Saturday, May 18, 2024

Exclusive

Adulteration: కల్తీని అరికట్టాలి.. పోషకాహారాన్ని అందించాలి!

అసమానతలు, అంతరాలు, వివక్షత కారణంగా మిగతా ప్రజలతో పోటీ పడలేక నాణ్యమైన జీవితం, విద్య, వైద్యం, సామాజిక న్యాయాన్ని పొందలేక ఆకలితో అలమటిస్తూ పేదరికంలో కొట్టుమిట్టాడుతూ అనారోగ్యం బారిన పడుతున్నటువంటి కోట్లాది పీడిత ప్రజానీకానికి ప్రణాళికాబద్ధంగా తగు న్యాయం చేయడానికి ఉద్దేశించినదే ప్రజా పంపిణీ వ్యవస్థ. అనేక పథకాల ద్వారా ఈ వర్గాలను ఆర్థికంగా, సాంఘికంగా, అన్ని రకాలుగా ఆదుకోవడానికి ఒకవైపు కృషి చేస్తూనే ఆహార ధాన్యాలను, నాణ్యమైనటువంటి తిను బండారాలను, పోషకాహారాన్ని పేద వర్గాలకు అందించవలసిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రధానంగా ఉన్నది. కరోనా సమయంలో రోగ నిరోధక శక్తి లోపించిన కారణంగానే వ్యాధి సోకుతున్నదని అనేక నివేదికలు వెల్లడించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం టీకాలు, రేషన్ బియ్యంతోనే సరిపెట్టి పిడికెడు మెతుకులు రెండు పూటలా తినలేనటువంటి వారి కోసం ఏ రకమైనటువంటి పౌష్టికాహారాన్ని అందించే ప్రయత్నం చేయలేదు అనే విమర్శ ఉంది. అంతే కాదు, కరోనా సమయములో పేదలు, చిరు వ్యాపారులు, కూలీలు, కార్మికులు, కర్షకుల యొక్క ఆదాయం గణనీయంగా తగ్గిపోతే పనులు లేక పస్తులుండి ఇబ్బందులకు గురైతే పెట్టుబడిదారుల ఆదాయం మాత్రం రెట్టింపు అయినట్లు ప్రభుత్వ గణాంకాలే తెలియజేస్తున్నాయి. కరోనా సమయములో ఆనాడు ఉన్నటువంటి సంక్షోభాన్ని పెట్టుబడిదారి వర్గాలు అవకాశంగా వాడుకున్నట్లేనని దీన్ని బట్టి అర్థం అవుతోంది. ఆర్థికంగా, సామాజికంగా, ఆరోగ్యంగా చితికిపోయినటువంటి పేద వర్గాలకు ఇప్పటికైనా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నాణ్యమైనటువంటి తినుబండారాలు, ఆహార పదార్థాలు, పోషకాహారాన్ని సరఫరా చేయడానికి కేంద్రం చొరవ తీసుకుంటే మంచిది. కానీ, మొక్కుబడిగా 81 కోట్ల మంది ప్రజానీకానికి రేషన్ బియ్యం వరకే సరఫరా చేస్తున్నట్లు, మరో నాలుగు సంవత్సరాల పాటు కొనసాగిస్తామని ప్రకటించినంత మాత్రాన ఆ వర్గాలకు పిడికెడు మెతుకులు తప్ప నాణ్యమైన సదుపాయాలు అందే అవకాశం ఉండదు.

మొదట్లో దారిద్ర్య రేఖ దిగువనున్న ప్రజలను ఆదుకునేందుకు చౌక ధరలకు ఆహార ఉత్పత్తులు అందించే ప్రజా పంపిణీ వ్యవస్థ ఏర్పడితే, ప్రస్తుతం కుటుంబ సభ్యులకి ఐదు కిలోల చొప్పున కేంద్రం బియ్యాన్ని సరఫరా చేస్తూ ఇతర అన్ని రకాల ఉత్పత్తులను ఆపివేశారు. ఇప్పటికీ దేశంలో 30 నుండి 40 శాతం పేదరికంలో ఉంటే దారిద్ర్య రేఖ దిగువన జీవిస్తున్న వాళ్లు 15 శాతంగా ఉన్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇక వలస కార్మికులు కోట్లాది మంది తమకు నివాసమంటూ లేకుండా పని కోసం దేశమంతా పర్యటిస్తూ ఎలాంటి ఖచ్చితమైన ఆదాయ అవకాశాలు లేకుండా దుర్భర పరిస్థితులు గడుపుతున్న విషయానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. 1929లో వచ్చిన ఆర్థిక మాంద్యం, రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఆహార ధాన్యాల కొరత ఏర్పడింది. 1960లో పేద, మధ్య తరగతి ప్రజల కోసం దేశవ్యాప్తంగా 50 వేల రేషన్ షాపులను ఏర్పాటు చేసినట్లు అవి 1991 నాటికి 30 లక్షల 50 వేలకు పెరిగినట్లు తెలుస్తున్నది. పేద వర్గాలను దారిద్ర్య రేఖ దిగువన ఉన్నవాళ్ళు, ఎగువన ఉన్నవాళ్లు అని రెండు వర్గాలుగా విభజించడంతోపాటు 2000 సంవత్సరంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన అంత్యోదయ పథకం ద్వారా కోటి నుంచి రెండు కోట్ల కుటుంబాలకు వర్తింపజేశారు. ఈ పథకం కింద కుటుంబానికి 25 కిలోల బియ్యం లేదా గోధుమలను ప్రకటించడం జరిగినప్పటికీ దక్షిణ భారతదేశంలో గోధుమల ప్రస్తావన లేదు. అత్యంత సంపన్నులైన కుటుంబాలలో కూడా 20 నుండి 25 శాతం వరకు రేషన్ కార్డులు కలిగి ఉన్నారంటే వాటి జారీ లోపాల్లో ఎంత అవినీతి జరిగిందో, నిజమైన లబ్ధిదారుల ఎంపిక ఎంత లోపభూయిష్టమో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు 2020 నాటికి బిలో పావర్టీ లైన్‌కు అర్హత ఉన్న కుటుంబాలలో కేవలం 59 శాతం మందికి మాత్రమే రేషన్ కార్డులు ఉన్నట్టు తెలుస్తుంటే ఇవి కూడా 2011 జనాభా లెక్కల ప్రకారంగా అమలు చేస్తున్న కారణంగా గత 13 సంవత్సరాలుగా జనాభా లెక్కలు లేకపోవడంతో పాటు ఇతర కారణాల వలన సుమారు 40 శాతం మందికి రేషన్ కార్డులు ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది.

Also Read: బాచుపల్లి ఘటనపై సీఎం రేవంత్ సీరియస్.. క్రిమినల్ కేసు నమోదు

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రైతుల నుండి ధాన్య సేకరణతో పాటు అవసరమైన వర్గాలకు ఆహార ధాన్యాలను సరఫరా చేసే గురుతరమైన బాధ్యతలు కలిగి ఉన్నప్పటికీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కోతల కారణంగా ఎఫ్సీఐకి ఇస్తున్న నిధులు చాలా తగ్గిపోయినట్లు, బకాయిలు చెల్లించకపోవడంతో కార్యక్రమాలు తగ్గుముఖం పట్టినట్లు తద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థకు తీవ్రమైన అంతరాయం ఏర్పడినట్లుగా తెలుస్తున్నది. మరోవైపు, నిధులను కేటాయించకుండా ప్రజలు చెల్లించిన జాతీయ పొదుపు మొత్తాల నుండి 2019 -20 సంవత్సరాల మధ్యన 2,54,600 కోట్ల విలువైన రుణాలు ఈ సంస్థకు కేంద్రం చెల్లించింది. అంటే, ప్రజల సొమ్ము ఏ విధంగా మళ్ళించబడుతున్నదో అర్థం చేసుకోవచ్చు. ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడానికి చర్యలు, అర్హులైన వారికి కార్డులు జారీ చేయడంతో పాటు కేవలం బియ్యాన్ని మాత్రమే కాకుండా గోధుమలు ఇతర పప్పులు, చిరు ధాన్యాలు నూనెలు వంటి వాటిని చౌక ధరలకు పేద వర్గాలకు అందించినప్పుడు మాత్రమే ప్రజాపంపిణీ వ్యవస్థకు అర్థం ఉంటుంది. కేవలం ఐదు కిలోల బియ్యంతో సరిపెట్టి దానినే పెద్దగా ప్రచారం చేసుకుంటే ప్రయోజనం లేదు. భవిష్యత్తులో పేద వర్గాలు అనారోగ్యం బారిన పడకుండా ఉండడానికి పౌష్టికాహారాన్ని ఇతర రోగ నిరోధక ఫుడ్ సప్లమెంట్ సరఫరా చేయవలసిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం పైన ఉన్నది. ఇప్పటికీ విద్యకు వైద్యానికి కేంద్రం తన బడ్జెట్లో సుమారు రెండు శాతం కూడా దాటడం లేదంటే ఆ వర్గాలకు ప్రయోజనం లేనట్లే కదా. భారత ఆహార సంస్థ తన కార్యకలాపాలను స్వతంత్రంగా నిర్ణయించడానికి నిధులను పెద్ద మొత్తంలో బడ్జెట్లో కేటాయించాలి. దేశవ్యాప్తంగా ధాన్య సేకరణ బాధ్యతను ఆ సంస్థకి అప్పగించాలి. ప్రత్యేక పథకాల ద్వారా బీపీఎల్ కుటుంబాలకు ఆర్థిక సామాజిక ప్రయోజనాలను అందించడంతోపాటు ఉపాధి ఉద్యోగ అవకాశాలలో ప్రాధాన్యత కల్పించడం ద్వారా దారిద్ర్య రేఖ ఎగువకు వస్తారు. కూలీలుగా శ్రమను నమ్ముకుని బతికే కోట్లాది ప్రజానీకానికి ఈ దేశంలో ఉన్నటువంటి మిగులు భూములను సరఫరా చేసి అలాగే 40 శాతం సంపద కేవలం ఒక శాతం సంపన్న వర్గాల చేతిలో పోగు పడిన విధానాన్ని ఎండగట్టాలి. ఆ సంపదను ఇతర దేశాలలోని నల్లధనాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పేద కుటుంబాలకు ప్రాధాన్యత క్రమంలో అందించడం ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థ అంటే కేవలం బియ్యం సరఫరా అనే కాదు నిధుల మళ్లింపు, ఆర్థిక సామాజిక ప్రయోజనాలను సమకూర్చడం, పోషకాహారాన్ని అందించడం, అసమానతలు అంతరాలను నిర్మూలించడానికి ఒక వేదికగా ఉపయోగపడుతుంది. అర్హులైన వాళ్లందరికీ కార్డులు జారీ చేయడంతో పాటు అనర్హులను జాబితా నుండి తొలగించడం ద్వారా నిజమైనటువంటి పేదలకు కొంతవరకైనా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది.

ప్రస్తుతం ఏం తినాలన్నా ఏమి కొనాలి అన్న అంతా కల్తీ మయమైంది. విషతుల్యమవుతున్న నిత్యావసర వస్తువులు, నూనెలు, పండ్లు, పాలు, ఇలా అన్నీ నాసిరకమని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆహార సలహా సంఘాలు, అధికారుల నిఘా, విస్తృత తనిఖీలు వీటిపై తప్పనిసరిగా ఉండాలి. ఒకవైపు నిత్యావసర వస్తువులు, తినుబండారాల ధరలు భారీగా పెరగడంతో హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, ఇతర తిను బండారాల కేంద్రాల వ్యాపారులు కల్తీ వైపు మొగ్గుచూపుతున్నట్లు కొన్ని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఇటీవల ముఖ్యంగా టిఫిన్ సెంటర్లు, హోటళ్లు, తిను బండారాల కేంద్రాల వైపు ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతున్న కారణంగా హోటల్ కల్చర్ మితి మీరిపోయి అతి విశ్వాసంతో కొనుగోలు చేయడం వినియోగించడం వల్ల కూడా కల్తీ వ్యాపార కేంద్రాల సంఖ్య పెరుగుతూ ఉంటే అనారోగ్యం బారిన పడే ప్రజల సంఖ్య కూడా రోజురోజుకు మించిపోవడం ఆందోళన కలిగిస్తున్న విషయం. ఇది కేవలం కొన్ని పట్టణాలకు మాత్రమే పరిమితం కాకపోగా గ్రామాలతో సహా అన్ని ప్రాంతాలకు కూడా విస్తరించడం, ఇలాంటి తినుబండార కేంద్రాలపైన అనేక మంది ఆధారపడి బతుకుతున్న నేపథ్యంలో వీటి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కారం పొడిలో ఇటుక పొడి, పసుపులో బియ్యం పిండి కలుపుతారని అనేక సందర్భాలలో మనం విన్నాం. అలాగే పాల పొడిలో నీళ్లు కలిపితే చిక్కటి పాలు, అరటి కాడ గుజ్జుతో అల్లం, వెల్లుల్లి పేస్టు, రసాయనాలు కలిపితే నిగనిగలాడే పండ్లు, నాణ్యతలేని నూనెతో బిర్యానీ వంటకాలు, వేపుళ్ళు, నూడుల్స్ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కల్తీలు. ఆకర్షణీయమైన ప్యాకింగ్‌తో కల్తీ వస్తువులను ప్రజలకు అంటగడుతుంటే నాగరికత ముసుగులో ఈ సంస్కృతి మితిమీరిపోవడం ప్రాణాల మీదికి తెచ్చుకోవడమే. ఈ విషయాన్ని అందరం ఆలోచించాలి. నిరసన తెలిపి నిలదీసి నాణ్యతను ప్రశ్నించాలి. ఇదే సందర్భంలో ప్రభుత్వపరంగా తనిఖీలు, నమూనాల సేకరణ ఎప్పటికప్పుడు జరుగుతూ ఉండాలి. ప్రతి తినుబండారం నాణ్యత ప్రమాణాలను పాటించే విధంగా నిబంధనలను అతిక్రమించిన సందర్భంలో తనిఖీలు చేసి చర్యలు తీసుకుంటే తిరిగి పునరావృతం అయ్యే అవకాశం ఉండదు. అనేక సందర్భాలలో ప్రజలు ఫిర్యాదులు చేసినప్పటికీ చర్యలు తీసుకోవడం లేదని ఎంతోమంది వాపోతున్నారు. సంపన్నుల నుండి కూలీల వరకు వివిధ పనులపైన బయటకు వెళ్లిన సందర్భంలో అవసరాన్ని బట్టి టీ, టిఫిన్, భోజనం, హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్, బేకరీలు, రెస్టారెంట్లకు వెళ్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అతిగా ఆకర్షించడానికి తిను బండారాలలో కలుపుతున్న రంగులు, రసాయనిక పదార్థాల కారణంగా క్యాన్సర్ గుండె జబ్బులు ఇతర ప్రాణాంతకమైనటువంటి రోగాల బారిన పడక తప్పడం లేదు.

Also Read: Black Money: మోదీ సెల్ఫ్ గోల్..!

ప్రజలు కూడా ఆహార పదార్థాల విషయంలో అవగాహన పెంపొందించుకొని కల్తీకి దూరంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. బహిష్కరించడం, నిఘా వేయడం, ప్రశ్నించడం, స్థానికంగా కొన్ని రకాల నిరసనలు ఉద్యమాలను లేవదీయడం ద్వారా కూడా ఇలాంటి అకృత్యాలకు అడ్డుకట్ట వేయవచ్చు. ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం అనేది ప్రజలతోపాటు వ్యాపారస్తులకు కూడా పెద్ద విషయం అయింది. దానిని అడ్డుకోవడానికి, కల్తీ నివారించడానికి నిత్యావసర సరుకుల ధరలను క్రమంగా తగ్గించడంతోపాటు నాణ్యతా ప్రమాణాలపైన సీరియస్‌గా ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవలసిన బాధ్యత ఉన్న ప్రభుత్వాలు కల్తీ ఆహార పదార్థాలు మార్కెట్లో విచ్చలవిడిగా విక్రయించబడుతుంటే చూస్తూ ఊరుకోవడం, పత్రికల్లో మీడియాలో ప్రసారమైనా కూడా చర్యలు తీసుకోకపోవడం అంటే ప్రభుత్వ నిర్లక్ష్యం మాత్రమే కాదు అలాంటి తప్పుడు వ్యాపారస్తులతో అధికారులు కుమ్మక్కైనట్లే లెక్క. కల్తీ అరాచకాలను నిగ్గదీసి అడిగినప్పుడే అంతమవుతాయి. ఆరోగ్యకరమైన తినుబండారాలు ఆహార పదార్థాలు అన్నిచోట్లా దర్శనమిస్తాయి. ఈ మార్పును సాధించే వరకు ఉద్యమిస్తూనే ఉండాలి.

డాక్టర్ రక్కిరెడ్డి ఆదిరెడ్డి
కాకతీయ విశ్వవిద్యాలయం

Publisher : Swetcha Daily

Latest

BJP: సీఎం రేవంత్‌ను కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు.. ఎందుకు కలిశారు?

CM Revanth: రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీల మధ్య రాజకీయ వైరం...

LS Polls: ఆరో విడతలో 889 మంది అభ్యర్థులు.. 25న పోలింగ్

Lok Sabha Elections: సార్వత్రిక ఎన్నికల్లో ఆరో విడతకు సంబంధించి నామినేషన్ల...

Bharati Builders: భారతి.. భూముల హారతి!

- అప్పుడు పుప్పాలగూడ.. ఇప్పుడు కొంపల్లి..! - హైదరాబాద్‌లో మరో ప్రీ లాంచ్...

Cabinet Meeting: కేబినెట్‌ భేటీకి ఈసీ ‘నో’.. ‘అవసరమైతే ఢిల్లీకి వెళ్తాం’

- కేబినెట్ సమావేశానికి బ్రేక్ - పర్మిషన్ ఇవ్వని ఈసీ -...

RGV: సీఎం రేవంత్ రెడ్డిపై ఆర్జీవీ ట్వీట్

CM Revanth Reddy: ప్రముఖ సినీ దర్శకుడు ఆర్జీవీ గత కొంతకాలంగా...

Don't miss

BJP: సీఎం రేవంత్‌ను కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు.. ఎందుకు కలిశారు?

CM Revanth: రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీల మధ్య రాజకీయ వైరం...

LS Polls: ఆరో విడతలో 889 మంది అభ్యర్థులు.. 25న పోలింగ్

Lok Sabha Elections: సార్వత్రిక ఎన్నికల్లో ఆరో విడతకు సంబంధించి నామినేషన్ల...

Bharati Builders: భారతి.. భూముల హారతి!

- అప్పుడు పుప్పాలగూడ.. ఇప్పుడు కొంపల్లి..! - హైదరాబాద్‌లో మరో ప్రీ లాంచ్...

Cabinet Meeting: కేబినెట్‌ భేటీకి ఈసీ ‘నో’.. ‘అవసరమైతే ఢిల్లీకి వెళ్తాం’

- కేబినెట్ సమావేశానికి బ్రేక్ - పర్మిషన్ ఇవ్వని ఈసీ -...

RGV: సీఎం రేవంత్ రెడ్డిపై ఆర్జీవీ ట్వీట్

CM Revanth Reddy: ప్రముఖ సినీ దర్శకుడు ఆర్జీవీ గత కొంతకాలంగా...

Freebies: ఉచితాల రాజకీయం ఇంకెన్నాళ్లో?

Welfare Schemes: తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుకు విపక్షాలు ప్రభుత్వం మీద ఒత్తిడిని పెంచే ప్రయత్నాల్లో ఉన్నాయి. అయితే, బీఆర్ఎస్ ప్రభుత్వం పోతూపోతూ ఖాళీ...

పౌర సమాజ చైతన్యమే తెలంగాణకు రక్ష..

మరో పక్షం రోజుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తి కావస్తోంది. అమరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ ఈ పదేళ్ల కాలంలో చెప్పుకోదగ్గ విజయాలను సాధించిందనేది ఎవరూ కాదనలేని వాస్తవం....

Israel: ఈ భీకర యుద్ధం ఆగేదెప్పుడో…?

Israel Hamas War Palestine Conflict Gaza Air Strikes Bombings Land Operations: పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య మొదలైన యుద్ధం బుధవారం నాటికి 222 రోజులకు చేరింది. ఈ ఏడున్నర...