5th phase elections india upto 1 pm 36.73 percent average polling:
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ దేశంలో మరో దశ పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. సార్వత్రిక ఎన్నికల ఐదో విడతలో భాగంగా ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాలకు సోమవారం ఓటింగ్ జరుగుతోంది. వీటిలో మొత్తంగా 695 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ జాబితాలో రాజ్‌నాథ్ సింగ్, పీయూష్ గోయల్, స్మృతి ఇరానీ తదితర కేంద్ర మంత్రులతోపాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా వంటి ప్రముఖులు ఉన్నారు. అత్యధికంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో 14, మహారాష్ట్రలో 13, పశ్చిమ బెంగాల్‌లో 7, బిహార్‌లో 5, ఝార్ఖండ్‌లో 3, జమ్మూకశ్మీర్‌లో 1, లద్దాఖ్‌లో 1 స్థానానికి పోలింగ్ జరుగుతుంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలను ఏడు విడతల్లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దేశంలో మొత్తంగా 543 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఐదో దశతో కలిపితే 428 సీట్లకు పోలింగ్ పూర్తవుతుంది.
లదాఖ్ అత్యధికం
ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం అయింది. ఓటేయడానికి ఉదయమే భారీ క్యూలు దర్శనమిచ్చాయి. మధ్యాహ్నం ఒంటిగంట దాకా 36.73 శాతం నమోదయింది. అన్ని రాష్ట్రాల కన్నా లదాఖ్ లో 52.02 శాతం నమోదు కాగా రెండవ స్థానంలో పశ్చిమ బెంగాల్ లో 48.41 శాతం ఓటింగ్ నమోదు అయింది. బీహార్ 34.62 శాతం, జమ్మూ అండ్ కాశ్మీర్ 34.79 శాతం, ఝార్ఖండ్ 41.89 శాతం, మహారాష్ట్ర 27.78 శాతం, ఒడిశా 35.31 శాతం, ఉత్తర ప్రదేశ్ 39.55% శాతం ఓటింగ్ నమోదయ్యాయి.
Publisher : Swetcha Daily