Actress Kajal Aggarwal Re Entry In Tollywood: టాలీవుడ్ అందాల చందమామగా పేరు సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. లక్ష్మీ కళ్యాణం మూవీతో టాలీవుడ్‌కి పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ. అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్‌గా పేరును సంపాదించుకుంది. అనంతరం వరుస ఛాన్స్‌లు అందుకుని స్టార్ హీరోయిన్‌గా పేరు సంపాదించుకున్న ఈ భామ చివరిసారిగా చిరంజీవి ఆచార్య మూవీలో యాక్ట్ చేసింది. అనంతరం ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేసి భగవంత్ కేసరి మూవీతో సెకండ్ ఇన్నింగ్స్‌తో రీ ఎంట్రీ ఇచ్చింది.
అయితే ఈ మూవీలో కాజల్ రోల్‌కి అంత ఇంపార్టెన్స్ లేకపోవడంతో ఆడియెన్స్ ఆమె ఫ్యాన్స్ అంత ఖుషి అవ్వలేదు. ఇక ఇప్పుడు ఆమె నెక్స్ట్ మూవీస్‌పై హైప్స్ రెట్టింపు అయ్యాయి. తాజాగా ఇండియన్ 2, ఉమా, సత్యభామ వంటి మూవీస్ చేస్తోంది. సత్యభామ సినిమాతో ఎలాగైనా సూపర్ హిట్ అందుకోవాలని తెగ ట్రై చేస్తోంది. ఒకవేళ ఈ మూవీ కనుక సూపర్ హిట్ అయితే కాజల్ పేరు మరోసారి టాలీవుడ్‌లో ట్రెండింగ్‌లోకి ఛాన్స్ ఉందని చెబుతున్నారు.
Also Read: పరిణితి చోప్రా గ్లామరస్ లుక్, ఫోటో వైరల్
ఇప్పటివరకు అడపాదడపా ఛాన్సులను అందుకున్న కాజల్ మరోసారి ఫామ్‌లోకి వచ్చేందుకు తన అందచందాలను ఆరబోయడం స్టార్ట్ చేసింది.తన ఏజ్ ఒకటే పెరిగిందని గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపిస్తుంది. ఇందుకోసం భారీగానే కసరత్తులు స్టార్ట్ చేసింది. వరుస గ్లామర్ షోస్ చేస్తూ తన సొగుసును డైరెక్టర్లకి రీచ్ అయ్యేలాగా చూస్తుంది. ఇక ఈమె అందచందాలను చూసిన వారంతా మంచి ప్లానే వేశారుగా మీ ప్లాన్స్ కనుక వర్క్ అవుట్ అయితే మీరు మళ్ళీ ఫామ్‌లోకి వస్తారంటూ కామెంట్స్ చేస్తున్నారు.