Minister Sitharaman reacts on election bonds
జాతీయం

Central Minister: ఎన్నికల బాండ్లపై మంత్రి సీతారామన్ రియాక్షన్‌

Minister Sitharaman Reacts On Election Bonds: రాజకీయ పార్టీలకు విరాళాలు అందజేసిన 30 కంపెనీలలో కనీసం 15 కంపెనీలకు కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి చర్యలు ఎదుర్కొంది. ఈ ఎన్నికల సంఘం రిలీజ్ చేసిన ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించడంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రియాక్ట్ అయ్యారు.

ఈ దాడులకు, వివరాలకు ముడిపెడుతూ చేస్తున్న వాదనలను ఆమె తీవ్రంగా పరిగణిస్తూ కొట్టిపారేశారు. ఇండియా టుడే కాంక్లేవ్‌లో ఆమె పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. 2013లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎలక్టోరల్ ట్రస్ట్ సీమ్‌ను ప్రస్తావిస్తూ రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చే ఇదివరకున్న విధానం పూర్తిగా లోపభూయిష్టమని ఆమె అన్నారు.

Read More: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు నిందితుడిని అదుపులోకి తీసుకున్న ఎన్‌ఐఏ

ఈసీ రిలీజ్‌ చేసిన ఎన్నికల బాండ్ల డీటెయిల్స్‌పై అడిగిన ప్రశ్నకు ఆమె జవాబిస్తూ ఈడీ దాడుల తర్వాతే విరాళాలు ఇచ్చారన్న మీ ఆలోచనే ఊహాజనితమైనదని అన్నారు. విరాళాలు ఇచ్చిన తర్వాత కూడా ఈడీ ద్వారా కంపెనీలపై దాడులు జరిపించకూడదా అని ఆమె ప్రశ్నించారు. ఈడీ దాడులు చేసిన తర్వాత తమను తాము రక్షించుకోవడానికి అవి తమకు విన్నవించుకున్నాయనడం ఊహాజనితమని అన్నారు.

ఎన్నికల రాజకీయ పార్టీలు అందుకున్న ఎన్నికల బాండ్లకు చెందిన విశిష్ట సంఖ్యను వెల్లడించకపోవడంపై ఎస్‌బిఐని సుప్రీంకోర్టు శుక్రవారం మందలించడంపై ఆమె స్పందించారు.ఈ కేసు ఇంకా కోర్టులో పరిధిలోనే ఉందని, తీర్పు మాత్రమే వచ్చిందని అన్నారు. గత ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఈ ఎన్నికల బాండ్ల పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు అన్న మాటలను ఆమె ఒక్కసారి గుర్తు చేశారు.

Read More: పెళ్లిళ్లు కుదిర్చే దైవం.. ఇడగుంజి గణపతి..!

ఇది గత విధానాల కన్నా మెరుగైనదని, డబ్బు ఖాతాల నుంచి పారీ ఖాతాలోకి వస్తోందని జైట్లీ చెప్పారని అన్నారు. ఇది పరిపూర్ణమైనది కాదని, అయితే ఎవరేం చేయాలో చేసిన విధానం నుంచి మాత్రమే మేం కొత్త విధానంలోకి వచ్చామని అన్నారు. ఇది పూర్తిగా లోపభూయిష్టమైన విధానం నుంచి పరిపూర్ణ విధానంలోకి వచ్చామని ఆర్థికమంత్రి వివరించారు.