Bollywood Actress Shilpa Shetty’s shocking ED, 98 Crore Attached: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి అనగానే బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు తెలియని వారుండరు. ఎందుకంటే టాలీవుడ్‌లో సాహసవీరుడు సాగరకన్య మూవీలో హీరో విక్టరీ వెంకటేష్ సరసన నటించింది ఈ ముద్దుగుమ్మా. 1996 ఫిబ్రవరి 9న విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ అయింది. ఈ మూవీలో సాగరకన్యగా కనిపించి టాలీవుడ్ ఆడియెన్స్‌ని కంటిమీద కునుకు లేకుండా చేసింది. అంతేకాకుండా వారి హృదయాల్లో చెరిగిపోని ముద్రని వేసుకుంది.
ఇక ఇదిలా ఉంటే తాజాగా శిల్పాశెట్టి చిక్కుల్లో పడింది. మనీలాండరింగ్ కేసులో నటి శిల్పాశెట్టి దంపతులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చర్యలు చేపట్టింది. ఆమె భర్త రాజ్‌కుంద్రాకు చెందిన రూ. 97.79 కోట్ల స్థిర, చరాస్తులను అటాచ్ చేసుకుంది. జుహూలో శిల్పాశెట్టి పేరిట ఉన్న ప్లాట్ కూడా ఈ జాబితాలో ఉన్నట్లు తెలిపింది. దీంతో పాటు పూణెలోని తమకున్న ఓ నివాస బంగ్లాని, రాజ్ కుంద్రా పేరుమీదున్న ఈక్విటీ షేర్లను అటాచ్ చేసినట్లు వెల్లడించింది.
Also Read: బెంగళూరు వద్దు…మంగళూరే ముద్దు
అమిత్ భరద్వాజ్ నుండి రాజ్ కుంద్రా 285 బిట్‌కాయిన్‌లను అందుకుంటున్నట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. మరికొన్ని ఆస్తుల రూపంలో ఉన్నట్టు ఈడీ వెల్లడించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం 2002 నిబంధనల ప్రకారం రిపు సుదన్ కుంద్రా (రాజ్ కుంద్రాకు) చెందిన రూ. 97.79 కోట్లు అటాచ్ చేస్తున్నట్లు ఈడీ తెలిపింది. ఇందులో రాజ్‌కుంద్రా భార్య శిల్పాశెట్టి పేరుమీదున్న రెసిడెన్షియల్ ప్లాట్ కూడా ఉంది. పూణేలో ఉన్న రెసిడెన్షియల్ బంగ్లాను అటాచ్ చేశారు.
ఈ కేసులో 2023 సెప్టెంబర్ 17న సింపీ భరద్వాజ్, డిసెంబర్ 29న నితిన్ గౌర్ మరియు జనవరి 16 2023న నిఖిల్ మహాజన్ అనే ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరంతా ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ప్రధాన నిందితులు అజయ్ భరద్వాజ్, మహేంద్ర భరద్వాజ్ ఇంకా పరారీలో ఉన్నారు. గతంలో ఈడీ రూ.69 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది.