Britain Princess Kate Middleton Has Cancer, Is It True or Not? : చాలాకాలం నుండి అజ్ఞాతంలో ఉన్న బ్రిటీష్ యువరాణి కేట్ మిడిల్టన్ ఇటీవల ఆమె గైర్హాజరుపై పలు అనుమానాలకు, కుట్ర సిద్ధాంతాలకు ముగింపు పలికారు ఆమె. ఈ విషయాన్ని ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ ఒక ట్విట్టర్ X వేదిక ద్వారా మెసేజ్ పోస్ట్ చేసింది. అక్కడ ఆమె క్యాన్సర్‌తో చేస్తున్న పోరాటం గురించి క్షుణ్ణంగా వెల్లడించింది. కేట్ తన ప్రిన్స్ విలియం యొక్క అధికారిక సోషల్ మీడియా ఖాతాలపై వీడియో సందేశాన్ని పోస్ట్ చేసిన గంట తర్వాత ప్రిన్స్, ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ నుండి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది.
క్యాన్సర్‌తో కొనసాగుతున్న పోరాటం గురించి కేట్ మిడిల్‌టన్ వెల్లడించినందుకు సోషల్ మీడియాలో ప్రపంచవ్యాప్తంగా స్పందిస్తున్నారు. ఆమె క్యాన్సర్ నిర్ధారణ తర్వాత… ప్రపంచంలోని ప్రముఖులంతా సోషల్ మీడియా వేదికగా రాయల్ త్వరగా కోలుకోవాలని ధైర్యం కల్పిస్తున్నారు. కొందరు ఆమె బాగుండాలని ఆశీర్వదించగా, మరికొందరు అయితే ఆమె రిలీజ్ చేసిన వీడియోపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Read Also : ఇజ్రాయెల్ దాడిలో హమాస్ కమాండర్ మృతి
ఇక ప్రపంచంలోని ప్రముఖులంతా స్పందిస్తున్నారు. యునైటెడ్ కింగ్‌డమ్ మాజీ ప్రధాని, బోరిస్ జాన్సన్ ట్విట్టర్ X ద్వారా, కేథరీన్ వేల్స్ యువరాణికి అన్నివిధాలా బలం చేకూరాలని కోరుకుంటున్నాను అని తెలిపారు. ఆమెకు తన ఫ్యామిలీ పూర్తిగా త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. కెనడా ప్రధాని, జస్టిన్ ట్రూడో డచెస్ ఆఫ్ కేంబ్రిడ్జ్ త్వరగా కోలుకోవాలని, నా ఆలోచనలు వేల్స్ యువరాణి, ఆమె పిల్లలు మొత్తం రాజ కుటుంబంతో ఆమె క్యాన్సర్ వార్తలను చాలా ధైర్యంగా పంచుకున్నాయని పేర్కొన్నారు. కెనడియన్ల తరపున, ఆమె త్వరగా కోలుకోవాలని కెనడియన్లు కోరుకుంటున్నట్టు తెలిపారు. మరొక నెటిజన్ ఇలా స్పందించారు. ఓ మై గాడ్..అది విన్నందుకు నేను చాలా చింతిస్తున్నాను. క్యాన్సర్ భయంకరమైనది. కానీ మీరు బలంగా, ధైర్యంగా ఉంటూ.. గట్టిగా పోరాడండి. మీ పిల్లలకు మీరు కావాలి. సోదరి మీరు పోరాడండి అంటూ తనకు ధైర్యాన్ని ఇచ్చారు.
మరొకరు అయితే..వీడియో సందేశంపై తమ తమ సందేహాలను వ్యక్తం చేశారు. నాకు ఆమె వెనుక ఎలాంటి కదలిక కనిపించడం లేదు. ఆకులు, డాఫోడిల్స్ ఏమీ లేవు. ఆమె గ్రీన్ స్క్రీన్ ముందు కూర్చున్నారా లేదా ఇది పూర్తిగా AIనా?” అంటూ ఓ వినియోగదారు పేర్కొన్నారు. ఇది AI.. దీన్ని గుర్తించడానికి మూడు సెకన్ల టైం పడుతుంది. వీడియోను సేవ్ చేసి, డిటెక్షన్ ప్రోగ్రామ్ ద్వారా ఉంచండి అంటూ మరొక నెటిజన్ తన అనుమానాన్ని వ్యక్తం చేశారు. మరొక వ్యక్తి అయితే.. బెంచ్ వైపు చూడండి, ఆపై నకిలీ కేట్ వెనుక చూడండని సూచించారు. కేట్ మిడిల్టన్ యొక్క మదర్స్ డే ఫోటో యొక్క ఇటీవలి వివాదం మధ్య ఈ వ్యాఖ్యలు వచ్చాయి.
Read Also : ట్రంప్ సంచలన వ్యాఖ్యలు, నేను అధ్యక్షుడిని కాకపోతే..
గతంలో ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ తన పిల్లలతో కలిసి తారుమారు చేసిన కుటుంబ ఫోటోను షేర్ చేసింది. ఆ తర్వాత వార్తా ఏజెన్సీలు దానిని ఉపసంహరించుకున్నాయి. వేల్స్ యువరాణి సారీ చెప్పి ఇలా పేర్కొంది. చాలామంది ఔత్సాహిక ఫోటోగ్రాఫర్‌ల వల్లే, నేను అప్పుడప్పుడు ఎడిటింగ్‌లో ప్రయోగాలు చేస్తాను.తారుమారు చేయబడిన ఫోటో బహిర్గతం అయిన తర్వాత, ఫ్రాన్స్ యొక్క ఓ వార్తా సంస్థ కెన్సింగ్టన్ ప్యాలెస్ ఇన్పర్మేషన్ విశ్వసనీయ మూలంగా తెలిపారని ప్రకటించింది.అంతేకాకుండా, CNN వంటి మీడియా సంస్థలు కెన్సింగ్టన్ ప్యాలెస్ యొక్క మునుపటి హ్యాండ్ అవుట్ ఫోటోలన్నింటినీ పరిశీలించాలని సూచించాయి. డ్యూక్ అండ్ డచెస్ ఆఫ్ సస్సెక్స్ ఒక సంక్షిప్త ప్రకటనలో కేథరీన్ ఆమె ఫ్యామిలీ ప్రైవేట్‌గా శాంతితో కంట్రోల్ చేయగలమనే నమ్మకంతో ఉన్నట్లు చెప్పారు.
My thoughts are with the Princess of Wales, her children, and the entire Royal Family following the news of her cancer so courageously shared.
On behalf of Canadians, I’m sending my support as she undergoes treatment. We’re all wishing her a swift recovery.
— Justin Trudeau (@JustinTrudeau) March 22, 2024
Wishing Catherine, The Princess of Wales all possible strength and sending good wishes to her and her family for a full and rapid recovery.
— Boris Johnson (@BorisJohnson) March 22, 2024