Arundhati movie child artist Divya Nagesh junior anushka social media :
కోడి రామకృష్ణ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో వచ్చిన అరుంధతి మూవీ ఎంత పాపులరో తెలిసిందే. కేవలం లేడీ ఓరియెంటెడ్ గా వచ్చి ఆ రోజుల్లోనే పాన్ ఇండియా కలెక్షన్లు కొల్లగొట్టింది. ఇక అనుష్క నటనకు ఫిదా అవ్వని వారు ఉండరు. అరుంధతి సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనుష్క కెరీర్ లోనే కాకుండా టాలీవుడ్ సినీ చరిత్రలోనే ఎప్పటికి నిలిచి పోయే సినిమా అరుంధతి. హీరోయిన్ అనుష్కకు ఓ స్టార్ స్టేటస్ ను తెప్పించిన సినిమాగా అంతా చెప్పుకుంటారు. అలాంటి సినిమాలో కనిపించిన ప్రతి చిన్న పాత్ర కూడా ఎప్పటికి గుర్తుండిపోతుంది. అయితే అనుష్క, సోనూసూద్ తర్వాత గుర్తుపెట్టుకోదగ్గ ఓ పాత్ర ఉంటుంది. అదే చిన్నప్పటి అరుంధతి పాత్ర. చిన్నప్పటి అనుష్క గా కనిపించిన బాల నటిని అంత తేలికగా మర్చిపోగలమా… చిన్నారి అరుంధతిగా దివ్య నగేష్ నటించింది. కేరళలోని అలప్పుజలో జన్మించిన దివ్య నగేష్ 2014 లో తమిళ చిత్రం సేవమ్ తో బాల నటిగా సినీ రంగ ప్రవేశం చేసి చిన్నతనంలోనే విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.
సాఫీగా సాగని కెరీర్
బాల నటిగా దివ్య నగేష్ చాలా సినిమాల్లో నటించింది. అరుంధతి సినిమాలో నటించిన తర్వాత ఈ అమ్మాయికి మరింతగా పాపులారిటీ దక్కింది. అయితే అదృష్టం కలిసి రాకపోవడంతో ఆ తర్వాత ఎక్కువ ఆఫర్లు రాలేదు. పైగా వయసు పెరగడం వల్ల బాల నటిగా ఆఫర్లు రాలేదు. పెద్ద అయ్యాక హీరోయిన్ గా సినిమాలు చేసేందుకు సిద్ధం అయ్యింది. అది కూడా ఆమెకు కలిసి రాలేదు. రెండు మూడు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన దివ్య నగేష్ సోషల్ మీడియాలో సందడి చేయడం తప్ప హీరోయిన్ గా పెద్దగా ప్రభావం చూపించలేక పోయింది. చిన్నారి అరుంధతిగా దివ్య నగేష్ ను చూసిన తెలుగు ప్రేక్షకులు ఇతర హీరోల సరసన హీరోయిన్ గా ఒప్పుకోవడం లేదు. పైగా కాస్త బొద్దుగా ఉండటం కూడా ఆమెకు ప్రతికూల అంశంగా మారింది. దివ్య నగేష్ అరుంధతిలో నటించే సమయంకు ఇప్పటికి చాలా మార్పు వచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో దివ్య నగేష్ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. మూడు పదుల వయసు ఇప్పటికే దాటిన దివ్య నగేష్ మళ్లీ సినిమాల్లో నటించే అవకాశాలు చాలా తక్కువ. హీరోయిన్ గా కాకున్నా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఏమైనా ఆఫర్లు వస్తాయేమో చూడాలి.