- ఏపీలో 80 శాతం ఓటింగ్ నమోదు
- అర్థరాత్రి దాకా కొనసాగిన పోలింగ్ ప్రక్రియ
- సగటున అన్ని నియోజకవర్గాలలో 75 శాతం పైగా పోలింగ్ నమోదు
- పెరిగిన ఓటింగ్ శాతంపై అధికార, ప్రతిపక్ష పార్టీల అంచనాలు
- ఎవరికి వారు గెలుపు ధీమా
- ఏపీలో జోరందుకున్న బెట్టింగులు
- దాదాపు 25 నియోజకవర్గాలపై గురిపెట్టిన బెట్టింగ్ రాయుళ్లు
- అధికారపార్టీని భయపెడుతున్న పెరిగిన ఓట్ల శాతం
AP Elections 80 percent voting Bettings starts lakhs, crores:
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల పోలింగ్ జరిగింది. సోమవారం అర్థరాత్రివరకూ కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతుండటంతో పలు ప్రాంతాల్లోని నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని తెలిసింది. ఆంధ్రప్రదేశ్ లో మాదే అధికారం అంటూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, అలాగే అధికార వైసీపీ నాయకులు ధీమాగా ఉన్నారు. పలు ప్రాంతాల్లో ఇంకా పోలింగ్ శాతంపై క్లారిటీ రాలేదు. అయితే దాదాపు 80 శాతం పైగా నమోదు కావచ్చనే అంచనాలున్నాయి. ఆ ఎన్నికలలో ఎవరికివారు భారీ పోలింగ్ తమకు అనుకూలమని లెక్కలు వేస్తున్నారు. వాస్తవానికి 2019లో 79-80 శాతం మధ్యలో నమోదై అప్పుడున్న ప్రభుత్వాన్ని పడగొట్టింది. అంతకుముందు 2014 ఎన్నికల్లో కూడా 2009 కంటే ఎక్కువ పోలింగ్ నమోదై తెలుగుదేశం ప్రభుత్వ ఏర్పాటుకు కారణమైంది. అయితే ఈసారి పోలింగ్ 80 శాతం దాటొచ్చనిని తెలుస్తోంది. ఈ నేపధ్యంలో ఎవరికి ఈ పెరిగిన శాతం అనుకూలమనే విషయం అర్ధం కాని పరిస్థితి నెలకొంది. ఏపీలో అర్ధరాత్రి 12 గంటల వరకు పోలింగ్ కొనసాగిందని అధికారులు చెబుతున్నారు.
పల్లె ఓటర్లు పోటెత్తారు
రాష్ట్రంలో సగటున తీసుకుంటే ప్రతి నియోజకవర్గంలో దాదాపు 75 శాతం పైగానే పోలింగ్ జరిగినట్లు తెలుస్తోంది. గెలుపు తమదే అంటే తమదే అని ఇటు వైసీపీ అటు కూటమి నేతలు అంటున్నారు ఉదయం 7 గంటలకే క్యూలో నిలబడి ఓటు వేయడంతో అత్యధిక శాతం యువకులు, మహిళలు ఓటు వేయడంతో ఆ ఓట్లు ఎవరికో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు రాజకీయ నాయకులు .అయితే ఉదయం 11 గంటల దాకా జరిగిన పోలింగ్ మొత్తం అధికార వైసీపీకి అనుకూలంగా ఉందని రాజకీయ పండితులు చెబుతున్నారు. ఆ తర్వాత అర్థరాత్రి వరకూ జరిగిన పోలింగ్ సరళి ప్రతిపక్ష కూటమికి అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. సాయంత్రం వరకూ ఓటర్లు ఒక్కసారిగా పోటెత్తారు. ఆరు గంటల దాకా సమయమే ఉండటంతో దాదాపు ప్రతి నియోజకవర్గంలో వందల సంఖ్యలో ఓటర్లు బారులు తీరారు. ఆరుగంటల వరకూ క్యూ లో ఉన్న ప్రతి ఓటరుకూ అవకాశం ఇవ్వాలని ఎన్నికల సంఘం ఆదేశాలతో రాత్రి బాగా పొద్దుపోయేదాకా పోలింగ్ ప్రక్రియ జరుగుతునే ఉంది. ఈ సారి కూడా ఏపీలో పల్లె ఓటర్లు భారీ స్థాయిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే అర్భన్ పరిధిలో ఓటు బ్యాంకు అనుకున్న స్థాయిలో పెరగలేదు. విశాఖపట్నం లాంటి నగరంలో 65 శాతం మాత్రమే ఓటింగ్ జరిగింది. పెరిగిన ఓటింగ్ శాతం అంతా ప్రభుత్వ వ్యతిరేకతే అంటున్నారు చంద్రబాబు. గతానికి భిన్నంగా జరిగిన ఈ ఎన్నికలలో ఫలితాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. గెలుపు మాదే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు. అయితే మహిళలు, యువకులు తమ పార్టీకే ఓటేశారని..అందుకే భారీ ఎత్తున ఓటింగ్ శాతం నమోదయిందని అధికార పార్టీ వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతున్నారు.
బెట్టింగుల జోరు మొదలైంది
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల పోలింగ్ జరిగింది. సోమవారం రాత్రి కూడా కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరగడంతో పలు ప్రాంతాల్లోని నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లోని 175 అసెంబ్లీ నియోజక వర్గాల్లో, 25 లోక్ సభ నియోజక వర్గాల్లో ఎవరు గెలుస్తారు ? అంటూ బెట్టంగ్ లు మొదలైనాయి. పలు పోలింగ్ కేంద్రాల దగ్గరే గుట్టుచప్పుడు కాకుండా ఎన్నికల బెట్టింగ్ జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. అన్ని పార్టీలకు చెందిన నాయకులు, నాయకులే బెట్టింగ్ లకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. అంతే కాకుండా టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు జోరుగా బెట్టింగ్ లు పాల్పడ్డారని తెలిసింది. ఎక్కువగా టీడీపీ, వైసీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు వారివారి స్థాయిని బట్టి బెట్టింగ్ లు కట్టారని తెలిసింది. ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కుప్పం, పుంగనూరు, చంద్రగిరి, తిరుపతి, పీలేరు, తంబళపల్లె, మదనపల్లె, పలమనేరు, చిత్తూరు, నగిరిలో జోరుగా బెట్టింగ్ జరిగిందని తెలిసింది. కడప జిల్లాలో కూడా జోరుగా బెట్టింగ్ జరిగిందని సమాచారం.
పెద్ద తలకాయల మీదే పందెం
తమ నాయకుడు గెలుస్తాడు అంటే లేదు మా లీడర్ గెలుస్తారు అంటూ వైసీపీ, టీడీపీ, జనసేన నాయకులు బెట్టింగ్ లు కట్టారని ప్రచారం జరుగుతోంది. . కొన్ని ప్రాంతాల్లో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు బైక్ లు బెట్టింగ్ కట్టారని ఆరోపణలు ఉన్నాయి. ఇక కోస్తా జిల్లాల్లో అయితే కోడి పందెలను తలపించేలా జోరుగా బెట్టింగ్ లు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ ల బెట్టింగ్ లకు పోటీగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల విషయంలో జోరుగా బెట్టింగ్ లు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. మొత్తం మీద అనధికారికంగా కోట్లాది రూపాయలు బెట్టింగ్ లు జరుగుతున్నాయని టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీల కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్, పవన్ కల్యాణ్, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తదితరులు ఎంత మెజారిటీ సాధిస్తారు అని కూడా బెట్టింగ్ జరిగిందని తెలిసింది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ఎన్నికల విషయంలో ఇంత భారీగా బెట్టింగ్ లు జరగడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.