Sunday, September 15, 2024

Exclusive

Congress Party : నేతల దారులన్ని తెలంగాణ కాంగ్రెస్ వైపే..

All Routes Lead To Telangana Congress Party: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత విపక్షాల నుంచి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. వరుస చేరికలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం కళకళలాడుతోంది. నిన్నటిదాకా వేచి చూద్దామనే ధోరణిని అవలంబించిన నేతలంతా పార్లమెంటు ఎన్నికల షెడ్యూలు విడుదల కావటానికి ముందే కాంగ్రెస్ పార్టీలో తమ లైన్ క్లియర్ చేసుకుంటున్నారు. వీరిలో ఆదినుంచీ కేసీఆర్‌తో ప్రయాణించిన నేతలూ ఉండటం విశేషం. ఇదిలా ఉంటే, విపక్ష బీఆర్ఎస్ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిగా మారింది. కళ్లముందే నేతలంతా కారుదిగి, హస్తం గూటికి చేరుతున్నా, వారిని పల్లెత్తు మాట అనలేని దుస్థితి. వీరిలో మెజారిటీ నేతలు.. గతంలో కాంగ్రెస్‌లో పనిచేసిన వారు కాగా, మెజారిటీ నేతలు ఉద్యమకాలం నుంచి కేసీఆర్ వెంటనడిచి అక్కడి నియంతృత్వ ధోరణిని తట్టుకోలేక బయటపడుతున్నారు.

మాజీ సీఎం కేసీఆర్​ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్​నియోజకవర్గం నుంచే ముందుగా వలసలు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ముందుగా రాష్ట్ర సర్పంచ్‌ల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్, మనోహరాబాద్ సర్పంచ్​మహిపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరటం, ఆ వెంటనే తూప్రాన్​ మున్సిపల్​వైస్​చైర్మన్​నందాల శ్రీనివాస్‌తోపాటు మరో ఏడుగురు బీఆర్ఎస్​కౌన్సిలర్లు కాంగ్రెస్ గూటికి చేరారు. దుబ్బాక అసెంబ్లీ సెగ్మెంట్‌లోని చేగుంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ప్రవీణ్​కుమార్, మండల కోఆప్షన్ మెంబర్ మహ్మద్ అలీ, చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్ బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. మెదక్ మున్సిపల్ కౌన్సిలర్లు కొందరు బీఆర్ఎస్‌ను వీడుతారనే ప్రచారం జరుగుతోంది. అలాగే జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ కారు దిగి కమల తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే.

Read More: ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌పై రియాక్షన్స్

మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోనూ కారుదిగే నేతల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. పెద్దపల్లి సిట్టింగ్ బీఆర్ఎస్ ఎంపీ వెంకటేశ్ నేత, సిర్పూర్ కాగజ్ నగర్ తాజా మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పలు కారుదిగి కాంగ్రెస్‌లో చేరిపోయారు. కాగా.. మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తాజాగా ఇదే దిశగా ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. వీరుగాక జెడ్పీ ఛైర్మన్ జనార్ధన్ రాథోడ్, డిసిసిబి చైర్మన్ అడ్డిబోజారెడ్డి గాక పలువురు జెడ్పీటీసీలు, ఎంపీపీలు కాంగ్రెస్ బాట పట్టారు. బెల్లంపల్లిలో 20 మంది బిఆర్ఎస్ కౌన్సిలర్లు ఒకేరోజు కాంగ్రెస్ కండువా కప్పుకోగా, మంచిర్యాల మున్సిపాలిటిలోనూ 15 మంది కౌన్సిలర్లు ఇదే బాటన పయనించారు. ఆదిలాబాద్ మాజీ ఎంపీ గోడెం నగేశ్‌ కారు దిగి, కమల తీర్థం పుచ్చుకున్నారు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి మున్సిపాలిటీలో 17 మంది బీఆర్ఎస్​ కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరారు. బోధన్, ఆర్మూరు మున్సిపాలిటీలు అనధికారికంగా హస్తం చేతికి చేరాయి. కామారెడ్డి మున్సిపాలిటీలో 12 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరారు. బాల్కొండలో మాజీ స్పీకర్ సురేశ్​రెడ్డి ముఖ్య అనుచరుడు జక్క రాజేశ్వర్, మరో ముఖ్యనేత కొట్టాల చిన్నారెడ్డి కారు దిగి కాంగ్రెస్‌లో చేరారు. బోధన్‌లో మాజీ ఎమ్మెల్యే షకీల్ అనుచరుడు అల్లె జనార్ధన్,​పలువురు తాజా మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా, నిజామాబాద్ సిటీలో మాజీ డిప్యూటీ మేయర్​ఫయీం ఎంఐఎం నుంచి కాంగ్రెస్‌లో చేరారు. నిజామాబాద్ రూరల్‌లో డిచ్‌పల్లి, ధర్పల్లి, సిరికొండ మండల గులాబీ నేతలు కాంగ్రెస్ బాట పట్టారు. చివరగా.. కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవితతో పొసగని.. నిజమాబాద్ మాజీ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా కూడా కాంగ్రెస్ వైపు చూస్తు్న్నట్లు తెలుస్తోంది.

అటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా.. జమ్మికుంటలో 13 మంది‌ కౌన్సిలర్లు కాంగ్రెస్ ‌పార్టీలో చేరగా, చొప్పదండి, మానకొండూర్, వేములవాడ సెగ్మెంట్లలోని ద్వితీయ శ్రేణి నేతలూ ఇదే బాట పట్టారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, వికారాబాద్ జెడ్పీ ఛైర్మన్ అనితా రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు, జెడ్పీ ఛైర్మన్ సునీతారెడ్డి అనుచరులతో కాంగ్రెస్ జెండా కప్పుకోగా, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తన మనసులోని మాటను బయటపెట్టారు.

హైదరాబాద్ జిల్లాలో మాజీ మేయర్ హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఆయన భార్య, చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, కేటీఆర్ ప్రధాన అనుచరుడిగా పేరొందిన బోరబండ కార్పొరేటర్, మాజీ డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్ కాంగ్రెస్ గూటికి చేరారు. వీరుగాక.. సుమారు 40 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ వైపు చూస్తు్న్నట్లు సమాచారం. ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన దానం కాంగ్రెస్‌ పాలనను అదేపనిగా పొగిడారు. సీఎంగా రేవంత్ రెడ్డి పనితీరును ఆయన మెచ్చుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రోజూ పండగలాగే ఉందని వ్యాఖ్యానించారు. తాజాగా మాజీమంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే డీకే శివకుమార్‌తో భేటీ కావటం, తమకు ఆఫర్ చేసిన మల్కాజ్ గిరి సీటు వద్దంటూ నేరుగా కేటీఆర్‌కే చెప్పటాన్ని బట్టి వారూ కాస్త వెనకా ముందుగా హస్తం గూటికి చేరనున్నట్లు సమాచారం.

Read More: మైనింగ్ ఫైటింగ్, ఎమ్మెల్యే తమ్ముడి అరెస్ట్

ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాజీ మంత్రి తాటికొండ రాజయ్య ఇప్పటికే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా, తాజాగా శుక్రవారం వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. వరంగల్ పార్లమెంటు సీటును కడియం శ్రీహరి కుమార్తె కావ్యకు కేటాయించటంపై అసంతృప్తి చెందిన దయాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. వరంగల్ మేయర్ గుండు సుధారాణి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సంగతి తెలిసిందే. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాచలం సిట్టింగ్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జెడ్పీ చైర్మన్‌ కంచర్ల చంద్రశేఖర్‌ రావు కాంగ్రెస్‌‌లో చేరారు. అటు.. మహబూబ్‌నగర్ జిల్లాలో బీజేపీ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఆయన రేపో మాపో ఆయన పార్టీ మారటం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే నాగర్ కర్నూలు ఎంపీ రాములు బీజేపీలో చేరగా, గులాబీపార్టీ కీలక నేత మన్నె జీవన్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు.

గత ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటిన నల్గొండ జిల్లాలోనూ ఈ ప్రభావం కనిపిస్తోంది. శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సైతం రేవంత్ 100 రోజుల పాలన బాగుందంటూ కితాబివ్వటమే గాక బీఆర్ఎస్ పార్టీలో క్షేత్రస్థాయిలో నిర్మాణ లోపం ఉందంటూ కామెంట్ చేశారు. తన కుమారుడు అమిత్ కాంగ్రెస్‌లో చేరితే బాగుండనే సలహాలు వచ్చాయనీ, కానీ తాము కాంగ్రెస్‌తో ఎలాంటి చర్చలూ జరగలేదని అన్నారు. అయితే, గుత్తా కూడా పాతగూటికే చేరబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే జిల్లాలో నాగార్జున సాగర్ సీటును గతంలో ఆశించిన అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరారు. హుజూర్ నగర్ బీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పిన పార్టీలో చేరిన గంటల వ్యవధిలోనే నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థిత్వం దక్కింది.

తెలంగాణలోని 142 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఉన్నాయి. వీటిలో ఈ నెల రోజుల్లో 34 మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, మేయర్, డిప్యూటీ మేయర్‌ల పదవులకు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టారు. వాటిలో 30 చోట్ల ప్రత్యేక సమావేశాలు జరగ్గా, 15 చోట్ల అవిశ్వాసాలు నెగ్గి, గులాబీ నేతలు పదవుల నుంచి వైదొలగాల్సి వచ్చింది. మిగిలిన 15 చోట్ల నోటిఫికేషన్ల ప్రక్రియ సాగుతోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచిన చోటనే గాక బీఆర్ఎస్ గెలిచిన చోటా ఈ మార్పులు జరగటం విశేషం.

Publisher : Swetcha Daily

Latest

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Don't miss

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర పోషించిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌‌ ఇటు పాలిటిక్స్‌లో అటూ మూవీస్‌లో రాణిస్తున్నారు. రాజకీయాల్లో, సినిమాల్లో రెండింటిలో పవన్ కళ్యాణ్‌కు...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్, భట్టి - సింగరేణికి అండగా నిలవండి - పెండింగ్ ప్రాజెక్టులపై తేల్చేయండి - పెండింగ్ విభజన హామీలను నెరవేర్చండి - కొత్త విద్యాసంస్థలు ఏర్పాటు అవసరం -...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా ఈటలకు ప్రేమ తగ్గినట్టు లేదు - పార్లమెంట్‌లో బీఆర్ఎస్‌ను జీరో చేశామన్న రేవంత్ రెడ్డి Eatala Rajender: ఫిరాయింపులపై బీజేపీ ఎంపీ ఈటల...