Wednesday, September 18, 2024

Exclusive

Hyderabad: ఉరుకుతూ వెళ్లారు..ఉత్సాహంగా చేరారు

Andhra settelers reached Hyderabad after using votes successfully:
రెండు తెలుగు రాష్ట్రాలలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా హైదరాబాద్ నగరాన్ని విడిచి ఊళ్లకు చేరుకుని తమ అభిమాన నేతలకు ఓటేసి తిరుగు ప్రయాణమయ్యారు ఆంధ్రా ప్రాంత ప్రజలు. అయితే ఈ రెండు రోజులు హైదరాబాద్ రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువుల నిమిత్తం హైదరాబాద్ లో స్థిరపడిన ఆంధ్రులు ప్రతి సంక్రాంతి, దసరా సెలవలకు తప్పకుండా ఊళ్లు వెళతారు. ఈ సారి ఎన్నికలు తోడయ్యాయి. రెండవ శనివారం, ఆదివారం కలిసిరావడంతో మూడు రోజులు నగర ప్రజలకు వెసలుబాటు కలిగింది.. బతుకుదెరువు కోసం ఆంధ్రా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన వాళ్లంతా తమ ఓటు హక్కును ఉపయోగించుకునేందుకు తమ సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో పట్టణంలోని పలు కూడళ్లు.. మెట్ర స్టేషన్లు, బస్ సేషన్లు, రైల్వే స్టేషన్లు వెలవెలబోయాయి. అయితే, సోమవారం పోలింగ్ ముగియడంతో ఆంధ్రాకు వెళ్లిన వారంతా ఒక్కొక్కరుగా నగరానికి చేరుకుంటున్నారు. బస్సుల్లో వెళ్లిన వాళ్లు రిటర్న్ టికెట్ అప్పుడు బుక్ చేసుకోవడంతో మంగళవారం తెల్లవారుజామునే వారంతా నగరానికి చేరుకున్నారు.

మెట్రో అదనపు సేవలు

ఈ క్రమంలోనే ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఉదయం 5.30 నుంచే మెట్రో రైళ్ల రాకపోకలు మొదలయ్యాయి. విజయవాడ నుంచి హైరదాబాద్ వచ్చే ప్రయాణికులకు మొదటి చెక్ పాయింట్ ఎల్బీ నగర్ కావడంతో ప్రయాణికులు వారి స్వస్థలాలకు చేరుకునేందుకు మెట్రో రైలు ఆశ్రయించారు. దీంతో ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ వైపు వెళ్లే మెట్రోలో రద్దీ పెరిగింది. అదేవిధంగా పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా వీలైనన్ని ఎక్కువ ట్రిప్పులు నడపాలని మెట్రో యోచించింది. . అసలే ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితం ప్రయాణంతో దివాళా తీస్తున్న మెట్రోకు ఈ పరిణామం ఊపిరిపోయినట్లైంది.

జాతీయ రహదారిపై రద్దీ

ఎన్టీఆర్ జిల్లా నందిగామ-విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై విపరీతమైన రద్దీ నెలకొంది. విజయవాడ వైపు నుంచి హైదరాబాద్​ జాతీయ రహదారిపై వాహనాలు వరుసగా వెళ్తున్నాయి. నందిగామ వై జంక్షన్ వద్ద హైవే విస్తరణ పనులు జరుగుతుండటంతో హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు నిదానంగా వెళ్లాల్సివచ్చింది. దీంతో ఈ ప్రాంతంలో కొంత ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ఓటర్లు శనివారం ఉదయాన్నే హైదరాబాద్ నుంచి ఏపీకి చేరుకుని శని, ఆదివారాల్లో ఇక్కడే ఉండి సోమవారం ఓటేసి తిరిగి హైదరాబాద్​కు బయలుదేరారు. ఈ సారి ఓట్లు వేసేందుకు పెద్ద ఎత్తున జనం తరలిరావడంతో పోలింగ్ కేంద్రాల్లోనూ ఓటర్ల వరుసలతో బార్లు తీరారు. పోలింగ్ శాతం కూడా గణనీయంగా పెరిగింది. 80 శాతం నమోదవడంలో హైదరాబాద్ లో స్థిరపడిన ఆంధ్రుల ప్రభావం ఎంతో అర్థమవుతుంది.

Publisher : Swetcha Daily

Latest

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Don't miss

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర పోషించిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌‌ ఇటు పాలిటిక్స్‌లో అటూ మూవీస్‌లో రాణిస్తున్నారు. రాజకీయాల్లో, సినిమాల్లో రెండింటిలో పవన్ కళ్యాణ్‌కు...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్, భట్టి - సింగరేణికి అండగా నిలవండి - పెండింగ్ ప్రాజెక్టులపై తేల్చేయండి - పెండింగ్ విభజన హామీలను నెరవేర్చండి - కొత్త విద్యాసంస్థలు ఏర్పాటు అవసరం -...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా ఈటలకు ప్రేమ తగ్గినట్టు లేదు - పార్లమెంట్‌లో బీఆర్ఎస్‌ను జీరో చేశామన్న రేవంత్ రెడ్డి Eatala Rajender: ఫిరాయింపులపై బీజేపీ ఎంపీ ఈటల...