Tuesday, June 18, 2024

Exclusive

Bharati Builders: భారతి.. భూముల హారతి!

– అప్పుడు పుప్పాలగూడ.. ఇప్పుడు కొంపల్లి..!
– హైదరాబాద్‌లో మరో ప్రీ లాంచ్ మోసం
– భారతీ లేక్ వ్యూ పేరుతో వసూళ్లు
– అతి తక్కువ ధరకే ఫ్లాట్ అనడంతో ఎగబడ్డ జనం
– రోజులు గడుస్తున్నా నిర్మాణాలు చేపట్టని భారతీ బిల్డర్స్
– 350 మందిని ముంచేసిన రియల్ సంస్థ
– బాధితుల ఫిర్యాదుతో చైర్మన్ దూపాటి నాగరాజు అరెస్ట్
– పోలీసుల అదుపులో ఎండీ శివరామకృష్ణ, సీఈఓ నరసింహరావు
– గతంలో పుప్పాలగూడ భూములపైనా కన్నేసిన భారతీ బిల్డర్స్
– బీఆర్ఎస్ హయాంలో భారతీ బిల్డర్స్‌పై నో యాక్షన్

దేవేందర్ రెడ్డి, 9848070809

‘స్వేచ్ఛ’ ఇన్వెస్టిగేషన్ టీం: హైదరాబాద్ మహా నగరంలో రియల్ ఎస్టేట్ రంగానిదే హవా. నగరానికి ఏ దిక్కుకు వెళ్లినా కొత్త కొత్త అపార్ట్ మెంట్లు, వెంచర్లు దర్శనమిస్తాయి. రోజులు గడిచే కొద్దీ నగరం కూడా వేగంగా విస్తరిస్తోంది. అయితే, సామాన్యుడి సొంతింటి కలను ఆసరాగా చేసుకుని కొన్ని రియల్ సంస్థలు దందాలకు పాల్పడుతున్నాయి. రంగు రంగుల బ్రోచర్లు, గ్రాఫిక్స్ వీడియోలు చూపించి జనాన్ని బురిడీ కొట్టిస్తున్నాయి. ప్రీ లాంచ్ పేరుతో ముందే డబ్బులు వసూలు చేసి తర్వాత చుక్కలు చూపిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో మరో ప్రీ లాంచ్ ఆఫర్ మోసం వెలుగుచూసింది. ట్విస్ట్ ఏంటంటే, బీఆర్ఎస్ హయాంలో సదరు సంస్థపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏకంగా చైర్మన్‌ను అరెస్ట్ చేశారు.

కొంపల్లిలో కొంప ముంచిన భారతీ బిల్డర్స్

హైదరాబాద్‌లో పేరున్న రియల్ సంస్థల్లో భారతీ బిల్డర్స్ ఒకటి. ఈ సంస్థ కొంపల్లిలో భారతీ లేక్‌ వ్యూ పేరుతో ప్రాజెక్ట్ ప్రారంభించింది. చదరపు అడుగు రూ.3,200 అంటూ ప్రీ లాంచ్ ఆఫర్ ప్రకటించింది. కలర్ ఫుల్ బ్రోచర్లతో ప్రచారం చేసింది. దీంతో జనం క్యూ కట్టారు. కొంపల్లిలో సమావేశాలు, విందులు, వినోద కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భారీగా డిపాజిట్లు కట్టారు. ఎక్కువమందిని చేర్చేందుకే సదరు సంస్థ సీఈవోగా నర్సింహారావుకు భారీగా కమిషన్ ఇచ్చింది. అతి తక్కువ ధరకు ఫ్లాట్స్ అనడంతో 350 మంది వరకు డబ్బులు కట్టారు. కానీ, చివరకు జేబులు ఖాళీ అయ్యాయి.

చైర్మన్, ఎండీ అరెస్ట్

ప్రీ లాంచ్ పేరుతో రూ.50-60 కోట్ల వరకు జనం నుంచి డబ్బులు వసూలు చేసింది భారతీ బిల్డర్స్. కానీ, రోజులు గడుస్తున్నా ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. దీంతో భారతీ బిల్డర్స్‌పై సైబరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. బీవీఎస్ ప్రసాదరావు అనే బాధితుడు సహా 350 మంది కంప్లయింట్ చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. వంద కోట్ల విలువైన 6.23 ఎకరాల భూమిని ఇతరులకు విక్రయించినట్టు తేలింది. అధికారులు ఆ భూమిని స్వాధీనం చేసుకుని, భారతీ బిల్డర్స్ చైర్మన్ దూపాటి నాగరాజును అరెస్ట్ చేశారు. అలాగే, ఎండీ ముల్పూరి శివరామకృష్ణ, సీఈఓ తొడ్డాకుల నరసింహరావును అదుపులోకి తీసుకున్నారు.

పుప్పాలగూడ భూముల్లోనూ ఇంతే!

గతంలో పుప్పాలగూడ పరిధిలోని భూములను కోకాపేటలో ఉన్నాయంటూ చూపించి అమ్మకాలు జరిపినట్టు భారతీ బిల్డర్స్‌పై ఆరోపణలున్నాయి. స‌ర్వే నెంబ‌ర్ 301 నుంచి 308, 325 నుంచి 328, 331 నెంబ‌ర్స్ లో 198 ఎక‌రాల 30 గుంట‌ల భూమి ఉంది. డిస్ ప్లేస్ ప‌ర్స‌న్స్ యాక్ట్ 1954 ప్ర‌కారం ఓ వివాదం కోర్టులో కొన‌సాగుతోంది. ఈ భూములపై టీఎస్ఐఐసీ 2021లో వేలం పాట వేసింది. 6 కోర్టు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఫిజిక‌ల్ పొజిష‌న్‌లో ప్ర‌భుత్వం అభివృద్ధి ప‌నులు చేసుకుంటోంద‌ని అప్పట్లో తెలిపారు. అయితే, థ‌ర్డ్ పార్టీకి భార‌తీ బిల్డ‌ర్స్ భూములను అమ్ముతున్న‌ట్టు తమ దృష్టికి వ‌చ్చిందని, కాందిశీకుల భూములను కోకాపేట పేరు చెప్పి అమ్ముతున్నారని, 2023 ఫిబ్రవరిలో నార్సింగి పోలీసుల‌కు త‌హసీల్దార్ రాజ‌శేఖ‌ర్ ఫిర్యాదు చేశారు. ద‌ర్యాప్తు చేసి భార‌తి బిల్డ‌ర్స్‌పై క్రిమిన‌ల్ లేదా చీటింగ్ కేసులు న‌మోదు చేయాలని కోరారు.

బీఆర్ఎస్ హయాంలో అంతా మౌనం

కోర్టు కేసుల్లో మ‌గ్గుతున్న వివాదాస్ప‌ద భూముల‌ను క్ర‌య‌విక్ర‌యాలు చేయడంపై అప్పట్లో రెవెన్యూ అధికారులు కూడా స్పందించారు. కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కానీ, ఇది మాటలకే పరిమితం అయింది. ఎన్ని ఫిర్యాదులు వచ్చినా బీఆర్ఎస్ పాలనలో భారతీ బిల్డర్స్‌పై ఎలాంటి చర్యలు తీసుకున్నది లేదు. కానీ, ఇప్పుడు రాష్ట్రంలో పాలన మారడంతో కథ అడ్డం తిరిగింది. భారతీ బాగోతాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కొంపల్లి జరిపిన దందాపై వచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు చైర్మన్ నాగరాజును అరెస్ట్ చేశారు. ఇలాంటి ప్రీ లాంచ్ ఆఫర్లను నమ్మి డబ్బు కట్టే ముందు ఆలోచించాలని, అన్ని వివరాలు తెలుసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

Publisher : Swetcha Daily

Latest

IPS Officers: 28 మంది ఐపీఎస్‌లకు స్థానచలనం

Police Dept: రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐపీఎస్ అధికారులకు స్థానచలనం కల్పించింది....

Vinayaka Chavithi: ఖైరతాబాద్ గణేషుడికి కర్రపూజ

- విగ్రహ నిర్మాణ పనులు షురూ - 70 అడుగుల ఎత్తుతో మహాగణపతి -...

Rains: హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం

- మధ్యాహ్నం వరకు ఉక్కపోత.. అప్పుడే కుండపోత - రాష్ట్రంలో మూడు రోజులు...

Loans: అడ్డగోలు రుణాలు.. రికవరీ తిప్పలు

- రికవరీ టార్గెట్లు ఫిక్స్ చేసిన నిజామాబాద్ డీసీసీబీ - నిబంధనలకు విరుద్ధంగా...

Kakatiya University: కేయూలో మళ్లీ పీహెచ్‌‘ఢీ’

- ఆందోళనబాట పట్టిన విద్యార్థులు - ప్రభుత్వం వేసిన కమిటీ సూచనలకు భిన్నంగా...

Don't miss

IPS Officers: 28 మంది ఐపీఎస్‌లకు స్థానచలనం

Police Dept: రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐపీఎస్ అధికారులకు స్థానచలనం కల్పించింది....

Vinayaka Chavithi: ఖైరతాబాద్ గణేషుడికి కర్రపూజ

- విగ్రహ నిర్మాణ పనులు షురూ - 70 అడుగుల ఎత్తుతో మహాగణపతి -...

Rains: హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం

- మధ్యాహ్నం వరకు ఉక్కపోత.. అప్పుడే కుండపోత - రాష్ట్రంలో మూడు రోజులు...

Loans: అడ్డగోలు రుణాలు.. రికవరీ తిప్పలు

- రికవరీ టార్గెట్లు ఫిక్స్ చేసిన నిజామాబాద్ డీసీసీబీ - నిబంధనలకు విరుద్ధంగా...

Kakatiya University: కేయూలో మళ్లీ పీహెచ్‌‘ఢీ’

- ఆందోళనబాట పట్టిన విద్యార్థులు - ప్రభుత్వం వేసిన కమిటీ సూచనలకు భిన్నంగా...

Bengal Train Accident: పెరుగుతున్న మృతుల సంఖ్య

- లోకో పైలట్ సహా కనీసం 15 మంది మృతి - మృతుల సంఖ్య పెరిగే చాన్స్ - కాంచన్‌జంగ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొన్న గూడ్స్ ట్రైన్ - పట్టాలు తప్పిన వెనుక మూడు బోగీలు - ఉదయం నుంచే...

Hyderabad: డీజే సిద్ధూ.. వీని స్టయిలే వేరు!

- నగరంలో డ్రగ్స్‌పై ఉక్కుపాదం - పోలీసుల విస్తృత తనిఖీలు, నిఘా - డ్రగ్స్ సేవిస్తూ దొరికిపోయిన డీజే సిద్ధార్థ్ - సిద్ధూతోపాటు మరో వ్యక్తికి పాజిటివ్ - ఎండీఎంఏ డ్రగ్స్ తీసుకున్నట్లుగా గుర్తింపు - అదుపులోకి తీసుకుని మాదాపూర్...

Hyderabad:పాత కారుకు ‘కొత్త డ్రైవర్’?

పార్టీ సమూల ప్రక్షాళన చేపట్టనున్న కేసీఆర్ పార్టీ అధ్యక్ష పదవిని వేరేవాళ్లకు అప్పగించాలనే యోచన ఈ సారి కుటుంబ సభ్యులను దూరం పెట్టాలనుకుంటున్న కేసీఆర్ దళిత సామాజిక వర్గానికి చెందిన నేతకు...