Sabdham Movie
Cinema, ఎంటర్‌టైన్మెంట్

Sabdam Movie | ‘శబ్దం’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

హీరో ఆది పినిశెట్టి‘వి’చిత్రం ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ‘వైశాలి’ మూవీతో ఫుల్ ఫేమ్ తెచ్చుకుని ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించారు. ఓ వైపు హీరోగా నటిస్తూనే విలన్‌ క్యారెక్టర్‌లో తన నటనతో అందరినీ షాక్‌కు గురి చేశారు. రంగస్థలం, సరైనోడు, ది వారియర్, వంటి చిత్రాల్లో విలన్‌గా చేసి తన పాపులారిటీ పెంచుకున్నాడు. ఇక చివరగా ఆయన ‘పార్ట్‌నర్’ తో ప్రేక్షకులను అలరించారు. ఆ తర్వాత ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. తెలుగు, తమిళ భాషల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆది పినిశెట్టి సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నారు.

ప్రస్తుతం ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘శబ్దం’. దీనిని ‘వైశాలి’ ఫేమ్ అరివళిగన్ తెరకెక్కిస్తుండగా.. 7జి ఫిల్మ్స్ శివ, అల్ఫా ఫ్రేమ్స్ బ్యానర్స్‌పై భానుప్రియ, శివ నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా.. మనోజ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. తెలుగు, తమిళ బాషల్లో ఏకకాంలగా రూపొందుతున్న ‘శబ్దం’ మూవీ ఫిబ్రవరి 28న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో థియేటర్స్‌లో రిలీజ్ కానుంది.