేరు బయటికి రావటం, ఆయన మీద చర్యలకు దిగితే తాము దొంగచాటుగా చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం బయటపడుతుందని, అదే జరిగితే 2023 ఎన్నికల్లో తమకు తలనొప్పిగా మారుతుందనే ఉద్దేశంతోనే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఫామ్‌హౌస్ కేసును పక్కనబెట్టిందనే అనుమానాలూ ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి.

Read Also:ఇంతకీ ఏమంటారు..?

ఇక వీరు గాక పోకిరీలు, వ్యక్తిగత దురుద్దేశాలతో కూడా తమ ఫోన్ ట్యాప్ అయిందంటూ సిట్ ముందుకు వస్తున్నారు. ఇప్పటివరకు పోలీసులకు 600 కు పైగా ఫిర్యాదులు రాగా, త్వరలో ఇది మరింత పెరిగేలా ఉంది. మరోవైపు చీటర్లంతా ఫిర్యాదులు చేసి మీడియా ముందుకొచ్చి తాము బాధితులమే అంటూ, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవటాన్ని చూస్తుంటే వీరంతా కాంగ్రెస్ ప్రభుత్వానికి దగ్గరై మళ్లీ తమ అక్రమ వ్యాపార సామ్రాజ్యాలను మరింత విస్తరించుకోవటానికి చేస్తున్న ప్రయత్నాలుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

ట్యాపింగ్ కేస్ అప్‌డేట్

సంచలనం సృష్టిస్తోన్న ఈ కేసులో హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావును ఏడు రోజుల పోలీసు కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రేపటి నుంచి నుంచి ఈనెల 10వ తేదీ వరకు పంజాగుట్ట పోలీసులు కస్టడీకి తీసుకొని విచారించనున్నారు. నాటి ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాలతో భవ్య సిమెంట్‌ యజమాని ఆనంద్‌ ప్రసాద్‌ నుంచి రూ.70 లక్షలు సీజ్‌ చేనట్లు, దుబ్బాక ఉప ఎన్నిక వేళ రఘునందన్‌రావు, ఆయన బంధువుల నుంచి రూ.కోటి సీజ్ చేశామని, మునుగోడు ఉపఎన్నిక వేళ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి చెందిన రూ.3.50 కోట్లు స్వాధీనం చేసుకున్నామని ఈ కేసులో ఏ4గా ఉన్న రాధాకిషన్ రావు తాజా విచారణలో అంగీకరించారు. 2016లో ఒకే సామాజిక వర్గపు అధికారులతో స్పెషల్ టీమ్‌ను ఏర్పాటు చేసుకున్నట్లూ ఈయన విచారణలో అంగీకరించారు.

– దేవేందర్ రెడ్డి చింతకుంట్ల (సీనియర్ జర్నలిస్ట్‌)

Publisher : Swetcha Daily

Latest

Medak: బీఆర్ఎస్ అభ్యర్థిని డిస్‌క్వాలిఫై చేయాలి: సీఈవోకు రఘునందన్ రావు ఫిర్యాదు

Raghunandan Rao: మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై బీజేపీ అభ్యర్థి రఘునందన్...

TTD: శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల

TTDevasthanam: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల...

BRS: కవితతో బాల్క సుమన్, ఆర్ఎస్పీ ములాఖత్.. ప్రభుత్వ పాలసీపై కేసు పెడితే..!

Delhi Liquor Policy: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్...

Vijayashanthi: కిషన్ రెడ్డిపై విజయశాంతి ట్వీట్ వైరల్.. రాములమ్మ ఏం చెప్పాలనుకున్నారు?

Telangana: విజయశాంతి చేసిన ఓ ట్వీట్‌పై సోషల్ మీడియాలో తెగ చర్చ...

పౌర సమాజ చైతన్యమే తెలంగాణకు రక్ష..

మరో పక్షం రోజుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తి కావస్తోంది....

Don't miss

Medak: బీఆర్ఎస్ అభ్యర్థిని డిస్‌క్వాలిఫై చేయాలి: సీఈవోకు రఘునందన్ రావు ఫిర్యాదు

Raghunandan Rao: మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై బీజేపీ అభ్యర్థి రఘునందన్...

TTD: శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల

TTDevasthanam: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల...

BRS: కవితతో బాల్క సుమన్, ఆర్ఎస్పీ ములాఖత్.. ప్రభుత్వ పాలసీపై కేసు పెడితే..!

Delhi Liquor Policy: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్...

Vijayashanthi: కిషన్ రెడ్డిపై విజయశాంతి ట్వీట్ వైరల్.. రాములమ్మ ఏం చెప్పాలనుకున్నారు?

Telangana: విజయశాంతి చేసిన ఓ ట్వీట్‌పై సోషల్ మీడియాలో తెగ చర్చ...

పౌర సమాజ చైతన్యమే తెలంగాణకు రక్ష..

మరో పక్షం రోజుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తి కావస్తోంది....

Hyderabad: బీఆర్ఎస్ ‘పవర్’గేమ్

బీఆర్ఎస్ హయాంలో యాదాద్రి పవర్ ప్లాంట్ అక్రమాలు ఓపెన్​ టెండర్లు లేకుండానే ఛత్తీస్ గడ్ తో కరెంట్ పర్చేజ్ రైతులకు సబ్సిడీ పేరుతో బలవంతంగా విద్యుత్ పరికరాలు బీఆర్ఎస్ విధానాలతో తీవ్రంగా...

Hyderabad:ఎవరి చేతికి కాంగి‘రేస్’ పగ్గాలు ?

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి నియామకానికి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ రేసులో సీనియర్ హేమాహేమీలు జూన్ నెలాఖరున జరగబోయే స్థానిక ఎన్నికలకు ముందే అధ్యక్షుని ఎంపిక పీసీసీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న నేతలలో...

Sahiti Scam : ఆలస్యం.. అమృతం.. విషం! సాహితీ బాధితుల ఆవేదన

- సాహితీ కన్‌స్ట్రక్షన్ కేసు కంచికేనా? - హడావుడి తప్ప ఆదుకునే వారే లేరా? - పేరొందిన చార్టర్డ్ అకౌంట్‌తో లాబీయింగ్‌లు - డబ్బులతో అంతా సెట్ చేస్తున్నారా? - 110 అకౌంట్స్ ద్వారా పక్కదారి పట్టిన నగదు -...