Congress Party : తెలంగాణ కాంగ్రెస్ మీడియా, కమ్యూనికేషన్ వ్యవహారాల చైర్మన్‌గా సామ రామ్మోహన్ రెడ్డి నియామకం అయ్యారు. సామ రామ్మోహన్ రెడ్డిని పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి నియమించినట్లు సోమవారం మహేశ్ కుమార్ గౌడ్ పీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ సోమవారం ఓ ప్రకటనలో ఉత్తర్వులు జారీ చేశారు.
గతంలో సామ రామ్మోహన్ రెడ్డి టీపీసీసీ అఫిషియల్ స్పోక్స్ పర్సన్‌గా ఉన్నాడు. మరోవైపు సోషల్ మీడియా వేదికగా ఆయన చురుకుగా పనిచేస్తున్నారు. కాగా, లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను లోక్‌సభ ఎన్నికల్లో ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోంది.