Saturday, May 18, 2024

Exclusive

Telangana : గులాబీ.. బినామీ.. సునామీ..!!

అవినీతి ఆస్తులు అమ్మేద్దాం..
పక్క రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టేద్దాం!

– బినామీల వెంటపడుతున్న గులాబీలు
– అమ్మకానికి 80 శాతం ఆస్తులు
– ఎంతైనా ఫర్వాలేదు.. క్యాచ్ అండ్ క్యారీ అంటున్న వైనం
– మాజీ మంత్రికి 2 వేల కోట్ల టోకరా
– రంగారెడ్డి మాజీ కలెక్టర్ సొమ్మును కొట్టేసిన రిటైర్డ్ కలెక్టర్
– జిల్లాల్లో వందల ఎకరాలను బేరం పెట్టిన బడా నేతలు
– కొట్టేసిన అసైన్డ్, లావాణి పట్టా భూములను సైతం వదిలించుకునే ప్రయత్నం
– సైలెంట్‌గా ఇతర రాష్ట్రాల్లో పెట్టుబడులకు ప్లాన్స్
– పార్లమెంట్ ఎన్నికల తర్వాత మరింత గడ్డు పరిస్థితి అంటూ అనుమానం
– అక్రమార్జనను వదిలించుకునేందుకు నానా తంటాలు
– ధరణిని నమ్ముకుని తక్కువకు వస్తుందని ఆ ఆస్తులు కొంటే కష్టాలే
– గులాబీ బినామీ బాగోతాలు పార్ట్-1
– ఇకపై ‘స్వేచ్ఛ’లో వరుస ఇన్వెస్టిగేషన్ కథనాలు

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల, 9848070809

Benami issues of BRS leaders : ‘స్వేచ్ఛ’ ఇన్వెస్టిగేషన్ టీం: కేసీఆర్ పదేళ్ల పాలనపై ఎన్నో అవినీతి మరకలు. వాటి ఫలితమే అధికార మార్పిడి. బీఆర్ఎస్ పాలనపై విసుగెత్తి కేసీఆర్‌ను ఫాంహౌస్‌లో కూర్చోబెట్టారు ప్రజలు. గత పదేళ్లలో చివరి నాలుగేళ్లు అంతులేని అవినీతి జరిగిందనే అపవాదు మూటగట్టుకున్నారు కేసీఆర్. కాళేశ్వరం పేరుతో కమీషన్స్, ధరణితో అడ్డూఅదుపు లేకుండా భూముల దోపిడీ జరిగింది. హైదరాబాద్ లిటిగేషన్ భూములను బంగారు బాతుల్లా మార్చుకున్నారు గులాబీ నేతలు. ఒక్కో నేత వెయ్యి కోట్లకు తక్కువ కాకుండా సంపాదించారని టాక్. మళ్లీ అధికారంలోకి వస్తామని నోటి మాటలతోనే బినామీలకు అప్పగించారు. పెట్టుబడులు పెట్టారు. అగ్రిమెంట్లపైనే వ్యవహారం అంతా నడిచింది. అయితే, ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ ఫోన్ ట్యాపింగ్ కేసులో దూకుడు చూసి ధరణి, రియల్ ఎస్టేట్ అక్రమ బిజినెస్ తమకు చుట్టుకుంటుందని భయపడుతున్నారు. అందుకు ఎక్కడెక్కడ ఎవరి పేరు మీదనైతే ఆస్తులు ఉన్నాయో వారిని అమ్మి ఇవ్వాల్సిందిగా వేడుకుంటున్నారు. బ్లాక్ మనీ అయితే మార్కెట్ రేట్ కంటే 30 శాతం తక్కువకే అమ్మేస్తున్నారు. ఈ లిస్టులో నగరంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు ఉన్నారు.

రంగారెడ్డి మాజీ కలెక్టర్‌కి 200 కోట్లు ఎప్పుడిచ్చావ్ అన్న ఎమ్మెల్సీ

రంగారెడ్డి కలెక్టర్‌గా పనిచేసిన ఓ అవినీతి అయోమయం ఆర్థిక చిక్కుల్లో పడ్డారు. రైతులను దోచి, బీఆర్ఎస్ నేతలను సైతం వదలకుండా 25 శాతం కమీషన్ల పేరుతో డబ్బులు తీసుకుని నానా గడ్డి కరిచి గతంలో భూములను క్లియర్ చేశారు. ఇలా అక్రమంగా సంపాదించిన సొమ్ముని 200 కోట్ల వరకు ఓ రియల్ ఎస్టేట్ సంస్థలో పెట్టుబడులు పెట్టారు. అయితే, ఎక్కడా పేపర్‌పై రాసుకున్నది లేదు. గులాబీ నేతలు బినామీ ఆస్తులు మార్చుకుంటున్నారని తెలుసుకుని ఈయన కూడా ట్రై చేశారు. డబ్బులు తీసుకున్న మరో మాజీ కలెక్టర్, ఎంపీ అభ్యర్ధి వద్దకు వెళ్లి మనీ లేదా వాటా అడిగినట్టు సమాచారం. ఆయన మీరెప్పుడు డబ్బులు ఇచ్చారని అనడంతో అయోమయంలో పడి బయటకు వచ్చారని తెలుస్తోంది. హై బీపీతో సన్నిహితుల వద్ద అంతా చెప్పుకుని వాపోయినట్లు సమాచారం.

మాజీ మంత్రి నీళ్ల సొమ్ము గంగపాలే!

బయటకు మంచివాడిలా నటిస్తూ, మీడియానంతా తన గుప్పిట్లో పెట్టుకుని ఎడాపెడా సంపాదించిన మాజీ మంత్రి ఓ అమెరికా వ్యక్తిని నమ్మి 2 వేల కోట్లు నష్టపోయారని ఆ జిల్లా బీఆర్ఎస్ నేతలంతా ఏడాదిన్నరగా కొడై కూస్తున్నారు. అతను చనిపోవడం, వారసులు హైదరాబాద్‌కి తిరిగి రాకపోవడంతో నానా ప్రయత్నాలు చేసి ఇక రావని వదులేసుకున్నట్లు తెలుస్తోంది. అంతా ఒక దగ్గరే ఉంటే కష్టమనుకున్న సదరు నాయకుడు, ఊరికో ఇద్దరిని బినామీగా పెట్టుకున్నట్టు సమాచారం. దాదాపు 100 మందికి పైగా భూములను వారి పేర్ల మీదుగా, పొజిషన్‌లో(కబ్జా) ఉంటున్నారని స్పష్టమవుతోంది. ప్రభుత్వం మారిపోవడంతో ఇప్పుడు ఏం చేయాలో తెలియక వాటన్నింటినీ ఇంకొంత మంది పైకి లీగల్‌గా చేయిస్తున్నట్లు సమాచారం. అదే జిల్లాకు చెందిన మాజీ మహిళా ఎమ్మెల్యే 400 ఎకరాల అసైన్డ్, లావాణి పట్టా భూములను కొట్టేసినట్లు విశ్వసనీయ సమాచారం. ధరణి మారినా, రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకున్నా వీరి సంపద అంతా అవిరి అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇతర రాష్ట్రాల్లో పెట్టుబడులు పెడుదాం

ప్రతి జిల్లాల్లో బీఆర్ఎస్ నేతలకు వందల ఎకరాలు ఉన్నాయి. 30 నుంచి 50 ఎకరాల్లో ఫాంహౌజ్‌లు కట్టుకున్నారు. అయితే, బినామీ పేర్ల మీద ఉన్న ఆస్తులను అమ్మేసి తమిళనాడు, ముంబై, బెంగళూరు, గోవా, ఢిల్లీలో కమర్షియల్ కాంప్లెక్స్‌లు ప్లాన్ చేస్తున్నట్లు స్థానిక నేతల అనుచరులు చెప్పుకుంటున్నారు. ఎంపీ ఎన్నికలు అయిపోయిన 3 నెలల్లోనే అంతా అమ్మేసుకుని ప్రశాంతంగా బయటపడాలని ఆలోచిస్తున్నట్టు ఆధారాలు ఉన్నాయి.

‘స్వేచ్ఛ’లో ఇకపై వరస కథనాలు

ఒక్కొక్క నేతకు ఎక్కడెక్కడ బినామీ ఆస్తులు ఉన్నాయి. ఇప్పుడు వాటి విలువ ఎంత? వీరనుకున్నంత ఈజీగా బినామీలు ఒప్పుకుంటారా? వారి ఆదాయానికి మార్కెట్ విలువకు తేడా ఎంత? జిల్లాల వారీగా కొనుగోలు చేసిన భూములపై ‘స్వేచ్ఛ’ వరుసగా ఇన్వెస్టిగేషన్ కథనాలు ఇవ్వనుంది.

Publisher : Swetcha Daily

Latest

Medak: బీఆర్ఎస్ అభ్యర్థిని డిస్‌క్వాలిఫై చేయాలి: సీఈవోకు రఘునందన్ రావు ఫిర్యాదు

Raghunandan Rao: మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై బీజేపీ అభ్యర్థి రఘునందన్...

TTD: శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల

TTDevasthanam: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల...

BRS: కవితతో బాల్క సుమన్, ఆర్ఎస్పీ ములాఖత్.. ప్రభుత్వ పాలసీపై కేసు పెడితే..!

Delhi Liquor Policy: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్...

Vijayashanthi: కిషన్ రెడ్డిపై విజయశాంతి ట్వీట్ వైరల్.. రాములమ్మ ఏం చెప్పాలనుకున్నారు?

Telangana: విజయశాంతి చేసిన ఓ ట్వీట్‌పై సోషల్ మీడియాలో తెగ చర్చ...

పౌర సమాజ చైతన్యమే తెలంగాణకు రక్ష..

మరో పక్షం రోజుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తి కావస్తోంది....

Don't miss

Medak: బీఆర్ఎస్ అభ్యర్థిని డిస్‌క్వాలిఫై చేయాలి: సీఈవోకు రఘునందన్ రావు ఫిర్యాదు

Raghunandan Rao: మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై బీజేపీ అభ్యర్థి రఘునందన్...

TTD: శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల

TTDevasthanam: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల...

BRS: కవితతో బాల్క సుమన్, ఆర్ఎస్పీ ములాఖత్.. ప్రభుత్వ పాలసీపై కేసు పెడితే..!

Delhi Liquor Policy: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్...

Vijayashanthi: కిషన్ రెడ్డిపై విజయశాంతి ట్వీట్ వైరల్.. రాములమ్మ ఏం చెప్పాలనుకున్నారు?

Telangana: విజయశాంతి చేసిన ఓ ట్వీట్‌పై సోషల్ మీడియాలో తెగ చర్చ...

పౌర సమాజ చైతన్యమే తెలంగాణకు రక్ష..

మరో పక్షం రోజుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తి కావస్తోంది....

Hyderabad: బీఆర్ఎస్ ‘పవర్’గేమ్

బీఆర్ఎస్ హయాంలో యాదాద్రి పవర్ ప్లాంట్ అక్రమాలు ఓపెన్​ టెండర్లు లేకుండానే ఛత్తీస్ గడ్ తో కరెంట్ పర్చేజ్ రైతులకు సబ్సిడీ పేరుతో బలవంతంగా విద్యుత్ పరికరాలు బీఆర్ఎస్ విధానాలతో తీవ్రంగా...

Hyderabad:ఎవరి చేతికి కాంగి‘రేస్’ పగ్గాలు ?

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి నియామకానికి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ రేసులో సీనియర్ హేమాహేమీలు జూన్ నెలాఖరున జరగబోయే స్థానిక ఎన్నికలకు ముందే అధ్యక్షుని ఎంపిక పీసీసీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న నేతలలో...

Rahul Gandhi: ఆలోచింపజేస్తున్న ‘ఒక్క ఓటు’

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన రాహుల్ గాంధీ ట్వీట్ జోడో యాత్ర తర్వాత మారిన రాహుల్ గాంధీ వైఖరి సామాన్య జనంతో మమేకమైన రాహుల్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారానికి వచ్చి...