Bollywood Actress Janhvi Kapoor Who Is Confused By Mahi Is That The Reason: అలనాటి అందాల అతిలోక సుందరి నటి శ్రీదేవి గారాల కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన అందం, అభినయంతో కుర్రకారు ఫిదా అవ్వాల్సిందే. మత్తెక్కించే కళ్లతో కుర్రకారు గుండెల్లో సునామీని సృష్టిస్తూ వారి మనసులను దోచుకుంటుంది. శ్రీదేవి కూతురిగా వారి వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి బాలీవుడ్‌లో సెటిల్ అయింది.
ఇక ఇదిలా ఉంటే తన తదుపరి ప్రాజెక్ట్స్ మ్యాటర్‌కొస్తే తెలుగులో వరుస ఆఫర్లను సంపాదించుకుని బ్యాక్ టూ బ్యాక్ మూవీస్‌తో దూసుకుపోతోంది. టాలీవుడ్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా యాక్ట్ చేసిన దేవర మూవీ, అలాగే గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ మూవీలో కూడా ఛాన్స్ కొట్టేసింది. అలాగే సోషల్‌మీడియాలోనూ ఫుల్ బిజీగా ఉంటూ తన అందచందాలకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ కుర్రకారుకు నిద్ర పట్టకుండా చేస్తుంది.
Also Read: టాలీవుడ్‌ని షేక్ చేస్తున్న హర్రర్ మూవీస్
తాజాగా ఈ భామ మహీ మహీ..అంటూ ఒకటే కలవరిస్తోంది. మహీ నెంబర్ 6 జెర్సీతో కనిపించి అందరిని అట్రాక్ట్ చేస్తోంది. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే మిస్టర్ అండ్ మిసెస్ మహీ మూవీలో యాక్ట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీలో హైప్‌ని పెంచుతూ ప్రమోషన్‌లో భాగంగా రకరకాల డ్రెస్‌లతో ఆడియెన్స్‌లోకి తీసుకెళ్లేందుకు ఈ ప్లాన్ చేశారట. ఇక ఇది చూసిన నెటిజన్స్ మహీ అంటే మహేంద్రసింగ్ ధోనీ అనుకున్నామంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.