Tuesday, December 3, 2024

Exclusive

New Delhi: ‘సీరం’తో బేరం ?

  • బీజేపీకి లబ్ది చేకూర్చిన సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా
  • కోవీషీల్డ్ వ్యాక్సిన్ దేశవ్యాప్తంగా పంపిణీకి అనుమతులు
  • 50 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్ల విరాళం
  • మోదీపై ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ నేతలు
  • భారత్ లో 175 కోట్ల వ్యాక్సిన్లు పంపిణీ చేసిన కేంద్రం
  • కోవిడ్ సర్టిఫికెట్లలో మోదీ ఫోటో మాయంపై సందేహాలు
  • ఎన్నికల కోడ్ ఉన్నందున తీసేశామంటున్న కేంద్ర ఆరోగ్య శాఖ
  • ఇప్పటికే సుప్రీం కోర్టును ఆశ్రయించిన న్యాయవాది విశాల్‌ తివారి
  • ఎన్నికల వేళ ఇరుకున పడ్డ మోదీ సర్కార్

Cerium company offered Modi 50 crores electoral fund covishield:
గత కొద్దిరోజులుగా కోవిషీల్డ్ దుష్ప్రభావాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సైడ్ ఎఫెక్టులు నిజమేనని ఆ సంస్థే ఒప్పుకుంది. ఇక భారత్ లో దా దాపు 175 కోట్ల మందికి పైగా కోవిషీల్డ్ వ్యాక్సిన్లు వేసుకున్నారని గణాంకాలు చెబుతున్న వేళ కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై కాంగ్రెస్ ఎదురుదాడి ప్రారంభించింది. జర్మనీ, డెన్మార్క్, నెథర్లాండ్స్, థాయ్‌ల్యాండ్ వంటి దేశాలు ఆస్ట్రాజెనికా రూపొందించిన వ్యాక్సిన్ ను నిషేధిస్తే ఇండియాలో ఎందుకు అనుమతులు ఇచ్చారని ప్రశ్నిస్తోంది. వ్యాక్సిన్ తో పెద్ద ఎత్తున బిజినెస్ చేశారని, తద్వారా బీజేపీకి మేలు కలిగేలా సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా 50 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను బీజేపీకి ఇచ్చిందని కాంగ్రెస్ విమర్శించింది.

చర్చనీయాంశంగా ఎలక్టోరల్ బాండ్లు

కరోనా సమయంలో మానవ మరణాలను నిలువరించేందుకే కోవిషీల్డ్ కు అనుమతులు ఇస్తే…సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా రూ.50 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను ఎందుకు ఇచ్చిందనేది చర్చనీయాంశం అవుతోంది. ఆస్ట్రాజెనికా రూపొందించిన వ్యాక్సిన్ వలన దుష్ప్రభావాలు ఉంటాయని వైద్య నిపుణులు స్పష్టం చేసినా అప్పట్లో కేంద్రంలోని బీజేపీ అనుమతులు ఇవ్వడం క్విడ్ ప్రోకో అని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కోవిషీల్డ్ రక్తం గడ్డకట్టడం, తక్కువ ప్లేట్‌లెట్ కౌంట్‌కు కారణమవుతుందని ఆస్ట్రాజెనెకా అంగీకరించడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ నరేంద్ర మోడీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దుష్ప్రభావాలు ఉంటాయని తెలిసినా టీకాకు అనుమతులు ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తోంది. భారతీయులకు ఉచిత వ్యాక్సిన్‌ డోస్‌లు ఇచ్చినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ బీజేపీ విడుదల చేసిన నాటి పోస్టర్లపై కాంగ్రెస్‌ నేత బీఎస్‌ శ్రీనివాస్‌ తాజాగా వ్యంగ్యంగా స్పందించారు. “ధన్యవాదాలు మోదీ జీ బ్యానర్‌ ఎక్కడ ఉంది?” అని ప్రశ్నించారు.ఈ విషయంపై ప్రధాని మౌనం వహించడాన్ని ఆయన ఆక్షేపించారు. “ఇది రాజకీయాలకు సంబంధించినది కాదు, ప్రజల జీవితానికి సంబంధించినది.లోపాలు ఉన్న వ్యాక్సిన్‌ను తీసుకున్న ప్రధాని సమాధానం చెప్పాలి. ఎందుకంటే భారతదేశ జనాభాలో సగానికి పైగా ఆస్ట్రాజెనెకా కోవిషీల్డ్‌ను తీసుకున్నారని తెలిపారు. పౌరుల ప్రాణాల కన్నా రాజకీయాలకే బీజేపీ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిందని మండిపడుతున్నారు.

సుప్రీంకోర్టును ఆశ్రయించిన న్యాయవాది

కోవిషీల్డ్ సైడ్ ఎఫెక్ట్స్ విషయంలో భారత్‌లో విశాల్‌ తివారి అనే న్యాయవాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోవిషీల్డ్ టీకా వేసుకున్నవారికి జరిగిన దుష్పరిణామాలపై అధ్యయనానికి మెడికల్ నిపుణుల ప్యానెల్‌ ఏర్పాటు చేసేలా కేంద్రాన్నిఆదేశించాలని కోరారు. ఢిల్లీ ఎయిమ్స్‌ డైరక్టర్‌తో పాటు సుప్రీంకోర్ట్ రిటైర్డ్‌ న్యాయమూర్తి పర్యవేక్షణలో ఈ ప్యానెల్ పనిచేసేలా చూడాలని న్యాయవాది కోరారు. అదే సమయంలో కొవిషీల్డ్‌ కారణంగా మరణించిన అలాగే తీవ్ర దుష్పరిణామాలు ఎదుర్కొన్న వారికి నష్టపరిహారం చెల్లించేలా సుప్రీంకోర్ట్‌ ఆదేశాలు జారీ చేయాలని న్యాయవాది కోరారు. భారత్‌లో కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ తయారీకి పుణెలోని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు లైసన్స్‌ ఇచ్చిన సంగతిని న్యాయవాది తివారి గుర్తు చేశారు. భారత్‌లో 175 కోట్ల కొవిషీల్డ్‌ వ్యాక్సిన్లు వేశారని కూడా న్యాయవాది సుప్రీంకోర్ట్‌ దృష్టికి తెచ్చారు.

కోవిడ్ సర్టిఫికెట్ పై మోదీ మాయం

కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌తో సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉన్నాయన్న సంగతి బయటకు వచ్చిన నేపథ్యంలో ‘కొవిడ్‌ వ్యాక్సిన్‌ సర్టిఫికెట్‌’లో ప్రధాని మోదీ ఫొటో మాయమవడం లోక్‌సభ ఎన్నికల వేళ చర్చనీయాంశమైంది. తాజాగా కొవిడ్‌ టీకా సర్టిఫికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నవారు.. ప్రధాని మోదీ ఫొటో అందులో లేకపోవటాన్ని గుర్తించారు. ‘ఎక్స్‌’ వేదికగా పలువురు యూజర్లు ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌తో సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉన్నాయని బ్రిటన్‌ కోర్టు ముందు ‘ఆస్ట్రాజెనికా’ (టీకా తయారీ కంపెనీ) అంగీకరించటమే ఇందుకు కారణమని పలువురు యూజర్లు అభిప్రాయపడ్డారు. దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ స్పందించింది. ఎన్నికల కోడ్‌లో భాగంగా కొవిడ్‌ సర్టిఫికెట్‌ నుంచి ప్రధాని మోదీ ఫొటోను తొలగించినట్టు తెలిపింది.

Publisher : Swetcha Daily

Latest

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Don't miss

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Telangana: ఎన్నాళ్లీ మూత ‘బడులు’

బీఆర్ఎస్ హయాంలో అస్తవ్యస్తంగా మారిన పాఠశాల విద్య 28 వేల పాఠశాలలకు గాను మూతపడిన సగం పాఠశాలలు పాఠశాల విద్యపై ప్రచారార్భాటమే తప్ప చేసింది శూన్యం బీఆర్ఎస్ విధానాన్ని తప్పుబడుతున్న విద్యావేత్తలు ...

Hyderabad: గుండె ‘చెరువు’ అవుతోంది

దురాక్రమణదారుల కబ్జా కోరల్లో నగర చెరువులు టీ.సర్కార్ వెబ్ సైట్ లో కేవలం 19,314 చెరువుల సమాచారం చెరువుల సంఖ్యపై సమగ్ర సమాచారం సేకరించిన గత పాలకులు ఉన్న చెరువులనైనా కాపాడుకోవడానిక...

Hyderabad:ఆదిల్ కు అండగా సీఎం

CM Reventh reddy Reassurance to cancer patient Mohammadd Adil క్యాన్సర్‌ బాధితుడు మహమ్మద్‌ ఆదిల్‌ను ఆదుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆ కుటుంబానికి భరోసానిచ్చారు. శనివారం రేవంత్‌ వరంగల్‌ జిల్లా పర్యటనకు వెళ్లిన...