Saturday, September 7, 2024

Exclusive

BJP : కమల విలాపం

– కర్ణాటకలో ఎదురుగాలి
– జేడీఎస్‌తో పొత్తు ఉన్నా అయోమయం
– కలిసిరాని మోదీ చరిష్మా
– సత్తా చాటేందుకు హస్తం వ్యూహాలు
– మోదీ ముందే పసిగట్టారా?
– కర్ణాటక నష్టం తమిళనాడుతో పూడ్చుకునే ప్రయత్నం
– కానీ, వర్కవుట్ అయ్యేనా?

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 400 సీట్లు సాధిస్తామని గొప్పలు చెబుతున్న బీజేపీకి అడుగడుగునా అపశకునాలే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణాదిన ఆ పార్టీ బొత్తిగా డీలా పడిపోతోంది. గతంలో కర్ణాటకలో అధికారంలో ఉన్న సమయంలో వచ్చిన లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 28 స్థానాలకు గానూ 25 సీట్లు గెలిచి సత్తా చాటిన ఆ పార్టీకి సిద్ధరామయ్య నేతృత్వంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడటంతో ఈసారి అందులో సగం దక్కటమూ కష్టమేననే అభిప్రాయం అక్కడ ఉంది. మరోవైపు ఏడాది నాడు అక్కడ ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వపు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ రచిస్తున్న ఎన్నికల వ్యూహాల ధాటికి కమలం విలవిలలాడి పోతోంది. దీంతో ఒకమెట్టు దిగి జేడీఎస్ పార్టీతో కమలనాథులు పొత్తుకు సిద్ధపడ్డారు. దీనిప్రకారం మొత్తం 28 సీట్లలో 25 సీట్లలో బీజేపీ, 3 సీట్లలో జేడీఎస్ బరిలో నిలుస్తున్నాయి.

2024 లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 26న 14 సీట్లకు, మే 7న మరో 14 సీట్లకు అక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి. తొలిదశలో ఉడిపి, చిక్మంగళూరు, హసన్, దక్షిణ కన్నడ, చిత్రదుర్గ, తుముకూరు, మాండ్య, మైసూరు, చామరాజనగర్, బెంగళూరు రూరల్, బెంగళూరు నార్త్, బెంగళూరు సెంట్రల్, బెంగళూరు సౌత్, చిక్కబళ్లాపూర్, కోలార్ ఎంపీ స్థానాల్లో, మలిదశలో మే7 న చిక్కోడి, బెల్గాం, బాగల్కోట్, బీజాపూర్, గుల్బర్గా, రాయచూర్, బీదర్, కొప్పల్, బళ్లారి, హవేరి, థార్వాడ్, ఉత్తర కన్నడ, దావణగెరె, శివమొగ్గ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడత స్థానాలకు నామినేషన్ల పర్వం ముగిసింది.

బీజేపీ బలాబలాలు

బీజేపీ మొదటి నుంచి లింగాయతుల పార్టీగా పేరు పొందింది. అయితే, కర్ణాటకలో యడియూరప్ప ప్రస్థానం, ప్రాభవం తగ్గిపోవటం, అవినీతి పార్టీగా అప్రతిష్టపాలు కావటం, కాంగ్రెస్ జోరు పెరగటంతో కర్ణాటకలో లింగాయతుల తర్వాత బలమైనదిగా చెప్పే వక్కలిగల పార్టీ అయిన జేడీఎస్‌తో ఈ ఎన్నికల్లో బీజేపీకి పొత్తు అనివార్యమైంది. అటు.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ పరాజయం పాలైన జేడీఎస్ పార్టీకీ ఈ పొత్తు అవసరమే. అయితే, దేవెగౌడ, ఆయన కుమారుడు ఏ మేరకు వక్కలిక సామాజిక వర్గ ఓటర్లను బీజేపీకి వేయిస్తారనేదే ఇప్పడు అక్కడ చర్చగా మారింది. ఈ పొత్తు ద్వారా ఎంపీ ఎన్నికలను కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మార్చటంతో బాటు వొక్కలిగలు పెద్ద సంఖ్యలో ఉన్న పాత మైసూరు ప్రాంతంలో తన ఓటు బ్యాంకును పెంచుకోవటం ఆ పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. అయితే సిట్టింగ్ ఎంపీలపై ఉన్న వ్యతిరేకత, టికెట్ రాని అభ్యర్థుల తిరుగుబాట్లు, గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి ఆ పార్టీకి మైనస్‌గా మారాయి. ముఖ్యంగా కుటుంబపార్టీలు, వారసత్వ రాజకీయం అని చెప్పే మోదీ, జేడీఎస్‌తో ఎలా పొత్తు పెట్టుకున్నారనే అంశాన్ని కాంగ్రెస్ ప్రచారం చేయటమూ బీజేపీకి చికాకుగా మారుతోంది.

కాంగ్రెస్ బలాబలాలు

బీసీ వర్గపు సీఎం, దళిత, వక్కలిక వర్గాల ఉప ముఖ్యమంత్రులు ఉండటం, దళిత వర్గానికి చెందిన ఖర్గే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా ఉండటం దళిత ఓటు బ్యాంకులో సింహభాగం కాంగ్రెస్‌కు దక్కేలా ఉంది. ఇక ముస్లిం మైనారిటీల మద్దతూ కాంగ్రెస్‌కే దక్కనుంది. బీజేపీ ఎంపీలపై వ్యతిరేకత హస్తానికి కలిసొస్తున్న మరో అంశం. జేడీఎస్‌-బీజేపీ పొత్తు కూడా కొన్ని ప్రాంతాల్లో వికటించటం మరో సానుకూల అంశం. అయితే కొన్నిచోట్ల బలమైన అభ్యర్థులు లేకపోవడం, నేతల మధ్య విభేదాలు, ఖర్గేతో సహా పలువురు అగ్రనేతలు ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి డీకే సురేష్ ప్రత్యేక దక్షిణాది వ్యాఖ్యలు కాంగ్రెస్‌కు ప్రతికూలంగా మారాయి.

ఆరోపణల పర్వం

గత ఏడాది నవంబర్‌లో బీజేపీ కర్ణాటక అధ్యక్షుడిగా యడియూరప్ప కుమారుడు బీవై విజయేంద్రను నియమించటంతో ఈ ఎన్నికలు ఆయనకు అగ్నిపరీక్షగా మారాయి. బీజేపీ ఈసారి మోదీ చరిష్మా, రాష్ట్ర ప్రభుత్వంపై దాడి, పాన్‌ ఇండియా ఎజెండా, రామమందిరం అనే 4 ప్రధాన అంశాలనే తన ప్రచారాస్త్రాలుగా ముందుకుపోతోంది. ఇటీవల రామేశ్వరం కేఫ్‌ బాంబు పేలుడు, విధాన సౌధ వద్ద పాకిస్థాన్ అనుకూల నినాదాలు, రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సయ్యద్ నసీర్ హుస్సేన్ విజయోత్సవాల్లో పాకిస్థాన్ అనుకూల నినాదాల వంటి భావోద్వేగ అంశాలనూ బీజేపీ ప్రచారంలోకి తెస్తోంది. కర్ణాటక ప్రభుత్వం ఉగ్రవాదుల పట్ల మెతకగా వ్యవహరిస్తోందని, కాంగ్రెస్ అధిష్ఠానానికి కర్ణాటక నుంచి డబ్బు సంచులు పోతున్నాయని బీజేపీ అధ్యక్షుడు నడ్డా ఆరోపణలు చేస్తున్నారు. కర్ణాటకలో నానాటికీ పెరుగుతున్న నీటి ఎద్దడి సమస్యనూ బీజేపీ హైలెట్ చేస్తోంది. అయితే, దీనికి భిన్నంగా కాంగ్రెస్ లోకల్ సమస్యలపై ఫోకస్ చేస్తోంది. రాజ్యాంగ సవరణపై బీజేపీ ఎంపీ అనంత్‌కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలు, కరవు నివారణకు రూ.8,172 కోట్లు విడుదల చేయమని 6 నెలల నాడు కేంద్రానికి లేఖ రాసినా నయాపైసా రాలేదనే అంశం, 5 ప్రధాన హామీల మీద కాంగ్రెస్ ప్రచారం సాగుతోంది. దీనికి తోడు 2015లో సిద్దరామయ్య ప్రభుత్వం ఏర్పాటు చేసిన కులగణన కమిషన్ నివేదిక సరిగ్గా 2024 మార్చి 1న ప్రభుత్వానికి చేరింది. లింగాయత్, వక్కలిక వర్గాలు దీనిపై భగ్గుమనగా, దీనిపై మంత్రి వర్గంలో చర్చిస్తామని సిద్ధరామయ్య సర్కారు సర్దిచెప్పింది. తద్వారా మిగిలిన బీసీ, దళిత, గిరిజన కులాల మద్దతు పొందేందుకు కాంగ్రెస్ వ్యూహం రచించింది. 2004 నుంచి 2019 వరకు జరిగిన పరిణామాలను తనకు అనుకూలంగా మార్చుకోవటం ద్వారా 15 ఏళ్ల వ్యవధిలో బీజేపీ అధికారంలోకి వచ్చినా, ఆ పార్టీ విజయవంతమైంది. కానీ, అవినీతి పాలనతో అంతే వేగంగా పతనమైంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుతో భారీగా పెరిగిన ఓట్ షేర్ ఈసారి కాంగ్రెస్ గెలుపుకు దోహదపడనున్నాయని సర్వేలు చెబుతున్నాయి.

తమిళనేలపై అడుగు

కర్ణాటకలో పరిస్థితి ఇప్పట్లో చక్కబడే అవకాశం లేనందుకే ఆ పార్టీ తమిళనాడు మీద దృష్టి సారించింది. అన్నాడీఎంకే పార్టీ దుస్థితిని గమనించి, ఆ పార్టీతో పొత్తును రద్దు చేసుకుని సొంతగా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది. అన్నామలై నాయకత్వంలో ఆ పార్టీ దళిత వర్గాలకు దగ్గరవటంతో బాటు అన్నాడీఎంకే ఓటర్లనూ తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ ఎన్నికల్లో ఓటు బ్యాంకును పెంచుకోవటంతో బాటు అన్నామలై పోటీ చేసే కోయంబత్తూరుతో సహా నాలుగైదు సీట్లలో హవా చాటాలని ఆ పార్టీ భావిస్తోంది. కర్ణాటకలో తాను కోల్పోయిన వాటాను తమిళనాడులో భర్తీ చేసుకోవాలనేదే బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది.

Publisher : Swetcha Daily

Latest

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Don't miss

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Telangana: ఎన్నాళ్లీ మూత ‘బడులు’

బీఆర్ఎస్ హయాంలో అస్తవ్యస్తంగా మారిన పాఠశాల విద్య 28 వేల పాఠశాలలకు గాను మూతపడిన సగం పాఠశాలలు పాఠశాల విద్యపై ప్రచారార్భాటమే తప్ప చేసింది శూన్యం బీఆర్ఎస్ విధానాన్ని తప్పుబడుతున్న విద్యావేత్తలు ...

Hyderabad: గుండె ‘చెరువు’ అవుతోంది

దురాక్రమణదారుల కబ్జా కోరల్లో నగర చెరువులు టీ.సర్కార్ వెబ్ సైట్ లో కేవలం 19,314 చెరువుల సమాచారం చెరువుల సంఖ్యపై సమగ్ర సమాచారం సేకరించిన గత పాలకులు ఉన్న చెరువులనైనా కాపాడుకోవడానిక...

Hyderabad:ఆదిల్ కు అండగా సీఎం

CM Reventh reddy Reassurance to cancer patient Mohammadd Adil క్యాన్సర్‌ బాధితుడు మహమ్మద్‌ ఆదిల్‌ను ఆదుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆ కుటుంబానికి భరోసానిచ్చారు. శనివారం రేవంత్‌ వరంగల్‌ జిల్లా పర్యటనకు వెళ్లిన...