An actress who entered married life
Cinema

Actress Wedding : వైవాహిక జీవితంలోకి ఎంట్రీ ఇచ్చిన నటి

An Actress Who Entered Married Life : తెలుగు ఆడియెన్స్‌కి సుపరిచితమైన సినీ నటి మీరా చోప్రా వైవాహిక జీవితంలోకి ఎంట్రీ ఇచ్చారు. రాజస్థాన్‌ రాష్ట్రం జైపూర్‌లోని ఓ రిసార్ట్‌లో ఆమె వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. మంగళవారం ఆమె ప్రముఖ వ్యాపారవేత్త రక్షిత్ కేజ్రీవాల్‌ను పెళ్లి చేసుకున్నారు. ఈ వేడుకలకు సినీ ప్రముఖులతో పాటు పలువురు వ్యాపారవేత్తలు హాజరయ్యారు. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

నటి మీరా చోప్రా గతకొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. ఈ విషయాన్ని కొన్ని నెలల క్రితం స్వయంగా మీరానే ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు చెప్పింది. కానీ.. వరుడు ఎవరనేది మాత్రం అనౌన్స్‌ చేయలేదు. తాము సంప్రదాయక హిందూ పద్దతిలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఆమె పేర్కొంది.

Read More: పాకిస్థాన్‌లో లక్షలు సంపాదిస్తున్న నాగార్జున, ఎందుకంటే..?

ప్రముఖ నటి ప్రియాంక చోప్రాకు బంధువైన మీరా ఆమెను తన పెళ్లికి కచ్చితంగా ఆహ్వానిస్తానని కూడా తెలిపింది. ‘వాళ్లు ఫ్రీగా ఉంటే వస్తారంటూ యాంకర్ అడిగిన మరో ప్రశ్నకు రిప్లై ఇచ్చింది. మీరా చోప్రా తండ్రి సురేశ్ చోప్రా, ప్రియాంక చోప్రా తండ్రికి కజిన్ అవుతారు.

పవన్ కల్యాణ్ సరసన ‘బంగారం’ మూవీలో హీరోయిన్‌గా మీరా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ‘వాన’, ‘మారో’, ‘గ్రీకువీరుడు’ వంటి పలు చిత్రాలతో తెలుగు ఆడియెన్స్‌కు మరింత దగ్గరయ్యింది. తమిళ మూవీస్‌లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా మంచి మార్కులను కొట్టేసి.. తారలా మెరిసింది. మోడలింగ్‌తో తన కెరీర్ ప్రారంభించిన మీరా ఆ తరువాత దక్షిణాది నుంచి బాలీవుడ్‌ వైపు మళ్లింది. చివరిసారిగా ఆమె జీ5 ఫిలిమ్స్‌కు చెందిన సఫేద్ చిత్రంలో కనిపించింది.