Tuesday, May 28, 2024

Exclusive

Hyderabad : 23 సంవత్సరాలు..23 తప్పులు

  • అసంతృప్తి సెగల మధ్య బీఆర్ఎస్ పార్టీ 23వ ఆవిర్భవ వేడుకలు
  • టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా రూపాంతరం చెందిన పార్టీ
  • పేరు మార్చాక మొదలైన పార్టీకి మొదలైన కష్టాలు
  • గులాబీ బాస్ నియంతృత్వ ధోరణితో పార్టీకి చేటు
  • సంస్థాగత లోపాలతో ఓటమి పాలైన బీఆర్ఎస్
  • ఉద్యమకారులను పట్టించుకోని కేసీఆర్
  • ఎన్నికల ముందు కుంగిపోయిన మేడిగడ్డ
  • కాంగ్రెస్ పార్టీని లైట్ గా తీసుకున్న బీఆర్ఎస్
  • అడుగడుగునా బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టిన రేవంత్ రెడ్డి

23rd BRS Emergence day kcr 23 mistakes : తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా కేసీఆర్ 2001, ఏప్రిల్ 27న హైదరాబాద్‌లోని కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసమైన జలదృశ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించారు. ఈ పార్టీకి ప్రొఫెసర్ జయశంకర్ మేధోపరమైన మద్దతు అందించారు. ఈ పార్టీ తెలంగాణ ఉద్యమంలో ఏర్పడిన రాజకీయ శూన్యతను భర్తీచేసి, అసంతృప్తితో రగులుతున్న తెలంగాణ ప్రజలను రాష్ట్ర ఏర్పాటు దిశగా నడిపింపించాలనే ఉన్నతాశయంతో ఏర్పాటు చేశారు. తెలంగాణ ఏర్పాటు ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో రాజకీయంగా టీఆర్‌ఎస్ పార్టీ విజయవంతమైంది. ఆ తర్వాత కేసీఆర్ పదేళ్ల పాటు సీఎంగా ఉండేందుకు ఊతమయిన పార్టీ. అయితే కేసీఆర్ మధ్యలోనే పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామం..ఆయన పదవి కోల్పోవడం. అయితే ఈ 23 సంవత్సరాలలో కేసీఆర్ చేసిన 23 తప్పుల గురించి ప్రస్థావిస్తున్నాయి ప్రతిపక్షాలు.

ముఖ్యంగా కేసీఆర్ వైఖరే ఆయనకు, బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందులు తెచ్చి పెట్టిందంటున్నారు. ఎందుకంటే కేసీఆర్ నియంత మాదిరి తయారయ్యారని ప్రత్యర్థి పార్టీలు విమర్శించని రోజంటూ లేదు. ఇదే గులాబీదళం కొంప ముంచింది. ఇదే అహంకార వైఖరి బీఆర్ఎస్ ఓటమిలో ప్రధాన పాత్ర పోషించిందంటున్నారు. తెలంగాణ ప్రజలు ఆకలినైనా తట్టుకుంటారు గానీ.. ఆత్మగౌరవాన్ని చంపుకోరు. అందుకే ఓటు రూపంలో జనం సమాధానం చెప్పారంటున్నారు.

1.టీఆర్ఎస్ అంటే నే ఇంటి పార్టీ అని అందరూ భావించారు. కానీ కేసీఆర్ చేజేతులా ఎన్నికలకు ముందు ఆయన ఆ సెంటిమెంట్ ను ఆయనే కాలరాశారనుకోవాలి. బహుశ ఈసారి పేరు మారిస్తే విజయం లభిస్తుందని ఎవరైనా పండితులు సూచించి ఉండి ఉంటే చెప్పలేం కానీ.. కేసీఆర్ బీఆర్ఎస్ గా పేరు మార్చడం ఆ పార్టీ నేతల నుంచి కింది స్థాయి కార్యకర్తల వరకూ ఎవరకీ ఇష్టం లేదు. అంతా ఆయన ఇష్టం కాబట్టి … అధికారంలో ఉన్నారు కాబట్టి పైకి చెప్పలేకపోయారు కానీ పేరు మార్పిడి అనేది ఈ ఎన్నికల్లో పెద్ద ప్రభావమే చూపింది. ప్రధానంగా ఇప్పటికీ టీఆర్ఎస్ గానే పిలుచుకునే గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ అంటేనే ఒక రకమైన ఏహ్యభావం ఓటర్లలో కనిపించిందని అంతా అంటున్నారు.

2.జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే అత్యాశతో సీఆర్ చేజేతులా అవకాశాన్ని కాంగ్రెస్ కు ముందుగానే అధికారాన్ని అప్పగించేలా తన నిర్ణయాలు తీసుకున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. దేశంలో బలమైన జాతీయ పార్టీలను కాదని ఇక్కడి నుంచి వెళ్లి జాతీయ రాజకీయాల్లో కీలకం కావచ్చు. కానీ తన శక్తిని తాను తెలుసుకోవాలి. ఇవేమీ లేకుండానే ఆయన అత్యాశే కొంపముంచిందని రాజకీయ పండితులు చెబుతున్నారు.

3. ఇక ప్రగతి భవన్ ఒక గడీ మాదిరిగా మారింది.. ఎవరికీ అనుమతి లేకుండా పోయింది. ఒక దశలో ఫాంహౌజ్ సీఎం అని దేశమంతా ప్రచారం కూడా జరిగింది. ఇది కూడా కేసీఆర్ చేసిన పెద్ద తప్పని అంటున్నారు.

4. బీఆర్ఎస్ నేతల కబ్జాలు, దౌర్జన్యాలు, అరాచకాలు, అవినీతి పెరగడం కేసీఆర్ వాటిని లైట్ గా తీసుకోవడం మరో తప్పుగా చెబుతున్నారు.
5. లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరాన్ని బీఆర్ఎస్ నమ్ముకుంది. అయితే ఎన్నికలకు ముందు మేడిగడ్డ కుంగడం, అన్నారం లీకేజీలతో ఒక్కసారిగా గులాబీదళం షేక్ అయింది. ఆ విషయంలో కేసీఆర్ చాలా పెద్ద తప్పే చేశారని తెలుస్తోంది.
6. ఇక తెలంగాణ ఉద్యమ నినాదాలైన నీళ్లు, నిధులు, నియామకాల విషయంలోనూ కేసీఆర్ సర్కార్ పూర్తిస్థాయిలో పని చేయకపోవడం పెద్ద తప్పే
7. 2014లో కేసీఆర్ గద్దెనెక్కాక ఒక్కటంటే ఒక్కటి కూడా కొత్త రేషన్ కార్డు జారీ చేయలేకపోయారు. దీంతో చాలా మంది పేదలు రేషన్ కార్డులు రాక ఇబ్బందులు పడ్డారు. దీంతో పేద, మధ్య తరగతి వర్గాల వారు కారుకు దూరం అయ్యారు.

8. డబుల్ బెడ్రూంల విషయంలో చాలా చోట్ల కట్టినా బిల్డింగ్ లు శిథిల దశకు చేరుతున్నా ఇవ్వలేకపోయారు. ఎలక్షన్ల ముందు కొందరికి ఇచ్చి చేతులు దులుపుకున్నారు. దీంతో డబుల్ బెడ్రూం ఇండ్లు రాని వారంతా కేసీఆర్ సర్కార్ కు వ్యతిరేకంగా మారిపోయారంటున్నారు.
9. దళితబంధు, మైనార్టీ, బీసీ బంధు విషయంలోనూ లాభం కన్నా నష్టమే ఎక్కువ జరిగిందంటున్నారు. వచ్చింది కొందరికే.. అది కూడా బీఆర్ఎస్ నేతల అనుచరులకే అన్న వాదన జనంలో బలంగా పడిపోయింది.
10. ప్రభుత్వ ఉద్యోగులకు ఏ నెలలోనూ ఫస్టుకు జీతాలు వేయని పరిస్థితులు ఎదురయ్యాయి. ప్రతి నెల 20, 25వ తేదీ వరకూ జీతాలు వేశారు. దీంతో ఈఎంఐలు ఉన్న వారు చాలా ఇబ్బందులు పడ్డారు.
11.రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తక్కువ అంచనా వేసిన గులాబీ దళం. వైఫల్యాలను నిలదీసిన రేవంత్ రెడ్డి ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోవడం పార్టీకి మైనస్ గా మారింది.
12. స్కూలు ఫీజుల నియంత్రణలో దాదాపు చేతులెత్తేశారు. లక్షలకు లక్షలు ప్రైవేటు పాఠశాలలు వసూలు చేస్తున్నా వారిపై చర్యలు తీసుకోకపోవడంతో పేరెంట్స్ అంతా కేసీఆర్ కు దూరం అయ్యారు.
13. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు ఎక్కువవడం మైనస్ గా మారింది. పైగా అప్పులు తేవడం తప్పేలేదని…అగ్రదేశం అమెరికా సైతం అప్పులు తెచ్చుకుందని చెప్పుకోవడం జనాలకు రుచించలేదు.
14. అభివృద్ధి అంటే కేవలం హైదరాబాద్ ఒక్కటే అన్నట్టుగా ఫ్లైఓవర్లు, రోడ్లు, లైట్లు, బ్యూటిఫికేషన్ వీటినే ఫోకస్ చేశారు.మిగిలిన ప్రాంతాలను పక్కన పెట్టేశారన్న భావన జనంలో పెరిగిపోయింది.
15. ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ ఛైర్మన్లు, సర్పంచ్ లు ఇలా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులంతా నిధుల్లేక, పనులు లేక ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారు. వీరంతా కేసీఆర్ సర్కార్ పై తీవ్ర ఆగ్రహం అసంతృప్తితో పనిచేశారు.
16. ఎన్నికల ముందు చాలా మంది కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఇదర పార్టీలలో చేరిపోయారు. . నిజానికి పోలింగ్ బూత్ ల దాకా వెళ్లి జనాన్ని ఓటు వేయించడం, పోల్ మేనేజ్ మెంట్ లెక్కలు చూసుకోవడంలో ఈ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే కీలకపాత్ర పోషిస్తుంటారు. అలాంటిది వీరంతా ఒక్కసారిగా ఇతర పార్టీలలోకి షిఫ్ట్ అవడంతో సీన్ మారిపోయింది.
17. ఇక ప్రచారాల్లోనూ బీఆర్ఎస్ 2023 అసెంబ్లీ ఎన్నికలలో జనాన్ని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రకటనల్లోనూ క్రియేటివిటీ కనిపించలేదు. కేసీఆర్ ప్రసంగాలలోనూ వాడి వేడి తగ్గిందని జనం భావించారు.
18.2023 ఎన్నికలలో మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ప్రజలలోకి వెళ్లడం పెద్ద పొరపాటు. మూడోసారి కూడా తామే వస్తామని క్షేత్ర స్థాయిలో పెద్దగా ఫోకస్ చేయలేకపోవడం మైనస్ గా మారింది.
19. కేసీఆర్, కేటీఆర్ అహంకారపు మాటలు కూడా జనాలకు రుచించలేదు. ఓడిపోతే రెస్ట్ తీసుకుంటాం.. మాకేం నష్టం లేదు అని కేసీఆర్ పదే పదే చెప్పడం కూడా పోలింగ్ కు ముందు బీఆర్ఎస్ శ్రేణులు అస్త్ర సన్యాసం చేయడానికే ఉపయోగపడిందంటున్నారు. అధికారం శాశ్వతం కాదు అని కేటీఆర్ కూడా ఎన్నికలకు ముందే వేదాంత ధోరణితో మాట్లాడడం కూడా మైనస్ అయింది.
20.ఉద్యమకారులను మొత్తం పక్కన పెట్టడం.. ఉద్యమంతో సంబంధం లేని వారిని చుట్టూ చేర్చుకోవడం కూడా తెలంగాణ వాదులు ఉద్యమకారులు జీర్ణించుకోలేని విషయం.
21. గత రెండు ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ తో కేసీఆర్ ఈజీగా విజయం సాధించారు.. ఈసారి సెంటిమెంట్ పని చేయలేదు.
22. గంపగుత్తగా వేరే ఆలోచన లేకుండా సిట్టింగ్ లకే గత అసెంబ్లీ టిక్కెట్లు అందరి కన్నా ముందస్తుగా ఇవ్వడం పార్టీకి చేటయింది.
23.ఫ్యామిలీ పార్టీగా ముద్ర పడటం, ఒకే కుటుంబంలో నలుగురికి పదవులు ఇచ్చుకోవడం జనాలకు నచ్చలేదు.

ఇలాంటి తప్పులు చూసుకుంటే చాలానే జరిగాయి. అవే బీఆర్ఎస్ ఓటమిలో ప్రముఖ పాత్ర వహించాయని రాజకీయ పండితులు భావిస్తున్నారు. అందుకే ఈ సారి జరుగుతున్న పార్టీ ఆవిర్భవ వేడుకలు ఏవో తూతూ మంత్రంగా సాగుతున్నాయి తప్ప కార్యకర్తల్లో పెద్దగా మునుపటి ఉత్సాహం కనిపించడంలేదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

Publisher : Swetcha Daily

Latest

Hyderabad:బిల్డర్ మధు హత్యకు కారణం అదేనా?

Jeedimetla Bulder Madhu murder case back daughter love marriage...

Cyclone: వణికిస్తున్న తుపాను, భయపడుతున్న జనాలు

Remal Cyclone Effect On West Bengal And Bangladesh: బంగాళాఖాతంలో...

NTR:జనం మెచ్చిన ‘ప్రభంజనం’

Nandamuri Taraka Ramarao political fame with tollywood strong crazy...

Aiswarya Menon:అయినా తగ్గని ‘వాయువేగం’

Tollywood actress Aiswarya Menon upcoming movie Bhaje vayu vegam...

Hyderabad:ఆపరేషన్ నయీం డైరీ

మళ్లీ తెరపై నయీం డైరీ ..కేసు రీ ఓపెన్ కు...

Don't miss

Hyderabad:బిల్డర్ మధు హత్యకు కారణం అదేనా?

Jeedimetla Bulder Madhu murder case back daughter love marriage...

Cyclone: వణికిస్తున్న తుపాను, భయపడుతున్న జనాలు

Remal Cyclone Effect On West Bengal And Bangladesh: బంగాళాఖాతంలో...

NTR:జనం మెచ్చిన ‘ప్రభంజనం’

Nandamuri Taraka Ramarao political fame with tollywood strong crazy...

Aiswarya Menon:అయినా తగ్గని ‘వాయువేగం’

Tollywood actress Aiswarya Menon upcoming movie Bhaje vayu vegam...

Hyderabad:ఆపరేషన్ నయీం డైరీ

మళ్లీ తెరపై నయీం డైరీ ..కేసు రీ ఓపెన్ కు...

RS Praveen Kumar: మర్డర్ చేసినా.. మాట్లాడరేం?

- శ్రీధర్ రెడ్డి హత్య కేసులో చర్యలేవీ? - మంత్రి నిందితుడైతే చర్యలుండవా? - వారంలో చర్యలు తీసుకోకుంటే.. రోడ్డెక్కుతా? - ఫోన్ ట్యాపింగ్‌పై రాజకీయం తగదు - నిందితులకు శిక్ష పడక తప్పదు - బీఆర్ఎస్ నేత...

CM Revanth Reddy: మీ గ్యారెంటీకి వారంటీ అయిపోయింది

- ప్రగతిశీల శక్తులకు చిరునామా.. కేరళ - మాటల మోదీ ఇక ఇంటికి పోవాల్సిందే -కేరళ పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్‌ -అనంతరం హస్తిన వెళ్లిన సీఎం - సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గేలకు ఆహ్వానాలు PM Modi: ఈ సార్వత్రిక...

Jeevan Reddy: నెహ్రూ హయాంలో వ్యవసాయం, పరిశ్రమల అభివృద్ధి

Jawahar Lal Nehru: దేశం ఈ స్థాయికి చేరుకున్నదంటే అందుకు ప్రధాన కారణం జవహర్ లాల్ నెహ్రూ అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఆయన ఆధ్వర్యంలోనే సాగు పరంగా, పారిశ్రామికంగానూ దేశం...