- దేశంలోనే ఎక్కువగా కండోమ్స్ వాడేది ముస్లింలే అన్న మోదీ
- మోదీ కామెంట్స్ పై స్పందించిన ఎంఐఎం నేత అసదుద్దీన్
- కండోమ్స్ మేం ఎక్కువగా వాడతాము…తప్పేంటి?
- ముస్లింలు ఎక్కువ మంది పిల్లల్ని కంటారనేగా అర్థం
- అలాగయితే మోదీకి ఆరుగురు సోదరులు
- మోహన్ భగవత్ కు 10 మంది సోదరీమణులు
- 17 కోట్ల భారతీయ ముస్లింలను చొరబాటుదారులంటున్నారు
- దళితులు, ముస్లింలపై ద్వేషమే మోదీ గ్యారంటీనా?
MIM Leader Asaduddin Oyesi: దేశంలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పొలిటికల్ పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేయడం పరిపాటి. కాగా అదే సమయంలో ప్రత్యర్థులపై విమర్శలు, ప్రతి విమర్శలు చేసేటప్పుడు సభ్యత, సంస్కారం మర్చిపోయి సభ్యసమాజం తలదించుకునేలా కామెంట్స్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రత్యర్థి పార్టీలను గబ్బుపట్టించేందుకు చాలా చవకబారుగా వ్యవహరిస్తూ బురదలో కూరుకుపోతుండటమే ఆశ్చర్యంగా ఉంది. గతంలో ఏపీ. సోషల్ మీడియాలో వైసీపీ, టీడీపీ తరఫున కండోమ్ ప్యాకెట్లతో పార్టీల ప్రచారం జరిగింది. . వెంటనే తెలుగుదేశంపార్టీ పేరుతో కండోమ్ ప్యాకెట్లు దర్శనమిచ్చాయి. కండోమ్ ప్యాకెట్లపై వైసీపీ జెండా రంగులతో, ఫ్యాన్ గుర్తుతో, సిద్ధం అని రాసుంది. అలాగే పసుపు రంగులో టీడీపీ అని రాసి, పార్టీ గుర్తుతో భవిష్యత్తుకు గ్యారంటీ అని రాసున్న కండోమ్ ప్యాకెట్లు కనిపించాయి. ఇప్పుడు లేటెస్ట్ గా ఉన్నత పదవిలో ఉన్న ప్రధాని మోదీ వెంట అలాంటి మాటలు రావడం చూస్తుంటే సిగ్గుచేటనిపిస్తోందని ప్రతిపక్షాలు వాపోతున్నాయి. ఇటీవల ఓ బహిరంగ సభలో మోదీ చేసిన కామెంట్లను ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఖండించారు. ఇంతకీ మోదీ చేసిన కామెంట్స్ ఏమిటంటే దేశంలోనే ఎక్కువగా ముస్లింలు కండోమ్స్ వాడతారని. అయితే ఇదే విషయాన్ని సమర్థిస్తూ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఇలా అన్నారు. ముస్లింలు ఎక్కువ మంది పిల్లలను కంటారనే అర్థం వచ్చేలా మోదీ మాట్లాడారని.. ఎక్కువ మంది పిల్లలను కనకుండా జాగ్రత్తలు తీసుకునేది ముస్లింలేనని చెప్పారు.
ముస్లింలపై ద్వేషమెందుకు ?
అత్యధికంగా కండోమ్‌లు వాడుతున్న తమపై మోదీ అనవసర ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఈ మధ్యే రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ ” దేశ ఆస్తులపై మొదటి హక్కు ముస్లింలకే ఉంటుందని కాంగ్రెస్ చెప్పింది. అంటే ఎక్కువ పిల్లలు ఉన్నవారికే.. ఆస్తి పంచుతారు. మీరు కష్టపడి సంపాధించిన ఆస్తులు చొరబాటుదారులకు వెళ్లాలా?” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్‌పై స్పందించిన ఓవైసీ.. “ముస్లిం సమాజంలోని పురుషులే ఎక్కువగా కండోమ్‌లను వినియోగిస్తున్నారు. చైల్డ్ స్పేసింగ్‌లో ఎక్కువ రికార్డు కలిగి ఉన్నారు. ముస్లింలు ఎక్కువ మంది పిల్లల్ని పుట్టిస్తున్నారంటూ మోదీ చెప్తున్నారు. అలా అయితే.. మోదీకి ఆరుగురు సోదరులు, అమిత్ షాకు ఆరుగురు, ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్‌కి 10 మంది సోదరీమణులు ఉన్నారు. కేంద్ర గణాంకాల ప్రకారం ముస్లింల సంతానోత్పత్తి రేటు తగ్గుముఖం పడుతోంది. కానీ హిందువుల్లో భయాన్ని సృష్టించేందుకు మోదీ ద్వేషాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దేశంలో ముస్లింలు ఎప్పటికీ మెజారిటీగా ఉండరు. ముస్లింల పట్ల ఈ భయాన్ని ఎంతకాలం కొనసాగిస్తారు. దేశంలో ఉన్న 17 కోట్ల మంది భారతీయ ముస్లింలను చొరబాటుదారులు అంటున్నారు. దళితులు, ముస్లింల పట్ల ద్వేషమే మోదీ గ్యారెంటీలా కనిపిస్తోంది. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ నగరంలో చిచ్చు పెట్టడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది” అని అసద్ అన్నారు.