Thailand: మనం ఓ రెస్టారెంట్‌కు వెళ్లినా.. ఓ ప్రొడక్ట్ కొన్నా రివ్యూలు అడగడం సహజమే. మన పొందిన సంతృప్తిని బట్టి రివ్యూలు ఇస్తుంటాం. మన రివ్యూ మన ఇష్టం. కానీ, థాయ్‌లాండ్‌లో ఇలాగంటే కుదరదు. కేసు పెట్టి జైలులో వేస్తారు. ఓ బ్రిటీష్ టూరిస్టు వన్ స్టార్ రివ్యూ ఇచ్చాడని, తన మిత్రులతో ఉద్దేశపూర్వకంగా వన్ స్టార్ రివ్యూలు ఇప్పించాడని, తద్వార తమ రేటింగ్ పడిపోయిందని ఓ రెస్టారెంట్ ఓనర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆ బ్రిటీష్ పర్యాటకుడిని అరెస్టు చేశారు.
థాయ్‌లాండ్ దేశానికి పర్యాటకం ప్రధాన ఆదాయ వనరు. పర్యాటకులకు సేవలు అందిస్తూ చాలా మంది ఉపాధి పొందుతుంటారు. కాబట్టి, ఇంటర్‌నెట్‌లోనూ తమ సేవలకు మంచి గుర్తింపు ఉండాలని, రివ్యూలో రేటింగ్ బెటర్‌గా ఉండాలని తాపత్రయపడతారు. ఆ రేటింగ్‌లు చూసి కూడా టూరిస్టులు డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. ఇక విషయంలోకి వెళ్లితే.. బ్రిటీష్ టూరిస్టు అలెగ్జాండర్ తాను ఉంటున్న ఇంటికి వెళ్లడానికి షార్ట్‌కట్‌గా ఉంటుందని ఓ రెస్టారెంట్‌లో నుంచి వెళ్లేవాడు. కొన్నాళ్లకు ఇది గమనించిన యాజమాన్యం ఆయనను వారించింది.
Also Read: నాలుగో విడతలో ఏయే స్థానాల్లో ఎన్నికలు జరుగుతాయి?
దీంతో అలెగ్జాండర్ తాను, తన మిత్రులు కూడబలుక్కుని ఆ రెస్టారెంట్‌కు వన్ స్టార్ రివ్యూలు ఇచ్చారని ఓనర్ ఆరోపించాడు. ఫలితంగా తమ రెస్టారెంట్ రేటింగ్ ఐదు స్లార్లకు గాను 4.8 నుంచి సరాసరి 3.1 స్టార్లకు పడిపోయిందని తెలిపాడు. తమ రేటింగ్ ఇంతలా పడిపోవడాన్ని గ్రహించి అనుమానంతో ఆ బ్రిటీష్ టూరిస్టుపై ఫిర్యాదు చేశాడు. సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అలెగ్జాండర్‌ను అరెస్టు చేశారు.
తాను అమాయకుడినని, తనకే తప్పు తెలియదని అలెగ్జాండర్ అంటున్నాడు. సఖూ పోలీసు స్టేషన్‌కు అలెగ్జాండర్‌ను తరలించారు. ఫుకేట్‌లో లీగల్ ప్రొసీడింగ్స్ ఎదుర్కొంటున్నారు. 2020లోనూ ఓ అమెరికన్ టూరిస్టు ట్రిప్ అడ్వైజర్‌కు నెగెటివ్ రివ్యూ ఇవ్వడంతో అరెస్టు అయ్యాడు. క్షమాపణలు చెప్పి బయటపడ్డాడు.
థాయ్‌లాండ్‌లో పరువునష్టం ఒక క్రిమినల్ నేరం. దీనికి గరిష్టంగా రెండేళ్ల వరకు జైలు శిక్ష అమలవుతుంది.