- రాజకీయ రంగాన్ని కుదిపేస్తున్న డీప్ ఫేక్ టెక్నాలజీ
- కొత్తగా కేసులు నమోదవుతున్న వైనం
- అభ్యర్థుల గెలుపోటములు నిర్ధేశిస్తున్న ఫేక్ న్యూస్
- టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో దేశంలోనే బీజేపీ అగ్రస్థానం
- 2020 దుబ్బాక ఉప ఎన్నికలలో కలకలం క్రియేట్ చేసిన ఫేక్ న్యూస్
- అభ్యర్థి ఓటమికి, తమ పార్టీ గెలుపునకు అస్త్రంలా డీప్ ఫేక్ న్యూస్
- రేవంత్ రెడ్డి ని ఫేక్ వీడియో ద్వారా ఇరికించే యత్నం
- విదేశాలనుంచే తయారవుతున్న డీప్ ఫేక్ వీడియోలు
- ఎన్నికల ముందు బీజేపీ హై డ్రామా
BJP Fake vedio drama notice to Reventh Reddy:
ఎన్నికలు ఏవైనా.. ప్రచారంలో మాత్రం సోషల్ మీడియా ఫేక్ న్యూస్, ఫేక్ వీడియోలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. . అది పార్టీల గెలుపోటములను నిర్దేశించే స్థాయికి చేరుతోంది. 2020 జరిగిన దుబ్బాక ఉపఎన్నికల్లో ఫేక్ మీడియా ప్రధానపాత్ర పోషించింది. బీఆర్‌ఎ్‌సలో చెరుకు శ్రీనివాస్‌రెడ్డి చేరుతున్నారనే ఫేక్ న్యూస్ బీజేపీ క్రియేట్ చేసిందని అంతా ఆరోపణలు చేశారు అప్పట్లో. అయితే ఈ ఫేక్ న్యూస్దా దాపు గెలుపోటములను ప్రభావితం చేసింది. ఆ ఎన్బీనికలలో బీజేపీ సోషల్ మీడియాను విస్తృతంగా వాడుకుంది. కాగా ఆ ఎన్నికల్లో సోషల్ మీడియాను కాస్త తేలిగ్గా తీసుకున్న అధికార బీఆర్‌ఎస్ ఓటమి పాలయింది.
ఆరోపణలే తప్ప ప్రూవ్ ఏది?
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల సిద్దిపేటలో జరిగిన బహిరంగసభలో మాట్లాడుతూ.. మతపరంగా ముస్లింలకు ఇస్తున్న రిజర్వేషన్లను రద్దు చేస్తామని.. వాటిని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఇస్తామని వ్యాఖ్యానించారు. అయితే కొందరు ఆ వీడియోను డీప్‌ఫేక్‌తో మార్ఫింగ్ చేశారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని అమిత్‌షా అన్నట్టుగా ఎడిట్ చేసి.. సోషల్ మీడియాలో పెట్టారు. ఈ వీడియో విపరీతంగా వైరల్ అయింది. ఫేస్‌బుక్, ఎక్స్ (ట్విట్టర్)లో కాంగ్రెస్ పార్టీ, టీపీసీసీ, రేవంత్ పేరిట ఉన్న ఖాతాల నుంచి కూడా ఈ వీడియో షేర్ అయింది. దీనిపై బీజేపీ రాష్ట్ర శాఖ ఇక్కడి పోలీసులకు, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది కూడా. అయితే ఈ వీడియో దేశవ్యాప్తంగా కూడా వైరల్ అవుతుండటం.. ముఖ్యంగా కాంగ్రెస్ సోషల్ మీడియా ఖాతాల ద్వారా విస్తృత ప్రచారంలోకి రావడంతో కేంద్రం హోం శాఖ అలర్ట్ అయింది.
క్లారిటీ లేని నేతలు
అసలు రిజర్వేషన్ల విషయంపై బీజేపీ అగ్రనేతలకే ఓ క్లారిటీ లేదు. పూటకో మాట చెబుతూ ముస్లిం వ్యతిరేక మాటలు మాట్లాడుతున్నారని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. రిజర్వేషన్ల విషయంలో మొదటినుంచి వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చిన బీజేపీకి దాని వలన వచ్చే అనర్థం కాస్త ఆలస్యంగానే బోధపడినట్లుంది. అందుకే వెంటనే నాలుక మడతపెట్టేసిందని అంతా అంటున్నారు. రిజర్వషన్ల అంశంపై కాంగ్రెస్ కు బీజేపీ బ్రహ్మాస్త్రం అందించిందని అర్థమవుతోంది. రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పెద్దలకే రోజుకో సవాల్ విసురుతూ ఇబ్బంది పెడుతూ వస్తున్నారు. దానితో అమిత్ షా ఒక్క దెబ్బకే రెండు పెట్టలు అన్న తీరుగా అటు తాము రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని నిరూపించుకునేందుకు వాళ్లే ఓ ఫేక్ వీడియో తయారు చేయించుకుని వుండవచ్చనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ శ్రేణులు. ఫేక్ న్యూస్ పేరిట బీజేపీ సేఫ్ గేమ్ ఆడుతోందంటున్నారు.
విదేశీయుల క్రియేషన్ కావొచ్చు
అధికార పార్టీ మద్దతుదారులు సోషల్ మీడియాలో దూకుడు పెంచా రు. బీఆర్‌ఎస్, బీజేపీలు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసుకుని జోరుగా ప్రచారం చేసుకుంటున్నాయి. పోటాపోటీగా పోస్టులు పెడుతున్నాయి. ఈ క్రమంలో ఫేక్ న్యూస్‌ను కూడా భారీగా వైరల్ చేస్తున్నారు. ఒక పార్టీ తరఫున తప్పుడు వార్తలు సోషల్ మీడియాలో రాగానే.. మరో పార్టీ వారు దానికి వెంటనే కౌంటర్ ఇచ్చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేలా ఫేక్ న్యూస్ చక్కర్లు కొడుతున్నా పోలీస్ శాఖ పట్టించుకోవడం లేదు. ‘రాజకీయాలకు సంబంఽధించిన ఫేక్ న్యూస్‌ను ఎక్కువగా విదేశాల్లో సృష్టిస్తున్నారు. అక్కడున్న వివిధ పార్టీల సానుభూతిపరులే వాటిని రూపొందిస్తున్నారు. నకిలీ సోషల్ మీడియా ఖాతాల ద్వారా వాట్సాప్, ఫేస్‌బుక్ గ్రూప్‌ల్లో వాటిని పోస్ట్ చేస్తున్నారు. అవి నిజమే అనుకుని ఇతరులు విపరీతంగా షేర్ చేస్తున్నారు. అలా ఫేక్ న్యూస్ వైరల్ అవుతోంది. ఒకవేళ ఫిర్యాదు చేసినా పోలీసులు విదేశాలకు వచ్చి పట్టుకోలేరనే ధైర్యంతోనే విచ్చలవిడిగా ఫేక్‌న్యూస్ ను రూపొందిస్తున్నారు అని సైబర్ టెక్నీషియన్స్ చెబుతున్నారు.