criminal case on Padi kaushik reddy
Politics, Top Stories

Padi Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై బీఎస్ఎస్ యాక్ట్

  • హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌషిక్ రెడ్డి పై క్రిమినల్ కేసు
  • బిఎన్ఎస్ యాక్టులో కేసు నమోదు అయిన మొట్టమొదటి ఎమ్మెల్యే
  • ‘పాడి’ నోట పాడు మాటలు
  • జడ్పీ సమావేశం లో ఎమ్మెల్యే వ్యవహారించిన తీరుపై ఫిర్యాదు చేసిన జడ్పీ సిఈవో .
  • జడ్పీ మీటింగ్ లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి బూతు పురాణం
  • వేదిక హాల్ లోనే ఉమ్మేసిన ఎమ్మెల్యే
  • చిగురుమామిడి జడ్పీటీసీ గీకురు రవీందర్ పై చిందులు
  • కలెక్టర్ పమేలా సత్పతి బయటికి వెళ్ళే సమయంలొ అడ్డుకుని బైఠాయించిన కౌషిక్ రెడ్డి
  • భారత్ న్యాయ్ సంహిత యాక్ట్ ప్రకారం సెక్షన్ 221,126 (2} కేసు నమోదు
  • బిఎన్ఎస్ చట్టం అమలులొకి వచ్చిన రెండవ రోజే కౌశిక్ రెడ్డి పై నమోదు తో రికార్టుల్లోకి

BSS act implement on First BRS MLA Padi Kaushik Reddy rash behaviour in ZPTC meeting
కరీంనగర్ జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదయింది. దేశంలో కొత్త చట్టాలు అమలయ్యే వేళ బీఎస్ఎస్ యాక్ట్ కింద నమోదైన తొలి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కావడం గమనార్హం. ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే.. మంగళవారం జరిగిన కరీంనగర్ జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బూతు పురాణం అందుకున్నారు. తనను ప్రశ్నించిన చిగురుమామిడి జడ్పీటీసీ, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ గీకురు రవీందర్​పై చిందులు తొక్కారు. కరీంనగర్ డీఈవోను సస్పెండ్ చేయాలంటూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ జడ్పీటీసీ సభ్యులు అరగంట నిరసన తెలిపారు. దీంతో కలెక్టర్ సమావేశం నుంచి వెళ్లిపోయారు. కలెక్టర్ పమేలా సత్పతి బయటికి వెళ్ళే సమయంలొ ఎమ్మెల్యే కౌషిక్ రెడ్ అడ్డుకుని బైఠాయించారు. దీనితో ఆయనపై భారత్ న్యాయ్ సంహిత యాక్ట్ ప్రకారం సెక్షన్ 221,126 (2} కేసు నమోదు అయింది.

పాడి నోట పాడు మాటలు

అదే సమయంలో జడ్పీటీసీ గీకురు రవీందర్ లేచి ‘మీరు అధికారంలో ఉన్నప్పుడు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విషయంలో ప్రొటోకాల్ పాటించాలనే విషయం తెలియదా’ అని ప్రశ్నించారు. దీంతో కౌ శిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘అమ్ముడుపోయిన నువ్వు కూడా మాట్లాడేటోనివి అయినవా సిగ్గుండాలే.. తూ నీదో బతుకారా.. తూ.. తూ.. తూ అని’ బూతులు తిడుతూ వేదిక హాల్ లోనే ఉమ్మేశారు. ‘ఏం తమాషా చేస్తున్నావా? ఏందిరోయ్..మంచిగుండదు..నీ సంగతి చెప్తా. ఎటు పోతవు బిడ్డ. ఎక్కువ రోజులు ఉండవు. నీ సంగతి చెప్తా.. పొన్నం ప్రభాకర్ అండ చూసుకుని మాట్లాడుతున్నవా..ఏం పీకలేవు. నా ఎంటికతో బరాబార్ పో’ అంటూ మధ్యమధ్యలో బూతులు మాట్లాడారు.. దీంతో రవీందర్ కూడా అదే స్థాయిలో ఫైర్ అయ్యారు. చస్తానని బ్లాక్ మెయిల్ చేసి గెలిచావు అని విమర్శించారు. ‘ఉద్యమకారుల మీద రాళ్లేసినవాడివి నువ్వా మాట్లాడేది. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ కు అమ్ముడు పోయింది నువ్వు’ అంటూ విమర్శించారు. ఎమ్మెల్యే మాటలు విని మహిళా సభ్యులు కూడా తలదించుకోవడం కనిపించింది.