Saturday, May 18, 2024

Exclusive

New Delhi : నల్లధనం..బీజేపీని నడిపించే ఇంధనం

– 2014లో బ్లాక్ మనీ వెనక్కి తెస్తానన్న మోదీ
– పదేళ్లయినా లేని లెక్కాపత్రం
– విదేశాలలో నల్లధనం తేవడం సాధ్యం కాదని తేల్చేసిన అమిత్ షా
– కానీ, విరాళాల రూపంలో అందుతున్న వాటి సంగతేంటి?
– ముడుపులు ఇస్తే మనోడు.. లేకుంటే పగోడా?
– బీజేపీని వాషింగ్ మెషిన్‌తో పోలుస్తున్న కాంగ్రెస్ నేతలు
– కమలం అందుకుంటే చాలు నేరచరిత్ర అంతా క్లీన్ వాష్
– పార్లమెంట్ ఎన్నికల వేళ బ్లాక్ మనీపై భారీ చర్చ

BJP block money Issue in Lok Sabha Elections :2014 ఎన్నికలలో బీజేపీ విజయానికి దారితీసిన ముఖ్యమైన అంశం నల్లధనం వెనక్కి తీసుకురావడం. మరి ఆ మాట చెప్పి ఓట్లు దన్నుకున్న మోదీ పదేళ్లగా ఆ ప్రస్థావనే మరచిపోయినట్లున్నారనే ఆరోపణలున్నాయి. విదేశాలలో మూలుగుతున్న నల్లధనాన్ని అధికారంలోకి వచ్చిన వెంటనే వెనక్కు తెప్పిస్తామంటూ ఎన్నికల ప్రచారంలో హోరెత్తించిన బీజేపీ, ప్రస్తుతానికైతే యూటర్న్ తీసుకున్నట్టే కనిపిస్తోందని అంటున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మాటలను పరిశీలిస్తే, ఇప్పట్లో నల్లధనం వెనక్కి రావడం అసాధ్యంగానే కనపడుతోంది. “విదేశాలలోని నల్లధనాన్ని వెనక్కి తీసుకురావడం అనేది చాలా క్లిష్టమైన ప్రక్రియ. అది ఒక్క భారతదేశం చేతుల్లోనే లేదు. అంతర్జాతీయ ఒప్పందాలు దీనికి కొంతవరకు అవరోధంగా ఉన్నాయి” అంటూ ఇటీవల అమిత్ షా కామెంట్ చేశారు. ఈ మాటలను బట్టి చూస్తే, ఇప్పట్లో నల్లధనం మన దేశానికి చేరడం కష్టమే అని స్పష్టంగా చెప్పవచ్చు.

తొలి సంతకం దానిపైనే..

పదేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రధాని హోదాలో పెట్టిన తొలి సంతకం నల్లధనం వెలికితీత మీదనే. ఆర్భాటంగా దానికి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అయితే, ఆ కమిటీ వెలికితీసిన మొదటి పేరు గౌతమ్ అదానీ, మరి ఇప్పటి వరకు అదానీ నుంచి నల్లధనాన్ని స్వాధీనం చేసుకున్న దాఖలాలు లేవు అని విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. పైగా, ప్రపంచ ధనవంతుల సరసన సగర్వంగా ఆదానీ నిలిచాడని మండిపడుతున్నారు. ఎందుకంటే బీజేపీకి భారీ ఎత్తున విరాళాలు ఇచ్చే ఆర్థిక నేరగాళ్లలో ఆదానీ తొలి వరుసలో ఉంటారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రజల సంపదంతా ఆదానీ, అంబానీల జేబులోకి అన్నట్టుగా దేశ స్థితిని దిగజార్చిన తర్వాత మోదీ ఇప్పుడు రాజకీయాల్లో ఒక వికృత సంస్కృతిని తెచ్చిపెట్టారంటున్నారు. అదే “బలవంతపు వసూళ్లు-బెదిరింపు రాజకీయాలు”. దీనికోసం ఎలక్ట్రోల్ బాండ్లను తెచ్చి రాజ్యాంగబద్ధ సంస్థలైన సీబీఐ, ఈడీలను, ప్రతిష్టాత్మక ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను తమ రాజకీయ అవసరాల కోసం వాడుకొని ఆర్థిక నేరగాళ్లకు రాజకీయ కోర్టులో క్లీన్ చిట్ ఇస్తున్నారని విమర్శిస్తున్నారు. లెక్కల్లో లేని నల్లధనమంతా బీజేపీ ఖాతాలోకే వెళ్తోందని అంటున్నారు విపక్ష నేతలు.

అయితే మనోడు లేకుంటే పగోడు

బిజినెస్ మేన్ అయితే బీజేపీకి బాండ్ రూపంలో విరాళాలు ఇవ్వాలి. ప్రతిపక్ష నాయకులు అయితే పార్టీలో నైనా చేరాలి, కాదు అంటే జైల్లో వుండాలి. ఇదే నేటి బీజేపీ పాలసీ అంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈ కేసులో నిందితులుగా పేర్కొన్న ప్రతిపక్ష పార్టీల పెద్ద తలకాయలు జైల్లో వున్నారు. ఎందుకంటే వీరు బయట ఉంటే బీజేపీ స్కాములను ఎండగడతారు. కాగా ఇదే కేసులో నోటీసులు అందుకున్న కీలక వ్యక్తి అయిన శరత్ చంద్రా రెడ్డి వెంటనే ఎలక్ట్రోల్ బాండ్ రూపంలో బీజేపీకి విరాళం ఇవ్వగానే సేఫ్ జోన్‌లో పడిపోయారు. ఒకే కేసులో ఇన్ని వైరుధ్యాలను చూస్తుంటే బీజేపీ ఈ ప్రక్రియ అంతా నల్లధనాన్ని తీయడానికి చేస్తున్నదా ..? లేక బెదిరించి ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు ఆర్ధికంగా లాభపడి రాజకీయ కక్షను తీర్చుకుంటుందా..? అనే అనుమానాలు దేశ ప్రజలకు రాక మానదు. ఈ మధ్య కాలంలో “వాషింగ్ పౌడర్ మోదీ” అనే నినాదం ప్రజల్లో బాగా వ్యాప్తి చెందుతోంది. ఈ నినాదం ప్రకారం ఎంత అవినీతి పరుడైనా సరే, బీజేపీలో చేరితే పతిత పావనం అయిపోయి పరిశుద్ధులుగా మారిపోతారు అని అర్థం.

మాట వింటే రక్ష లేకుంటే కక్ష

అక్రమంగా దేశ సంపదను దోచుకొని లక్షల కోట్ల నల్లధనాన్ని”దేశం దాటిస్తున్న దేశద్రోహులను బీజేపీలో చేర్చుకొని వారికి ఎంఎల్ఏ, ఎంపీలుగా టిక్కెట్లు ఇచ్చి చట్టసభల్లోకి పంపిస్తున్న మోదీ ప్రభుత్వం దేశాన్ని అభివృద్ధి చేస్తుందని ఇంకా ఎన్ని రోజులు ఈ దేశ ప్రజలు భ్రమలో బ్రతకాలి..? పరోక్షంగా మోదీ చేస్తున్న చర్యలను చూస్తుంటే ఆర్థిక నేరగాళ్లు దోచుకున్న సొమ్ము విదేశాల్లో వుండాలి, ఆర్థిక నేరస్థుడు ఏమో ప్రజా ప్రతినిదిగా చట్ట సభల్లో మోదీ ప్రక్కన వుండాలి అనేలా కనబడుతున్నాయి. మహారాష్ట్ర మాజీ సీఎం అయిన అశోక్ చవాన్‌ను 2014 లో అప్పటి ప్రధాని అభ్యర్థిగా వున్న నరేంద్రమోదీ రాజకీయ ప్రసంగంలో భాగంగా ఆదర్శ్ చవాన్ (ఆదర్శ కుంభకోణంలో ప్రధాన నిందితుడు) అని నామకరణం చేసి ఆ కుంభకోణాన్ని ప్రధాన ఎన్నికల అస్త్రంగా వాడుకున్న విషయం దేశం ఇంకా మర్చిపోలేదు. కానీ ఇప్పుడు అదే అశోక్ చవాన్‌ను బీజేపీలోకి చేర్చుకొని రాజ్యసభ ఎంపీని చేసి 2024లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో స్టార్ కాంఫెయినర్ పదవిని కట్టబెట్టారు.

వాషింగ్ మెషిన్ పాలిటిక్స్

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పవన్ ఖేరా బీజేపీని ఒక “వాషింగ్ మెషిన్”లాంటిదని అభివర్ణించారు. చాలామంది ఆర్థిక నేరగాళ్లను కాషాయమనే వాషింగ్ పౌడర్‌తో కడిగేసి ప్రజాస్వామ్యంలో మచ్చలేని నేతలుగా తీర్చిదిద్దుతున్న ఘనత మోదీ ప్రభుత్వానికే దక్కుతుంది. “మాట వింటే రక్ష లేకుంటే కక్ష” అన్నట్లు దేశ రాజకీయలను మార్చేసి దేశ వనరులను భవిష్యత్ తరాలకు దక్కకుండా చేసి, ఆర్థిక అసమానతలను సృష్టిస్తున్న బీజేపీకి ప్రజలు ఎందుకు ఓటు వేయాలి అని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ ఆడుతున్న ఈ జగన్నాటకంలో ప్రజలు అమాయకులు అవ్వడం తప్ప మరేమీ లేదని, ఒక అబద్ధాన్ని పది సార్లు చెపితే నిజం అయిపోతుంది అనే భ్రమలో మోదీ ఉన్నారని విమర్శిస్తున్నారు కాంగ్రెస్ నేతలు.

Publisher : Swetcha Daily

Latest

BJP: సీఎం రేవంత్‌ను కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు.. ఎందుకు కలిశారు?

CM Revanth: రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీల మధ్య రాజకీయ వైరం...

LS Polls: ఆరో విడతలో 889 మంది అభ్యర్థులు.. 25న పోలింగ్

Lok Sabha Elections: సార్వత్రిక ఎన్నికల్లో ఆరో విడతకు సంబంధించి నామినేషన్ల...

Bharati Builders: భారతి.. భూముల హారతి!

- అప్పుడు పుప్పాలగూడ.. ఇప్పుడు కొంపల్లి..! - హైదరాబాద్‌లో మరో ప్రీ లాంచ్...

Cabinet Meeting: కేబినెట్‌ భేటీకి ఈసీ ‘నో’.. ‘అవసరమైతే ఢిల్లీకి వెళ్తాం’

- కేబినెట్ సమావేశానికి బ్రేక్ - పర్మిషన్ ఇవ్వని ఈసీ -...

RGV: సీఎం రేవంత్ రెడ్డిపై ఆర్జీవీ ట్వీట్

CM Revanth Reddy: ప్రముఖ సినీ దర్శకుడు ఆర్జీవీ గత కొంతకాలంగా...

Don't miss

BJP: సీఎం రేవంత్‌ను కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు.. ఎందుకు కలిశారు?

CM Revanth: రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీల మధ్య రాజకీయ వైరం...

LS Polls: ఆరో విడతలో 889 మంది అభ్యర్థులు.. 25న పోలింగ్

Lok Sabha Elections: సార్వత్రిక ఎన్నికల్లో ఆరో విడతకు సంబంధించి నామినేషన్ల...

Bharati Builders: భారతి.. భూముల హారతి!

- అప్పుడు పుప్పాలగూడ.. ఇప్పుడు కొంపల్లి..! - హైదరాబాద్‌లో మరో ప్రీ లాంచ్...

Cabinet Meeting: కేబినెట్‌ భేటీకి ఈసీ ‘నో’.. ‘అవసరమైతే ఢిల్లీకి వెళ్తాం’

- కేబినెట్ సమావేశానికి బ్రేక్ - పర్మిషన్ ఇవ్వని ఈసీ -...

RGV: సీఎం రేవంత్ రెడ్డిపై ఆర్జీవీ ట్వీట్

CM Revanth Reddy: ప్రముఖ సినీ దర్శకుడు ఆర్జీవీ గత కొంతకాలంగా...

BJP: సీఎం రేవంత్‌ను కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు.. ఎందుకు కలిశారు?

CM Revanth: రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీల మధ్య రాజకీయ వైరం ఎన్నికల వేళ పతాకస్థాయికి చేరుకుంది. లోక్ సభ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ నెలకొనడంతో ఈ...

Bharati Builders: భారతి.. భూముల హారతి!

- అప్పుడు పుప్పాలగూడ.. ఇప్పుడు కొంపల్లి..! - హైదరాబాద్‌లో మరో ప్రీ లాంచ్ మోసం - భారతీ లేక్ వ్యూ పేరుతో వసూళ్లు - అతి తక్కువ ధరకే ఫ్లాట్ అనడంతో ఎగబడ్డ జనం - రోజులు గడుస్తున్నా...

Cabinet Meeting: కేబినెట్‌ భేటీకి ఈసీ ‘నో’.. ‘అవసరమైతే ఢిల్లీకి వెళ్తాం’

- కేబినెట్ సమావేశానికి బ్రేక్ - పర్మిషన్ ఇవ్వని ఈసీ - భేటీని వాయిదా వేసిన సీఎం రేవంత్ రెడ్డి - అవసరమైతే ఢిల్లీకి వెళ్లి ఈసీని కలవాలని నిర్ణయం - ఇరిగేషన్ శాఖపై...