Tuesday, December 3, 2024

Exclusive

Lok sabha Elections: ఆదిలాబాద్ లోక్‌సభ స్థానంపై ప్రధాన పార్టీల దృష్టి

– గెలుపుకోసం హస్తం పార్టీ వ్యూహాలు
– సీటు నిలుపుకునేందుకు బీజేపీ తంటాలు
– ఉనికి చాటుకునేందుకు గులాబీ పార్టీ తిప్పలు
– ముగ్గురు ప్రధాన అభ్యర్థులూ టీచర్లే
– జోరందుకుంటున్న ప్రచారం
– కాంగ్రెస్- బీజేపీల మధ్యే కీలక పోరు

Adilabad Lok Sabha MP Election news(political news in telangana): లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణలో ఆదివాసీల గడ్డగా పేరున్న ఆదిలాబాద్ స్థానంమీద ప్రధాన పార్టీలన్నీ దృష్టి సారించాయి. ఒకప్పుడు ఎడ్లవాడగా ప్రాచుర్యంలో ఉన్న ఈ ఊరు బీజాపూర్ సుల్తాన్ మహమ్మద్ ఆదిల్ షా పాలనలో ఆదిలాబాద్‌గా మారింది. తెలంగాణలో అత్యధికంగా అటవీ ప్రాంతం ఉన్న జిల్లాగా ఉమ్మడి ఆదిలాబాద్ పేరు పొందింది. మహారాష్ట్ర సరిహద్దులోని ఈ ఎస్టీ రిజర్వుడ్ స్థానంలో ఆదివాసులే గెలుపోటములను నిర్ణయించబోతున్నారు. గోండు, నాయక్‌పొట్, కొలామ్, లంబాడీ తెగల ఆధిపత్యం గల ఈ స్థానంలో ఈసారి కాంగ్రెస్,బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు గోండు వర్గానికి చెందిన అభ్యర్థులనే రంగంలోకి దించాయి. ఆదిలాబాద్ పార్లమెంటరీ స్థానం పరిధిలో సిర్పూర్ కాగజ్ నగర్, ఆసిఫాబాద్, ఖానాపూర్, ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ముథోల్ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. తొలి పార్లమెంటు ఎన్నికల్లో (1952)లో ఉనికిలోకి వచ్చిన ఈ సీటు దశాబ్దాల పాటు కాంగ్రెస్ కంచుకోటగా నిలిచిన ఈ స్థానంలో ఇప్పటివరకు కాంగ్రెస్ 8 సార్లు, టీడీపీ 6 సార్లు, బీఆర్ఎస్ 2 పర్యాయాలు, బీజేపీ , సోషలిస్ట్ పార్టీలు ఒక్కోసారి గెలిచాయి.

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ పరిధిలోని ఏడు శాసనసభ స్థానాల్లో బీజేపీ 4, బీఆర్ఎస్ 2 , కాంగ్రెస్ 1 సీటు దక్కించుకున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి సోయం బాపూరావుకు 3,77,374 ఓట్లు.. బీఆర్ఎస్ అభ్యర్ధి జి. నగేష్‌కు 3,18,814 ఓట్లు.. కాంగ్రెస్ అభ్యర్ధి రమేశ్ రాథోడ్‌కు 3,14,238 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా బీజేపీ 58,560 ఓట్ల తేడాతో గెలిచింది. అయితే, 2023 నాటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సీటు పరిధిలోని ఎమ్మెల్యే స్థానాల్లో బీజేపీ 4, బీఆర్‌ఎస్‌ 2, కాంగ్రెస్‌ 1 సీటు దక్కించుకోగా, పార్లమెంట్‌ పరిధిలో గులాబీ పార్టీకి 35.92%, బీజేపీ 34.64%, కాంగ్రెస్‌ 19.47% ఓట్లను సాధించాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ తన సిట్టింగ్ ఎంపీ సోయం బాపూరావును పక్కనబెట్టి మాజీ ఎంపీ గోడం నగేశ్‌ను బరిలోకి దింపింది. కాంగ్రెస్‌ ఆదివాసీ టీచర్ ఆత్రం సుగుణకు టికెట్‌ ప్రకటించగా, ఆసిఫాబాద్‌ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పేరును బీఆర్‌ఎస్‌ ప్రకటించింది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకు పోతున్నారు.

ముగ్గురూ మాజీ టీచర్లే

కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో నిలిచిన ఆత్రం సుగుణ 2008 నుండి గవర్నమెంట్ టీచరుగా ఉన్నారు. ఈమె భర్త కూడా సర్కారీ టీచరే. తాజాగా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న సుగుణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరి, టికెట్ సాధించారు. 1952 నుంచి ఈ సీటులో ఒక్క మహిళా అభ్యర్థి కూడా పోటీ చేయలేదు. దీంతో ఆదిలాబాద్ తొలి మహిళా ఎంపీ అభ్యర్థిగా సుగుణ రికార్డుకెక్కారు. బీజేపీ అభ్యర్థి జి. నగేష్ బోథ్ అసెంబ్లీ పరిధిలోని జాతర్ల గ్రామానికి చెందిన నగేష్ గవర్నమెంటు టీచరుగా పనిచేస్తూ, 1994లో రిజైన్ చేసి టీడీపీలో చేరి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలవటమే గాక గిరిజన శాఖ మంత్రిగానూ పనిచేశారు. 2014లో గులాబీ కండువా కప్పుకుని నాటి ఎంపీ ఎన్నికల్లో గెలిచారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కు కూడా 1993 – 2008 వరకు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని 2009 నాటి ఎన్నికల్లో ఆసిఫాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి నెగ్గారు. 2018లో మరోసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచినా, వెంటనే బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఈయన సీటు వేరే వారికి కేటాయించిన కేసీఆర్, తాజాగా ఎంపీ సీటిచ్చారు.

హస్తం చక్రవ్యూహం

2008లో చివరి సీటు తాము గెలుచుకున్న ఈ సీటును ఎలాగైనా గెలుచుకునేందుకు కాంగ్రెస్ చక్రవ్యూహం రచిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఎంపీ సీటు పరిధిలోని ఖానాపూర్‌కే పరిమితమైన కాంగ్రెస్, మూడు అంశాల మీద ప్రధానంగా ఫోకస్ పెట్టింది. గత అసెంబ్లీ ఎన్నికల వేళ ఇంద్రవెల్లిలో గిరిజన, ఆదివాసీ డిక్లరేషన్‌ను ప్రారంభించిన కాంగ్రెస్ ఈసారి వ్యూహాత్మకంగా తొలిసారి మహిళా అభ్యర్థిని తెరమీదికి తెచ్చింది. దీనికి తోడు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పోడు భూముల పరిష్కారం, సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్న పెద్దసంఖ్యలో మైనారిటీల మద్దతూ తనకే దక్కుతుందని హస్తం పార్టీ అంచనా వేస్తోంది. ఇప్పటికే సిర్పూర్ తాజా మాజీ కోనేరు కోనప్ప, జెడ్పీ ఛైర్మన్ రాథోడ్ జనార్థన్‌, డీసీసీబీ ఛైర్మన్ భోజారెడ్డితో సహా పలువురు జిల్లా, మండల, గ్రామ స్థాయి నేతలు పెద్దసంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరటం, తాజాగా కవిత అరెస్టు, ఫోన్ ట్యాపింగ్ తర్వాత అక్కడి కారు పార్టీ నేతలు హస్తం బాట పట్టారు. గత ఐదేళ్లలో బీజేపీ ఎంపీ చేసిందేమీ లేదనే ప్రచారాన్నీ కాంగ్రెస్ ఇంటింటికీ తీసుకుపోతోంది. ఆదివాసీ వర్గానికే చెందిన మంత్రి సీతక్క గెలుపు బాధ్యత తీసుకోవటం, ఈ సీటులోని 47.8 శాతం ఎస్సీ, ఎస్టీ, ముస్లిం ఓట్లలో మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి దక్కే అవకాశం ఉండటం ఆ పార్టీకి కలిసొచ్చే మరో అంశం.

మోదీ చరిష్మాపై బీజేపీ ఆశలు

2019 నాటి ఎంపీ ఎన్నికల్లో కంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 75 వేలు ఎక్కువ ఓట్లు పొందింది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈ ఎంపీ సీటు పరిధిలోనే నలుగురు ఎమ్మెల్యేలూ గెలవటం ఆ పార్టీకి కలిసొచ్చే అంశాలు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బోథ్‌ బరిలో నిలిచి ఓడిన బాపూరావును తప్పించి వలసనేత నగేష్‌కు టికెట్ ఇవ్వటం ఇక్కడ బీజేపీలో వ్యతిరేకతకు దారితీసింది. అయితే ఢిల్లీ పెద్దల హామీతో బాపురావు మెత్తబడినా, ఏ మేరకు సహకరిస్తారనే దానిపై అనుమానాలున్నాయి. బాపూరావుకు వ్యతిరేకంగా అక్కడి బీజేపీ ఎమ్మెల్యేలు పనిచేయటమూ పార్టీకి తలనొప్పిగా మారుతోంది. మొత్తంగా మోదీ చరిష్మా మీదనే ఇక్కడ పార్టీ ఆధారపడి ముందుకు సాగుతోంది.

ఉనికికై కారు పార్టీ తంటాలు

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ రెండు సీట్లు గెలిచినా, గత ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన మాజీ ఎంపీ గోడం నగేశ్‌ బీజేపీలో చేరటం, ఈ సీటులోని అసెంబ్లీ సెగ్మెంట్లలోని సీనియర్ నేతలూ అధికార పార్టీ వైపు అడుగులు వేయటం పార్టీకి సమస్యగా పరిణమించాయి. కవిత అరెస్టు, ఫోన్ ట్యాపింగ్ తర్వాత ఈ వలసలు మరింత పెరగటం, పార్టీకి అండగా నిలిచిన మైనారిటీ వర్గాలు, ఎంఐఎం నేతలు కాంగ్రెస్‌లో చేరటంతో ఇక్కడ ఉనికిని నిలుపుకునే దిశగా బీఆర్ఎస్ ప్రచారం సాగిస్తోంది. ఆత్రం సక్కుకు టికెట్ ఇవ్వటంపై పార్టీలో వర్గపోరుకు దారితీయటమూ గులాబీ పార్టీకి ఇబ్బందిగా పరిణమించింది.

కీలక అంశాలివే..

మొత్తం 15 లక్షల ఓట్లలో, 1.74 లక్షల ముస్లిం ఓట్లతో బాటు ఒక్క పార్టీ కూడా తమ వర్గానికి టికెట్ ఇవ్వలేదని మండిపడుతున్న లంబాడా వర్గానికి 1.48 లక్షల ఓట్లున్నాయి. వీరు ఎటు మొగ్గితే వారే నెగ్గుతారనే లెక్కలున్నాయి. ఆదిలాబాద్ ఎంపీ స్థానం పరిథిలోని ప్రాంతంలో మొత్తం 9 ఆదివాసీ తెగలున్నాయి. వీటిలో గోండు, లంబాడా వర్గాలకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లభించగా, మిగిలిన పర్ దాన్, తోటి, కోలం, నాయక్ పోడ్ , ఆంద్ తెగలకు ఎన్నికల ప్రాతినిథ్యం నేటికీ దక్కలేదు. దీంతో ఈ 5 తెగల వారు ఒక్కటై పోరాడుతున్నారు. ఈ సీటులో వీరి ఓట్లు సుమారు 1.3 లక్షల వరకు ఉండటం పార్టీలను బెంబేలెత్తిస్తోంది.

Publisher : Swetcha Daily

Latest

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Don't miss

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర పోషించిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌‌ ఇటు పాలిటిక్స్‌లో అటూ మూవీస్‌లో రాణిస్తున్నారు. రాజకీయాల్లో, సినిమాల్లో రెండింటిలో పవన్ కళ్యాణ్‌కు...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్, భట్టి - సింగరేణికి అండగా నిలవండి - పెండింగ్ ప్రాజెక్టులపై తేల్చేయండి - పెండింగ్ విభజన హామీలను నెరవేర్చండి - కొత్త విద్యాసంస్థలు ఏర్పాటు అవసరం -...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా ఈటలకు ప్రేమ తగ్గినట్టు లేదు - పార్లమెంట్‌లో బీఆర్ఎస్‌ను జీరో చేశామన్న రేవంత్ రెడ్డి Eatala Rajender: ఫిరాయింపులపై బీజేపీ ఎంపీ ఈటల...