Bollywood actress Richa Chadda 99 takes after perfect acting secne:
హీరామండి వెబ్ సిరీస్ ఓటీటీ లో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. సంజయ్ లీలా భన్సాలీ ఈ వెబ్ సిరీస్ కు దర్శకుడు. ఈ మూవీలో సోనాక్షి సిన్హా, మనీషా కోయిరాలా, అదితిరావు హైదరీ, రిచా చద్దా కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో రిచా తన అనుభవాలను పంచుకుంది. చిత్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ గురించి మాట్లాడుతూ.. ఈ మూవీలో ఒక సన్నివేశం కోసం 99 టేక్స్ తీసుకున్నానంటోంది రిచా చద్దా. అయితే పర్ఫెక్షన్ కోసం దర్శకుడు చెప్పినట్లు చేయాలి కదా..అందుకనే విసుగు లేకుండా ఆ సన్నివేశం కోసం అన్ని టేకులు తీసుకున్నానంటోంది. ఎట్టకేలకు వందో సారి సన్నివేశం పర్ ఫెక్ట్ గా రావడంతో ఓకే అయింది అంతా హ్యాపీగా ఫీలయ్యారంది.
‘సంజయ్‌లీలా భన్సాలీ ప్రతీ సన్నివేశాన్ని శ్రద్ధగా తీస్తారు. ఇందులో ఒక సన్నివేశంలో నేను మద్యం తాగి డ్యాన్స్ వేయాలి. ఒక రోజంతా షూటింగ్ చేసినా.. కనీసం పావువంతు కూడా అవలేదు. దానికోసం 40 టేక్‌లు తీశారు. అనుకున్నట్లు రావడం లేదన్నారు. మరుసటిరోజు నిజంగానే మద్యం తాగాను. ఆతర్వాత డ్యాన్స్ అనుకున్నట్లుగా వచ్చింది. మనకు ఇచ్చిన పాత్రకు 100 శాతం న్యాయం చేయాలనుకునే స్వభావం నాది. మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి. మనం ఎలా ఉంటాం. మన డ్రెస్సింగ్ ఎలాఉందని ఎవరూ గమనించరు. మన నటనను మాత్రమే చూస్తారు. ఇందులో నాది మంచి పాత్ర. అందుకే సెట్‌లో అందరి సూచనలు తీసుకున్నాను. నాకెంతో నచ్చింది’ అని రిచా చద్దా చెప్పారు.