Sunday, November 3, 2024

Exclusive

National:బాబోయ్ పారాసిటమాల్ !!

  • నాణ్యత ప్రమాణాల విషయంలో ఫెయిల్ అయిన పారాసిటమాల్
  • నివేదిక జారీ చేసిన సీడీఎస్సీఓ సంస్థ
  • హిమాచల్ ప్రదేశ్ నుంచి తయారుచేయబడిన ఔషధాలు
  • 22 రకాల ఔషధాల నాణ్యత ప్రశ్నార్థకం
  • 52 యాంటీ బయోటెక్ మందులపై జరిపిన పరిశోధన
  • కరోనా తర్వాత మరింత పెరిగిన పారాసిటమాల్ వాడకం
  • సైడ్ ఎఫెక్టుల ప్రభావం కూడా ఎక్కువే అంటున్న వైద్యులు
  • మూత్ర పిండాలు, కాలేయం దెబ్బతినే అవకాశం

52 Medicine Samples Including That Of Paracetamol Fail in Quality Test:

ఒంట్లో కొద్దిగా నీరసంగా ఉండి జ్వరం వచ్చినట్లు ఉంటే చాలు వెంటనే గుర్తొచ్చే మందు పారాసిటమాల్. వైద్యుడి అవసరం లేకుండానే నేరుగా మెడికల్ షాపుకు వెళ్లి పారాసిటమాల్ తెచ్చుకుంటాం. ఒకటో రెండో కాదు ఏకంగా షీట్ లకు షీట్ లు మాత్రలు తెచ్చుకుంటాం. ప్రతి ఇంట్లో పారాసిటమల్ స్టాకు పెట్టుకుంటారు. ఏ కొద్దిగా జ్వరం అనిపించినా వెంటనే మనకి మనమే వైద్యులుగా మారిపోతాం. అయితే ఇటువంటి వారికి ఓ షాకింగ్ సమాచారం. పారాసిటమాల్ ట్యాబ్లెట్ల పై జరిపిన క్వాలిటీ టెస్ట్ లో అది ఫెయిలయినట్లు తెలుస్తోంది.

క్వాలిటీ టెస్ట్ లో ఫెయిల్

సామాన్యులు విస్తృతంగా వాడే పారాసిటమల్, గ్యాస్టిక్ సమస్య నివారణ కోసం వాడే పాంటోప్రజోల్ సహా 52 యాంటి బయోటెక్ మందులు నాణ్యత ప్రమాణాల పరీక్షలో విఫలం అయినట్లు సీడీఎస్సీఓ సంస్థ పేర్కొంది. ఈ ఏడాది మే నెలలో సీడీఎస్సీఓ జారీ చేసిన నివేదిక ప్రకారం నాణ్యత లేని ఔషధాలలో హిమాచల్ ప్రదేశ్ నుంచి 22 తయారుచేయబడ్డాయని తెలిపింది.
అలాగే, గుజరాత్‌లోని జైపూర్, హైదరాబాద్, వాఘోడియా, వడోదర, ఆంధ్రప్రదేశ్, ఇండోర్ ప్రాంతాల నుంచి ఆయా ఔషధాల నమూనాను సేకరించామని సీడీఎస్‌సీఓ వెల్లడించింది. సంబంధిత ఫార్మాస్యూటికల్ కంపెనీలకు ప్రభుత్వ డ్రగ్ రెగ్యులేటర్లు నోటీసులు పంపారని, క్వాలిటీ టెస్టుల్లో ఫెయిల్ అయిన శాంపిల్స్‌ను మార్కెట్ నుంచి రీకాల్ చేస్తున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. పరీక్షలు నిర్వహించిన ఔషధాల్లో మూర్చ, ఆందోళన వంటి వాటికి చికిత్స కోసం ఉపయోగించే క్లోనజెపమ్, నొప్పి నివారణకు వాడే డిక్లొఫెనాక్, యాంటీ హైపర్‌టెన్షన్ డ్రగ్ టెల్మిసార్టన్, శ్వాసకోశ వ్యాధుల చికిత్సకు వాడే ఫ్లూకోనజల్ సహా పలు మల్టీ విటమిన్, కాల్షియం మాత్రలు ఉన్నాయి. గత ఏడాది కూడా హిమాచల్ ప్రదేశ్ నుంచి తయారైన మందుల్లో కొన్ని నాణ్యత ప్రమాణాల విషయంలో ఫెయిల్ అయినట్లు తెలుస్తోంది.

దుష్ప్రభావాలే ఎక్కువ

జ్వరానికి, నొప్పులకు, నీరసానికి అన్నింటికీ పారాసిటమాల్ వేసుకోవడం వల్ల చాలా నష్టాలే ఉంటాయంటున్నారు డాక్టర్లు. పారాసిటమాల్ అతిగా వాడితే ఏం జరుగుతుందంటే.. ఇళ్లల్లో ఏ మెడిసిన్ ఉన్నా లేకపోయినా పారాసిట‌మాల్ టాబ్లెట్ షీట్ మాత్రం కచ్చితంగా ఉంటుంది. జ్వరం, తలనొప్పి, దగ్గు.. ఇలా ప్రతి చిన్న సమస్యకు పారాసిటమాల్ వేసుకోవడం అలవాటు చాలామందికి. ఈ అలవాటు వల్ల లాంగ్‌టర్మ్‌లో చాలానే సైడ్ ఎఫెక్ట్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. పారాసిటమాల్ టాబ్లెట్లను అతిగా వాడడం వల్ల మోష‌న్స్‌, క‌ళ్లు తిర‌గ‌డం, వాంతులు వంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కొంతమందికి అల‌ర్జీలు కూడా రావొచ్చు. పారాసిటమాల్ టాబ్లెట్లను అదేపనిగా వాడడం వల్ల లాంగ్ టర్మ్‌లో మూత్ర పిండాలు, కాలేయం వంటి అవ‌య‌వాలు దెబ్బతినే అవకాశం ఉంది. ఆల్కహాల్ తీసుకున్నప్పుడు పారాసిటమాల్‌ వేసుకుంటే అందులో ఉండే కాంపౌండ్స్ ఆల్కహాల్‌లోని ఇథనాల్‌తో నెగెటివ్ రియాక్షన్ జరిపి అవయవాలను దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది అని డాక్టర్లు చెబుతున్నారు.

స్టెరాయిడ్స్ కూడా ఉంటాయి

ముఖ్యంగా పారాసెటమాల్ టాబ్లెట్ల‌ను ప‌రిమితికి మించి తీసుకోవ‌డం వ‌ల్ల అధిక చెమ‌ట‌లు, మోష‌న్స్‌, క‌ళ్లు తిర‌గ‌డం, వాంతులు, చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌లు, ఆక‌లి త‌గ్గిపోవ‌డం, క‌డుపు నొప్పి, అల‌ర్జీలు వంటివి తీవ్రంగా ఇబ్బంది పెడ‌తాయి. అలాగే పారాసెటమాల్ లాంటి టాబ్లెట్లలో స్టెరాయిడ్స్ ఉంటాయి.అందువ‌ల్ల వీటిని అధికంగా తీసుకుంటే మూత్ర పిండాలు, కాలేయం వంటి అవ‌య‌వాలు ఎఫెక్ట్ అయ్యే ప్ర‌మాదం చాలా ఎక్కువ‌గా ఉంటుంది. ఒక‌వేళ మూత్ర పిండాలు, కాలేయం సంబంధిత వ్యాధుల‌తో బాధ ప‌డుతున్న వారైతే వైద్యుల‌ను సంప్ర‌దించ‌కుండా పారాసెటమాల్, డోలో, క్రోసిన్ వంటి టాబ్లెట్ల‌ను పొర‌పాటున కూడా వేసుకోరాదు. కాబట్టి ఇక‌పై పారాసెటమాల్ టాబ్లెట్ల విష‌యంలో ఏ మాత్రం అజాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించ‌కండి అని గట్టిగా హెచ్చరిస్తున్నారు

Publisher : Swetcha Daily

Latest

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Don't miss

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్, భట్టి - సింగరేణికి అండగా నిలవండి - పెండింగ్ ప్రాజెక్టులపై తేల్చేయండి - పెండింగ్ విభజన హామీలను నెరవేర్చండి - కొత్త విద్యాసంస్థలు ఏర్పాటు అవసరం -...

Telangana:పేరు మారనున్న ‘ములుగు’

ములుగు జిల్లా పేరు మార్పు కు కసరత్తు మొదలు పెట్టిన అధికారులు ‘సమ్మక్క సారలమ్మ ములుగు’గా మార్చాలని ప్రతిపాదన మంత్రి సీతక్క విజ్ణప్తితో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల సమ్మక్క-సారలమ్మ ములుగు జిల్లాగా...

Telangana: ఎన్నాళ్లీ మూత ‘బడులు’

బీఆర్ఎస్ హయాంలో అస్తవ్యస్తంగా మారిన పాఠశాల విద్య 28 వేల పాఠశాలలకు గాను మూతపడిన సగం పాఠశాలలు పాఠశాల విద్యపై ప్రచారార్భాటమే తప్ప చేసింది శూన్యం బీఆర్ఎస్ విధానాన్ని తప్పుబడుతున్న విద్యావేత్తలు ...