Big B Showered Praises On Darling Movie:పాన్ ఇండియా స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ యాక్ట్ చేసిన మోస్ట్ అవైటెడ్ మూవీ కల్కి 2898 ఏడీ. ఈ మూవీని మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు.ఈ మూవీలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ రోల్‌లో యాక్ట్ చేస్తున్నారు. రీసెంట్‌గా మేకర్స్ రిలీజ్ చేసిన అశ్వద్ధామ గ్లింప్స్ ఆడియెన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంది. అద్భుతమైన యాక్టింగ్‌తో అమితాబ్ అదరగొట్టారు. కల్కి 2898 ఏడీ మూవీని జూన్ 27న మేకర్స్ గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు.
తాజాగా మేకర్స్ ఈ మూవీ ప్రమోషన్స్ మొదలుపెట్టారు.ప్రమోషన్‌లో భాగంగా ఈ మూవీలోని బుజ్జి క్యారెక్టర్‌ను మేకర్స్ ఇటీవల రామోజీఫిలిం సిటీలో ఇంట్రడ్యూస్ చేశారు.బుజ్జి అనగానే అదేదో అనుకున్నారు కానీ అది ఒక రోబోట్ కార్ అనేది దాన్ని పరిచయం చేసే దాక ఎవరికి తెలియదు. అలాగే ఈ మూవీలో ప్రభాస్‌కు క్లోజ్ ఫ్రెండ్.ఈ బుజ్జి పాత్రకు కీర్తి సురేష్ డబ్బింగ్ చెప్పింది.
Also Read:నిజంగా నువ్వు గ్రేట్ అంటూ నెటిజన్స్ ఫిదా
ఇదిలా ఉంటే కల్కి 2898 మూవీపై అమితాబ్ బచ్చన్ ప్రశంసలు కురిపించారు. దర్శకుడు నాగ్‌అశ్విన్ అద్భుత ఆలోచనా శక్తి తనను ఆశ్చర్యానికి గురి చేసిందని ఆయన అన్నారు. షూటింగ్ చేస్తున్న సమయంలోనే కల్కి మూవీ భారీ విజయం సాధిస్తుందనే భావన కలిగింది. మెయిన్‌గా ఈ మూవీలో కొన్ని సీన్స్ చాలా అద్భుతంగా అనిపిస్తాయి.. ఈ మూవీ రిలీజ్ అయిన తరువాత ప్రతి ఒక్కరూ ఎంతగానో ప్రశంసిస్తున్నారని తెలిపారు.ఈ మూవీలో బుజ్జి పాత్ర ఒక అద్భుతమని అమితాబ్ తెలిపారు.