- మోదీకి దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చిన షర్మిల
- ఏపీలో పేలుతున్న షర్మిల మాటల తూటాలు
- మోదీ మాటలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన షర్మిల
- రాజకీయాలలో తీవ్ర దుమారం రేపుతున్న షర్మిల వ్యాఖ్యలు
- కాంగ్రెస్ పై విషం చిమ్ముతున్న మోదీ
- కాంగ్రెస్ వస్తే మంగళసూత్రాలు తెంచేస్తారని వ్యాఖ్య
- షర్మిల ఇచ్చిన షాక్ తో బీజేపీ నేతలు విలవిల
Sharmila Shoking Coments On Modi against Congress: తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీని స్థాపించి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఆంద్రప్రదేశ్ కాంగ్రెస్ లో పీసీసీగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల రాజకీయంగా దూకుడును ప్రదర్శిస్తున్నారు. ఓ పక్క జిల్లాల వారీ పర్యటనలు మరో పక్క ప్రత్యర్థులపై విసుర్లు…ఎలాంటి మొహమాటం లేకుడా సొంత అన్నపై ఘాటైన విమర్శలు చేయడమే గాక వైసీపీ నేతల తీరును ఎండగడుతున్నారు. ప్రత్యర్థుల విమర్శలకు ధీటైన సమాధానం చెబుతూ వారి మాటలకు తనదైన స్టయిల్ లో తూటాలను ఎక్కుపెడుతున్నారు. దేశ ప్రధానిని సైతం వదలడం లేదు షర్మిల..
మోదీకి కౌంటర్
ఎన్నికల వేళ కాంగ్రెస్‌పై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళలు మంగళసూత్రాలు తెంచి చొరబాటుదారులకు పంచి పెడుతుందంటూ ప్రధాని చేసిన కామెంట్స్‌పై కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని మోడీ వ్యాఖ్యలపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మాట్లాడుతూ.. ప్రధాని మోదీ పదేళ్లలో దేశంలో చేసిన అభివృద్ధి గురించి చెప్పుకోలేక కాంగ్రెస్ పార్టీపై విషం చిమ్ముతున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మంగళసూత్రాలు తెంచుతుందని.. మళ్లీ మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చేసిన అభివృద్ధి చెప్పుకోవాలి
ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా ప్రజల్లో ద్వేషం పెంచుతారా అని ప్రశ్నించారు. మరి మీరు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోద్రా అల్లర్లు సృష్టించి ఎన్ని మంగళ సూత్రాలు తెంచలేదు..? ఇప్పుడు ప్రధానిగా ఉండి మణిపూర్ ఘటనతో ఎన్ని మంగళ సూత్రాలు తెంచలేదని కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీ దేశ ప్రజల్లో ప్రేమను నింపే మాటలు మాట్లాడుతుంటే.. మోదీ మాత్రం మతాలను విడదీసి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రధాని మోదీకి దమ్ముంటే చేసిన అభివృద్ధి చెప్పుకోవాలి.. అంతేకానీ ముస్లింలను కించపరిచేలా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. ఇది బీజేపీకి, ఈ దేశానికి మంచిది కాదన్నారు. బీజేపీ ఈ దేశానికి చాలా ప్రమాదమని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీతోనే దేశ, రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని.. కాంగ్రెస్ పార్టీతోనే ప్రజాస్వామ్యానికి రక్షణ అని వ్యాఖ్యానించారు.