Adah Sharma
Cinema, ఎంటర్‌టైన్మెంట్

Adah Sharma | ‘ది కేరళ స్టోరీ’ తర్వాత మరో రియల్ స్టోరీతో ఆదా శర్మ

‘ది కేరళ స్టోరీ’తో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక ఆదా శర్మ (Adah Sharma).. ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్టు ‘తుమ్ కో మేరీ కసమ్‌’కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అనుపమ్‌ ఖేర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీని విక్రమ్‌ భట్‌ తెరకెక్కిస్తున్నారు. ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, ఇందిరా ఐవీఎప్‌ వ్యవస్థాపకుడు డా.అజయ్‌ ముర్దియా జీవితంలోని కొన్ని సంఘటనల ప్రేరణతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

తాజాగా ఈ సినిమాను ప్రకటిస్తూ.. ఓ వీడియోను పంచుకుంది చిత్రబృందం. ‘‘ఒక ప్రేమ చరిత్ర సృష్టించింది. కానీ ద్రోహం దాన్ని ఎంతో కాలం నిలవనీయకుండా నాశనం చేసింది’’ అని వ్యాఖ్యల్ని జోడించింది. ఇష్వాక్‌ సింగ్‌ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని మహేశ్‌ భట్‌ నిర్మిస్తున్నారు. మార్చి 21న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.