– విచారణకు రావాల్సిందే!
– నటి హేమకు మళ్లీ నోటీసులు
– విచారణకు రావాల్సిందేనన్న బెంగళూరు పోలీసులు
– జూన్ 1న మస్ట్‌గా హాజరవ్వాలని ఆదేశం
– ఇప్పటికే ఓసారి డుమ్మా కొట్టిన హేమ
Actress Hema: రేవ్ పార్టీ కేసు సినీ నటి హేమను వెంటాడుతోంది. ఇప్పటికే ఓసారి విచారణకు డుమ్మా కొట్టిన ఆమెకు మరోసారి బెంగళూరు పోలీసులు నోటీసులు పంపించారు. ఆమెతో పాటు మరో 8 మందికి నోటీసులు పంపించారు. జూన్ 1న విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు. ముందుగా ఈనెల 27న విచారణకు రావాలని హేమకు నోటీసులు పంపారు అధికారులు. కానీ, ఆమె అనారోగ్య కారణాలతో హాజరు కాలేదు. ఈ నేపథ్యంలోనే జూన్ 1న రావాలని మరోసారి నోటీసులు పంపించారు.
రేవ్ పార్టీ కేసులో అరెస్టయిన ఆరుగురు నిందితులతో పాటు హేమ కూడా సోమవారం విచారణకు హాజరుకావాలని సీసీబీ పోలీసులు స్పష్టం చేశారు. తాజా నోటీసులకు ఆమె ఎలా స్పందిస్తారు? విచారణకు హాజరు అవుతారా లేదా? అన్నది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది.
కొద్ది రోజుల క్రితం బెంగళూరు శివారులోని ఓ ఫాంహౌస్‌లో రేవ్ పార్టీ జరిగింది. దీనికి చాలామంది ప్రముఖులు హాజరయ్యారు. పోలీసులు రెయిడ్ చేసి అందరి బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు. వారిలో 86 మందికి డ్రగ్స్ తీసుకున్నట్టు పాజిటివ్ వచ్చింది. వారిలో హేమ కూడా ఉంది. దీంతో ముందుగా ఈనెల 27న విచారణకు రావాలని నోటీసులు ఇస్తే, వైరల్ ఫీవర్ అంటూ ఆమె తప్పించుకునే ప్రయత్నం చేశారు. మరోసారి హాజరవుతానని లేఖ పంపారు. కానీ, జూన్ 1న కచ్చితంగా రావాలని తాజాగా హేమకు నోటీసులు అందాయి. అసలు, రేవ్ పార్టీలో తాను పాల్గొనలేదని ముందునుంచి చెబుతూ వచ్చింది హేమ. కానీ, పోలీసులు ఫోటోలు రిలీజ్ చేసి షాకిచ్చారు. తన స్క్రీన్ నేమ్ దాచి కృష్ణవేణి అనే పేరుతో పార్టీకి వెళ్లినట్టు చెప్పారు. దీంతో ఆమె బండారం బయటపడింది.