Tuesday, December 3, 2024

Exclusive

New Delhi : మోదీ ఫైల్స్..!!

– మోదీ పాలనను ఎండగడుతున్న విదేశీ మీడియా
– గతంలో ‘ఇండియా ది మోదీ క్వశ్చన్’ పేరుతో ప్రశ్నించిన బీబీసీ
– తర్వాత బీబీసీ కార్యాలయంపై ఐటీ సోదాలు
– ఇప్పుడు ‘మ‌ణిపూర్ డాక్యుమెంట్’ పేరిట బుక్ విడుదల చేసిన అమెరికా
– మరోసారి అదే తంతు.. అగ్రరాజ్యంపై కమలనాథుల గుర్రు
– నిజాలు బయటపెడితే అంత ఉలుకెందుకు?
– మణిపూర్ అఘాయిత్యాలు ప్రపంచమంతా చూసిందంటూ కాంగ్రెస్ సెటైర్లు

Modi against forign documentaries: మాటల గారడీతో ఎదుటి వారిని మాట్లాడనీయకుండా చేయడంలో ప్రధాని మోదీ దిట్ట. కొద్దో గొప్పో స్ట్రాంగ్‌గా బలపడతారనుకున్న నేతలను ఏదో రీతిలో లొంగదీసుకుంటారని, లేదంటే వేధింపులకు గురి చేస్తారనే ఆరోపణలు ఉన్నాయి. లోకల్‌గా అయితే ప్రశ్నించే వాళ్ల గొంతుకలు నొక్కగలరు కానీ, అంతర్జాతీయ స్థాయిలో మోదీ విధానాలను తూర్పారబడుతున్న అగ్ర దేశాల ప్రశ్నలకు ఏం సమాధానం చెప్తారు? అంటూ కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది.

‘ఇండియా ది మోదీ క్వశ్చన్’

2023 జనవరిలో బీబీసీ ఓ సంచలన డాక్యుమెంటరీ సిరీస్‌ను విడుదల చేసింది. ‘ఇండియా ది మోదీ క్వశ్చన్’ పేరిట విడుదలైన ఈ సిరీస్ రాజకీయ వర్గాలలో పెద్ద దుమారమే రేపింది. ఒక‌ప్పుడు గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా ఉన్న న‌రేంద్ర మోదీ హ‌యాంలో గోద్రా ప్రాంతంలో అల్ల‌ర్లు చోటు చేసుకున్నాయి. రైళ్లు, బ‌స్సులు, ఇళ్ల ద‌హ‌నాల‌తో రెండు వేల మంది పౌరులు ద‌హ‌న‌మైపోయారు. ఈ ఘ‌ట‌న‌ల‌కు బాధ్యులు మౌనంగా ఉన్న అప్పటి గుజరాత్ సీఎం మోదీనేన‌ని పేర్కొంటూ బీబీసీ డాక్యుమెంట‌రీని విడుద‌ల చేసింది. అయితే, దీనిని భార‌త ప్ర‌భుత్వం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. అంతేకాదు, క్ష‌ణాల వ్య‌వ‌ధిలోనే భార‌త నెట్ నుంచి దీనిని తొల‌గించింది. అప్ప‌టికే దీనిని చూసిన అలీగ‌ఢ్ ముస్లిం యూనివ‌ర్సిటీ విద్యార్థుల‌ను అరెస్టు చేయించారు. ఇప్ప‌టికీ వారు జైల్లోనే ఉన్నారు. ఈ దెబ్బ త‌ర్వాత‌ బీబీసీపై ఐటీ దాడులు జరిగాయి. ఇటీవ‌ల ఈ సంస్థ భార‌త్ నుంచి ఖాళీ చేసి వెళ్లిపోయింది కూడా. బ్రిట‌న్ ప్ర‌భుత్వాన్ని కూడా మోదీ స‌ర్కారు హెచ్చ‌రించింది. ఇది అంత‌ర్గ‌త విష‌య‌మ‌ని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.

‘మ‌ణిపూర్ డాక్యుమెంట్‌’

బ్రిటీష్ బెడద వదిలింది కదా అనుకున్న కమలనాథులకు ఇప్పుడు అమెరికా ఝలక్ ఇచ్చింది. గ‌త ఏడాది నుంచి ఈశాన్య రాష్ట్రం మ‌ణిపూర్‌లో జ‌రుగుతున్న జాతుల ఘ‌ర్ష‌ణ‌, ఈ క్ర‌మంలో మ‌హిళ‌ల‌పై జ‌రిగిన అకృత్యాలు, దారుణాలు, పోలీసుల కాల్పులు, ప్ర‌భుత్వం చెబుతున్న‌ది, క్షేత్ర‌స్థాయిలో జ‌రిగింది, మొత్తం 1500 మందికిపైగా మృతి చెందిన వారి వివ‌రాలు, బంధువుల ఆర్త‌నాదాలు, అభిప్రాయాలు, ప్ర‌భుత్వాల ఉదాసీన‌త‌, ప్ర‌జాసంఘాల ఆగ్ర‌హాలు, ఇలా అన్నింటినీ గుది గుచ్చి ”మ‌ణిపూర్ డాక్యుమెంట్‌”ను అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ విడుదల చేశారు. దీనిలో ప్ర‌భుత్వ వాద‌న‌ను స్థానిక ప‌రిస్థితుల‌ను కూడా వెల్ల‌డించారు. అంతేకాదు, ”భార‌త్‌లో నిజాల‌కు ఎలాంటి విలువ ఉందో, బీబీసీ ఆఫీస్‌ను ఎందుకు మూసివేశారో, తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది” అని పుస్త‌కం పీఠిక‌లో పేర్కొన్నారు.

విదేశాంగ శాఖ ఖండన

అమెరికా పుస్త‌కాన్ని భార‌త్‌లో విడుద‌ల చేయ‌బోమ‌ని మోదీ ప్ర‌భుత్వం త‌క్ష‌ణ‌మే చెప్పేసింది. అంతేకాదు ‘గోద్రా సిరీస్‌’ ట్రాష్‌, ‘మ‌ణిపూర్ డాక్యుమెంట్’ ట్రాష్‌, మీరు చెప్పేది ట్రాష్‌ ట్రాష్‌ అంటూ భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. ఈ నివేదిక పూర్తిగా పక్షపాత ధోరణితో రూపొదించారని నిప్పులు చెరిగారు. సొంత దేశంలో సరే మరి విదేశీ మీడియా విమర్శలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో మోదీ. ఎందుకంటే వాళ్ల నోళ్లు నొక్కేందుకు మనకి అధికారం లేదు కదా అంటూ కాంగ్రెస్ పార్టీ చురకలంటిస్తోంది.

Publisher : Swetcha Daily

Latest

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Don't miss

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్, భట్టి - సింగరేణికి అండగా నిలవండి - పెండింగ్ ప్రాజెక్టులపై తేల్చేయండి - పెండింగ్ విభజన హామీలను నెరవేర్చండి - కొత్త విద్యాసంస్థలు ఏర్పాటు అవసరం -...

Telangana:పేరు మారనున్న ‘ములుగు’

ములుగు జిల్లా పేరు మార్పు కు కసరత్తు మొదలు పెట్టిన అధికారులు ‘సమ్మక్క సారలమ్మ ములుగు’గా మార్చాలని ప్రతిపాదన మంత్రి సీతక్క విజ్ణప్తితో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల సమ్మక్క-సారలమ్మ ములుగు జిల్లాగా...

Telangana: ఎన్నాళ్లీ మూత ‘బడులు’

బీఆర్ఎస్ హయాంలో అస్తవ్యస్తంగా మారిన పాఠశాల విద్య 28 వేల పాఠశాలలకు గాను మూతపడిన సగం పాఠశాలలు పాఠశాల విద్యపై ప్రచారార్భాటమే తప్ప చేసింది శూన్యం బీఆర్ఎస్ విధానాన్ని తప్పుబడుతున్న విద్యావేత్తలు ...