Bigboss 17 Winner Arrest : బిగ్‌బాస్ 17 విజేత, స్టాండప్ కమెడియన్ మునావర్ ఫరూఖీని నిన్న ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హుక్కాబార్‌పై దాడి సందర్భంగా పట్టుబడిన మునావర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోగా, కేసు నమోదు చేసిన తర్వాత అతడిని విడిచిపెట్టారు. ‘కోప్టా’ 2003 చట్టం కింద అతడిపై కేసు నమోదైంది.
ముంబై పోలీసుల సామాజిక సేవా శాఖ మంగళవారం రాత్రి 10:30 గంటలకు బోరా బజార్‌లోని హుక్కా పార్లర్‌లో ఈ దాడిని నిర్వహించిందని, బుధవారం ఉదయం 5 గంటల వరకు ఈ ఆపరేషన్ కొనసాగినట్టు ఓ పోలీస్ అధికారి తెలిపారు. మునావర్ ఫరూఖీతో పాటు ఇతరులు ఉమ్మడిగా హుక్కా తాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వారి చర్యకు సంబంధించిన వీడియో కూడా మా వద్ద ఉందని పోలీసులు తెలిపారు. పక్కా ఆధారాలతోనే మేము వారిని అదుపులోకి తీసుకున్నామని.. కాని వారిపై విధించిన సెక్షన్లు బెయిలబుల్ అయినందున వారిని వెళ్ళడానికి అనుమతించామని ఒక సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.
Read More: చరణ్, సుకుమార్ మూవీలో అదే హైలెట్ అన్న జక్కన్న..!
హెర్బల్ హుక్కా తాగే ముసుగులో పార్లర్ వద్ద కొందరు పోషకులు పొగాకు ఆధారిత హుక్కా తాగుతున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందడంతో ఈ దాడులు నిర్వహించినట్లు తెలిపారు.ఫరూఖీ మరియు అతని సహ నిందితులపై సిగరెట్లు మరియు ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం, భారతీయ శిక్షాస్మృతి సెక్షన్లు 283 ప్రజా మార్గం లేదా నావిగేషన్ లైన్‌లో ప్రమాదం లేదా అడ్డంకి, 336 ప్రాణానికి హాని కలిగించే చట్టం కింద కేసు నమోదు చేయబడిందని పోలీసులు తెలిపారు.
హుక్కాబార్‌పై దాడిచేసిన పోలీసులు మునావర్‌తో పాటు మరో 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. అందరిపైనా కేసులు నమోదైనట్టు పోలీసులు తెలిపారు. రైడ్ జరిగినప్పుడు మునావర్ హుక్కాబార్‌లోనే ఉన్నట్టు పేర్కొన్నారు. వైద్య పరీక్షల్లో పాజిటివ్‌గా తేలడంతో మునావర్‌కు జరిమానా విధించి ఆ తర్వాత అతడిని విడిచిపెట్టినట్టు పేర్కొన్నారు.హుక్కా పార్లర్‌లో పొగాకుతో కలిపి నికోటిన్ ఉపయోగిస్తున్నట్టు పక్కా సమాచారం అందుకున్న ముంబై పోలీసులు ఆ వెంటనే ఆ హుక్కాబార్‌పై దాడిచేశారు. ఈ సందర్బంగా ఈ దాడిలో రూ. 4,400 నగదు, రూ.13,500 విలువ చేసే 9 హుక్కా పాట్స్ సీజ్ చేశారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.